నల్లకుబేరులకు నగదు ఎలా చేరుతుందంటే!
హైదరాబాద్: నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద బుధవారం బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు ఆర్బీఐ సరిపడా నగదు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే నల్లకుబేరులకు కోట్లలో నగదు చేరుతోందని ఆయన ఆరోపించారు. పట్టుబడిన నల్లకుబేరుల ద్వారా నిందితులను విచారించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పారు.