Provident Fund Tax
-
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
నా వల్లే మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఉపసంహరణపై పన్ను విధించాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. తన ప్రయత్నాలు, ఒత్తిడి వల్లే మోదీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. 'మధ్యతరగతి ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసింది. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలని నేను నిర్ణయించాను. నా ఒత్తిడి పనిచేసింది' అని 45 ఏళ్ల రాహుల్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ 40శాతం మించితే పన్ను విధిస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను తప్పపడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికుల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతికేత వ్యక్తమైంది. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్ పై అసంబద్ధమైన పన్ను విధించాలనుకున్న కేంద్రం ప్రజల మాట వినేలా ఒత్తిడి తెచ్చామని, ఈ ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక ధోరణి అని రాహుల్ విరుచుకుపడ్డారు. -
ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐతో రెవెన్యూ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. ప్రిన్సిపల్ అమౌంట్ కు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.