Provocative
-
చంద్రబాబు ఏ1గా కేసు నమోదు చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్ రూట్లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రేనని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు.. మహిళలు రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తే..
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది. అసలేం జరిగిందంటే..ఈ ఏడాది ఫిబ్రవరి 8న కోజికోడ్ జిల్లాలోని నంది బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కవితా శిబిరంలో చంద్రన్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా తన చేయి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని ఆరోపించింది. అక్కడ తన ఒళ్లో కూర్చోవాలని అడిగాడని, ఛాతీ నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత కూడా తనకు పదే పదే ఫోన్లు చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదులో చంద్రన్పై 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఈ కేసుపై కోజికోడ్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. చంద్రన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. నిందితుడు బెయిల్ దరఖాస్తుతోపాటు అందజేసిన ఫోటోగ్రాఫ్స్ను పరిశీలిస్తే యువతి(బాధితురాలు) ఆ సమయంలో కావాలనే లైంగికంగా ప్రేరేపించే దుస్తులను ధరించినట్లు ఉందని అన్నారు. సెక్షన్ 354ఏ ప్రకారం అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే ఈ కేసు నిలబడదన్న జడ్జి.. 74 ఏళ్ల దివ్యాంగుడైన చంద్రన్ యువతిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఛాతిని నొక్కాడనే అరోపణలు నమ్మేలా లేవని తోసిపుచ్చారు. కాబట్టి నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది
సియోల్: తమ దేశ సరిహద్దుల్లో దక్షిణ కొరియా, అమెరికా సంకీర్ణ సేనలు కవ్వింపు చర్యలకు ప్పాలడుతున్నాయని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతమైన ట్రూస్ గ్రామంలో దక్షిణ కొరియా, అమెరికా సంకీర్ణ సేనలు లైటింగ్ పరికరాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని నార్త్ కొరియన్స్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి పన్ముంజమ్లోని తమ రక్షణ స్థావరాలపై (గార్డ్పోస్ట్)లపై ఫ్లడలైట్లు ఫోకస్ చేస్తూ తమ దళాల సాధారణ కార్యకలాపాలకు ఆ రెండు దేశాలు భంగం కలిగిస్తున్నాయని ఉత్తర కొరియా ప్రకటనలో పేర్కొంది. గత సోమవారం నుండి దక్షిణ కొరియా, అమెరికాలు కొరియన్ పెనిన్సులా తీరం వద్ద వార్షిక సంయుక్త దళాల విన్యాసాల్ని మొదలైనప్పటినుంచి ఈ కవ్వింపు చర్యలు అధికమయ్యాయని ఉత్తర కొరియా ప్రకటనలో పేర్కొంది. ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడటం తమ సహనాన్ని పరీక్షించడమేనని దీనిపై ధీటుగా జవాబిస్తామని తెలిపింది. ఉత్తర కొరియా ప్రకటనపై దక్షిణ కొరియా నుంచి ఏమీ స్పందన లేకపోగా... ఉత్తర కొరియా ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మాత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఉత్తర కొరియా జూలై, ఆగస్టు నెలల్లో నాలుగు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇక ట్రూస్ గ్రామంలో ఉత్తర కొరియా ల్యాండ్మైన్లను అమర్చుతుందని మంగళవారం అమెరికా బలగాల కమాండర్ ఆరోపణలు గుప్పించా