PSLV-C35
-
తిరుమలలో పీఎస్ఎల్వీ సీ– 35 నమూనా రాకెట్‌కు పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పీఎస్ఎల్వీ–సీ35 నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 9.12గంటలకు పీఎస్ఎల్వీ–సీ35 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇస్రో నిర్వహించే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలేశుని ఆలయంలో నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్‌వెహికల్ ప్రోగ్రాం (ఎల్‌వీపీవీ) డైరెక్టర్ ఎస్కే కనుంగో, శాటిలైట్ కమ్యునికేషన్ ప్రోగ్రాం (ఎస్ఈపీ) డైరెక్టర్ సేతురామన్, సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్ తదితరులు ఆదివారం తిరుమల ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని, నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. -
రేపే పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం
-32 నిమిషాల్లో ముగియనున్న ప్రయోగం శ్రీహరికోట : భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ (షార్)నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగాన్ని 32 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 8.42 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. 48.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ సీ35 రాకెట్‌ను నాలుగు దశల్లో 32 నిమిషాల్లో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ35 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశలలో ప్రయోగించనున్నారు. ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమవుతుంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లులో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్ దశలో నింపిన 138. టన్నుల ఘన ఇంధనం సాయంతో 112 సెకెండ్లకు మొదటిదశను పూర్తి చేస్తారు. ఆ తరువాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264 సెకెండ్లకు రెండోదశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 587 సెకెండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1015 సెకెండ్లకు నాలుగోదశను పూర్తి చేసే విధంగా లాంచ్ రిహార్సల్స్‌లో నిర్వహించారు. -
రేపే పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం
-
పీఎస్ఎల్వీసీ-35 కౌంట్ డౌన్ మొదలు
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ - 35 రాకెట్ ప్రయోగం సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9.12 గంటలకు రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ప్రయోగానికి 48 గంటలపాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో స్కాట్‌శాట్ ఉపగ్రహం సహా... మరో ఏడు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్నట్లు షార్ గ్రూప్ డైరెక్టర్ విజయ్ సారథి వెల్లడించారు.