శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ - 35 రాకెట్ ప్రయోగం సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9.12 గంటలకు రాకెట్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ప్రయోగానికి 48 గంటలపాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో స్కాట్శాట్ ఉపగ్రహం సహా... మరో ఏడు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్నట్లు షార్ గ్రూప్ డైరెక్టర్ విజయ్ సారథి వెల్లడించారు.