
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 05 కౌంట్‌డౌన్ షురూ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 ఉపగ్రహ వాహకనౌక కౌంట్ డౌన్ ప్ర్రక్రియ ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4.10 ప్రయోగించనున్నారు.
కాగా కౌంట్‌డౌన్‌ను పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ బుధవారం షార్‌కు విచ్చేశారు. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ దశతో మూడోసారి చేస్తున్న ప్రయోగం కాబట్టి శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉన్నారు.