- రేపు ఉదయం 9.25 గంటలకు ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-34 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం ఉదయం 9.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటల కౌంట్‌డౌన్‌లో భాగం గా సోమవారం నాలుగోదశలో 2.5 టన్ను ల ద్రవ ఇంధనాన్ని నింపారు. మంగళవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపనున్నారు.
కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-34 నింగిలోకి దూసుకెళ్లేందుకు రెండోప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. ఘన ఇంధన దశలను షార్‌లోని స్ప్రాబ్‌లోనే పూర్తిచేసి రాకెట్‌కు అనుసంధానం చేశారు. తనిఖీలన్నీ పూర్తయ్యాక బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-34 రాకెట్ ద్వారా 1,288 కిలోల బరువైన 20 ఉపగ్రహాలను 20.30 నిమిషాలకు భూమికి అతిదగ్గరలోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సన్ సింక్రోసన్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు.
పీఎస్‌ఎల్‌వీ సీ-34 కౌంట్‌డౌన్ ప్రారంభం
Published Tue, Jun 21 2016 2:04 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement