సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05- నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్ వెహికల్ ప్రోగ్రాం డెరైక్టర్ ఎస్‌కే కనుంగో, శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రోగ్రాం డెరైక్టర్ సేతురామన్, సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) నుండి గురువారం సాయంత్రం 4.10 కి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇస్రో నిర్వహించే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలేశుని ఆలయంలో పూజలు నిర్వహించటం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆలయ అధికారులు నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.