నింగిలోకి మరిన్ని ఉపగ్రహాలు | More satellites into Space | Sakshi
Sakshi News home page

నింగిలోకి మరిన్ని ఉపగ్రహాలు

Published Wed, Mar 28 2018 10:12 AM | Last Updated on Wed, Mar 28 2018 10:12 AM

More satellites into Space - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరుమల : ఈ ఏడాది మరిన్ని అద్భుతమైన ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నామని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని శివన్‌ దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..జీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహాన్ని రేపు(గురువారం) ఉదయం 4:56 నిముషాలకు నింగిలోకి ప్రవేవపెట్టనున్నట్లు తెలిపారు.

కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని చెప్పారు. మరో 15 రోజుల్లో పీఎస్ఎల్‌వీ ఉపగ్రహం ప్రయోగం ఉంటుందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం చంద్రయాన్ ఉపగ్రహం ప్రయోగిస్తున్నామని, ఏప్రిల్లో చంద్రయాన్ ప్రయోగాత్మక పరిశీలన ఉంటుందని, అక్టోబర్లో పూర్తి స్థాయిలో ప్రయోగిస్తామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement