నెలాఖరులో పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల ఆఖరి వారంలో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 81 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీనికి సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదికపై తొలిదశ రాకెట్ అనుసంధాన పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రపంచంలోనే ఈ ప్రయోగం చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా పంపనున్న ఉపగ్రహాలను దేశ, విదేశాలకు చెందిన పలు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేశారు. ఒక్కో ఉపగ్రహం బరువు 10 కేజీల నుంచి వంద కేజీలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.