23న పీఎస్ఎల్వీ సీ–38 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న పీఎస్ఎల్వీ సీ–38 రాకెట్ ద్వారా 34 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్ మొదటి ప్రయోగ వేదికపై శుక్రవారం రాకెట్ శిఖర భాగాన ఉపగ్ర హాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహం, పలు దేశాలకు చెందిన 33 చిన్న ఉపగ్రహాలను పంపనున్నా రు. 23న ఉదయం 9.29 గంటలకు ప్రయోగాన్ని చేపట్టే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ అనుసంధాన పనులను ఈ నెల 28న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఐఆర్ఎన్ ఎస్ఎస్ సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో ఒకటి సాంకేతిక లోపం వల్ల పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో ఉపగ్రహాన్ని జూలైలో చేపట్టే పీఎస్ఎల్వీ సీ39లో పంపేందుకు సిద్ధమవుతున్నారు.