సూదిగాడు.. దొరికాడు?
ఏలూరు: ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటికి కునుకు లేకుండా చేసి జాతీయ వార్తల్లో సైతం నిలిచిన సైకో సూదిగాడు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని వీర వానరం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం.
మరికాసేపట్లో మీడియా ముందుకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని సంబంధిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.