psychological issues
-
ఎక్కువగా ఏడుస్తున్నారా? హార్ట్ ఎటాక్ రావొచ్చు, జాగ్రత్త!
కొన్ని మానసిక సమస్యలు శారీరక లక్షణాలతో వ్యక్తమవుతాయి. అయితే ప్రతి శారీరక లక్షణమూ మానసిక సమస్య కారణంగా కాకపోవచ్చు. కానీఙో రిపోర్ట్ ప్రకారం ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే బాధితుల్లో 15 శాతం మందికి అవి మానసిక సమస్యలతో వచ్చిన లక్షణాలు కావచ్చేమోనని గణాంకాలు పేర్కొంటున్నాయి. మానసిక సమస్యలు ఇలా శారీరక లక్షణాలతో ఎందుకు కనిపిస్తాయి, అనేకసార్లు చికిత్స తీసుకున్న తర్వాత కూడా పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే కొన్నిసార్లు అది మానసికమైన కారణాల వల్ల కావచ్చేమోనని ఎలా అంచనా వేయవచ్చు లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మానసిక సమస్యలు అనేక శారీరక వ్యవస్థలపై తమ ప్రభావాలను చూపవచ్చు. మానసిక సమస్యల కారణంగా కొన్ని శరీరంలో కనిపించే లక్షణాలెలా ఉంటాయో చూద్దాం. జీర్ణవ్యవస్థ పైన... గట్ ఫీలింగ్ అనే మాటను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఫీలింగ్స్ మనసుకు సంబంధించిన భావన కదా... మరి జీర్ణవ్యవస్థ అయిన శారీరకమైన అంశంతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు అని అనిపించవచ్చు. ఒక చిన్న పరిశీలనతో దీన్ని తెలుసుకోవచ్చు. ‘సెరిటోనిన్’ అనే స్రావం మానసిక ఉద్వేగాలకు కారణమవుతుంది. నిజానికి మానసిక అంశాలకోసం స్రవించడం కంటే... సెరిటోనిన్ అనేది జీర్ణవ్యవస్థలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆందోళన, వ్యాకులత జీర్ణవ్యవస్థలో మార్పులకు దారితీస్తాయి. దాంతో ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఆకలి వేయకపోవడం, వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ వ్యవస్థపై... మనసుకు తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దుఃఖం, ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే అది మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు రావడం తెలిసిన విషయమే. ఒళ్లునొప్పులు... మానసిక సమస్యలు కొన్నిసార్లు ఒళ్లునొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. మానసిక సమస్యలకూ, ఒంటినొప్పులకూ సంబంధమేమిటనే కోణంలో పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు అబ్బురపరుస్తాయి. ఉదాహరణకు సెరిటోనిన్, అడ్రినలిన్ వంటి రసాయన స్రావాలు మానసిక సమతౌల్యతకు దోహదపడుతుంటాయి. ఈ రసాయనాలను ‘కెమికల్ గేట్స్’గా పరిగణిస్తారు. గేట్ అనేది అనవసరమైన వాటిని రాకుండా నిరోధించడం కోసం అన్నది తెలిసిందే. అలాగే ఈ రసాయన గేట్స్... అనవసరమైన అనేక సెన్సేషన్స్‌ను నివారించి, అవసరమైన వాటినే మెదడుకు చేరవేసేలా చూస్తాయి. కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సెరిటోనిన్ వంటి ఈ ద్రవాలు తగ్గడంతో కెమికల్ గేట్స్ తమ కార్యకలాపాలను నిర్వహించలేవు. ఫలితంగా అవసరమైనవే కాకుండా అనవసరమైన సెన్సేషన్లు కూడా ఫిల్టర్ కాకుండా మెదడుకు చేరతాయి. దాంతో డిప్రెషన్ వంటి సమస్యలున్నప్పుడు... కొద్దిపాటి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తోచవచ్చు. చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి ఈ పరిణామాన్నే ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ సిండ్రోమ్’ అని అంటారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి (క్రానిక్ బ్యాక్ పెయిన్), శరీరంలోని అనేక భాగాల్లో నొప్పులు, మెడనొప్పి, కండరాల నొప్పి వంటివి కలిగే అవకాశముంది. శరీరం లాగే మనసుకూ జబ్బూ.. మన సమాజంలో మానసిన సమస్యలను బయటకు చెప్పుకోలేని సమస్య (స్టిగ్మా)గా చూస్తుంటారు. మానసిక సమస్య అని చెప్పుకోవడం కష్టం కాబట్టి... మనసు వాటిని శారీరక లక్షణాలుగా మార్చి వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇది కాన్షియస్గా జరిగే ప్రక్రియ కాదు. బాధితులకూ / పేషెంట్లకూ ఇలా జరుగుతుందని తెలియదు. అధిక ఒత్తిడి వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ పనితీరూ తగ్గి అది శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతుంది. అందుకే పరీక్షల సమయంలో లేదా పరీక్షలకు ముందు పిల్లల్లో / పెద్దల్లోనూ జ్వరాలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి... వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి లాగే మనసుకూ జబ్బు వచ్చే అవకాశముందని గుర్తించి, అది ఏమాత్రం తప్పు కాదని గ్రహించి, తగిన మందులు తీసుకుంటే... ఈ సమస్యలు రావడం తగ్గిపోయి, మాటిమాటికీ డాక్టర్ షాపింగ్ చేస్తూ, డబ్బు, ఆరోగ్యం వృథా చేసుకునే అవస్థలూ తగ్గుతాయి. ∙ -
‘గ్యాస్ లైటర్’ తో జాగ్రత్త.. వాళ్ల మాటలు నమ్మొద్దు!
శివ, ప్రియ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రియ కాస్తంత కలుపుగోలు మనిషి. ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంది. కానీ శివకు అది నచ్చదు. ముఖ్యంగా మగవాళ్లతో మాట్లాడటం అస్సలు నచ్చదు. ఆ విషయమై తరచూ ప్రియపై కోప్పడుతుంటాడు. ‘‘నీకు ఎప్పుడూ వేరే వాళ్లతో మాట్లాడటమే ఇష్టం. నాతో మాట్లాడాలంటే కష్టం. నీ కంటికి నేనే చేతకానివాణ్ని. అంతేగా?’’ అంటూ తరచూ గొడవపడేవాడు. ‘‘నేనెంత చెప్పినా, బ్రతిమాలుకున్నా నీ ప్రవర్తనలో మార్పు లేదంటే నీకు ఎలాంటి మానసిక సమస్య ఉందో అర్థం చేసుకో’’ అని హెచ్చరించేవాడు. మొదట్లో ప్రియ అతని మాటలు పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘శివ మాటలు నిజమేనేమో? నాకు నిజంగా మానసిక సమస్యలు ఉన్నాయేమో? లేకుంటే పదే పదే ఎందుకు అంటాడు?’’ అని అయోమయానికి గురవుతోంది. గ్యాస్ లైట్ గురించి అందరికీ తెలుసుకదా... గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఉపయోగించేది. అలాగే శివలాంటి వ్యక్తులు వ్యక్తులు తమ మాటలు, ప్రవర్తన ద్వారా మరో వ్యక్తి భావోద్వేగాలను రెచ్చగొట్టి వారిపై అదుపు సాధిస్తుంటారు. దీన్నే ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఈ పని చేసేవాళ్లను ‘గ్యాస్ లైటర్’ అంటారు. వీళ్లు ఇతరులపై నియంత్రణ సాధించేందుకు ప్రమాదకరమైన మైండ్ గేమ్‌లు ఆడతారు. అబద్ధాలు చెప్తారు, సమాచారాన్ని దాచిపెడతారు, నిందలు వేస్తారు, రకరకాల కథలు చెప్పి మేనిప్యులేట్ చేసి తనపై తాను నమ్మకం కోల్పోయేలా చేస్తారు. చివరకు నియంత్రణ సాధిస్తారు. మీ చుట్టూనే ఉంటారు... సహోద్యోగిని ఉద్యోగం నుండి తొలగించాలని యజమానిని ఒప్పించే వ్యక్తి, తోడికోడలిని హింసించాలని అత్తను ఎగదోసే కోడలు, నిత్యం భార్యను తప్పుపడుతూ చిన్నబుచ్చే భర్త... ఇలాంటి వారంతా గ్యాస్ లైటర్లే. నిరంతరంగా విమర్శించడం, నిందించడం, దుర్భాషలాడడం, భయపెట్టడం, బాధ్యతను తిరస్కరించడం, బంధంపై అసంతృప్తిని ప్రకటించడం... వారి ప్రాథమిక వ్యూహాలు. మీ ప్రతి ప్రవర్తనపై తీర్పులనిస్తూ మిమ్మల్ని అంతులేని అమోమయానికి, మిమ్మల్ని మీరే అనుమానించే స్థితికి తీసుకువస్తారు. మీరేదో తప్పు చేస్తున్నారని మీరే అంగీకరించేలా చేస్తారు. మీ చుట్టూ ఇలాంటి వారెవరైనా ఉన్నారేమో గమనించండి. ఆధిపత్యం కోసమే... గ్యాస్ లైటింగ్ అనేది ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాట నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి ఇలా ప్రవర్తిస్తుంటారు. ఏదో విధంగా తమ తప్పును కూడా పక్కవారిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటుంటారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు గ్యాస్‌లైటింగ్‌కు దారితీస్తాయి. ఈ డిజార్డర్స్ ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ తప్పును అంగీకరించరు. మీపై మీరు నమ్మకం కోల్పోతారు... గ్యాస్‌లైటింగ్ మీపై మీరు నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. మీలో ఏదో తప్పు ఉందని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఎవరినీ త్వరగా విశ్వసించలేరు. ఎవరి సహాయమూ తీసుకోలేరు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా నమ్మలేరు. నిరాశ, ఆందోళన, దీర్ఘకాలిక ఒత్తిడి, తీవ్రమైన మానసిక క్షోభకు కారణమవుతుంది. ఇది ఆ ప్రభావం నుంచి బయటపడ్డాక కూడా చాలాకాలం పాటు కొనసాగుతుంది. గ్యాస్ లైటర్లు తరచూవాడే వ్యాఖ్యాలు.. నేను నీ కోసమే అలా చేశాను. నేను నీకోసం అంత చేస్తే నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. అందుకే నీకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. మనం దీని గురించి గతంలో మాట్లాడుకున్నాం... నీకు గుర్తులేదా? అలా జరగలేదు. నువ్వే ఊహించుకుంటున్నావు. నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు తెలుసా? నువ్వెప్పుడూ ఇంతే.. మూడంతా చెడగొడతావు. నువ్వేం శుద్దపూసవు కాదులే. ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ల మాటలు నమ్మొద్దు గ్యాస్ లైటర్లు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టండి. "మీకు పిచ్చి" అని నిరంతరం చెప్పి మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. మీరు వాదించేకొద్దీ... మీ మాటలను మీపైనే ప్రయోగిస్తారు. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. మీరు తప్పుగా గుర్తుంచుకుంటున్నారని లేదా మానసిక సమస్యలో ఉన్నారని తరచూ కథలు చెప్తుంటారు. ఆ మాటలను నమ్మకండి. వాళ్లు చెప్పే కథలకన్నా మీ జాపకాలపైనే నమ్మకం ఉంచండి. గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలను కూడా పట్టించుకోవద్దు. గ్యాస్ లైటర్‌తో మీ బంధం లేదా అనుబంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించండి. మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి బంధం నుంచి బయటకు వచ్చేయండి. చదవండి: మానవ సంబంధాలపై ‘గ్యాస్ లైటింగ్’! -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని, కానీ లాక్డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం మాత్రం ఉండబోదని మహీంద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలో నేను ట్వీట్ చేసినట్లుగా లాక్డౌన్ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరం మాత్రమే కాదు మరో వైద్యపరమైన సంక్షోభానికి కూడా దారితీసే ప్రమాదముంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. మానసిక ఆరోగ్యంపై లాక్డౌన్ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. 49 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను సమగ్రమైన విధంగా ఎత్తివేయాలంటూ మహీంద్రా గతంలో కూడా ప్రతిపాదించారు. -
కూతురి సాక్షిగా.. సుత్తితో మోది భర్త హత్య!
ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు. రాత్రి ఇంట్లో టీవీ చూస్తోంది. కానీ.. టీవీలో వచ్చే క్రైం డ్రామా కంటే ఇంట్లో జరుగుతున్న ఘోరమే ఆ అమ్మాయిని ఎక్కువగా భయపెట్టింది. ఉన్నట్టుండి తన తల్లి అరుపు గట్టిగా వినపడటంతో ఏం జరిగిందోనని అక్కడకు పరిగెత్తుకువ వెళ్లింది. తీరాచూస్తే, జీవితంలో మర్చిపోలేని షాక్ ఆ అమ్మాయికి తగిలింది. కన్నతండ్రిని తన తల్లి సుత్తితో 24 సార్లు తలపై కొట్టి చంపేయడాన్ని ఆమె చూసింది. ఇంతకీ ఎందుకు ఆమె అంత దారుణానికి తెగబడిందో తెలుసా.. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెకు మందులు తేవడం ఆ భర్త కమల్‌కుమార్ (35) మర్చిపోయాడు. దాంతో ఆయన భార్య హన్సి (32) అతడిని సుత్తితో కొట్టి చంపేసింది. ఆ దంపతులకు నాలుగు, రెండు ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. అనాథగా పెరిగిన కమల్.. హన్సిని పెళ్లి చేసుకోడానికి ముందు నుంచే ఇద్దరూ నరేలా సెక్టార్ ఎ5లోని ఒకే కాలనీలో నివసించేవాళ్లు. హన్సికి మానసిక సమస్యలున్నాయి. ఆమెకు తరచు కోపం వస్తుంటుంది. అందుకోసం ఆమె విమ్‌హాన్స్‌లో చికిత్స పొందుతోంది. కమల్ చాలా మెత్తటి మనిషి. అతడంటే కాలనీలో అందరికీ ఇష్టమే. హన్సి తల్లిదండ్రులు కూడా అతడైతే తమ కూతురిని బాగా చూసుకుంటాడని భావించి ఇద్దరికీ ఆరేళ్ల క్రితం పెళ్లి చేసి, దగ్గర్లోనే ఓ అద్దె ఇల్లు కూడా చూసిపెట్టారు. సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో గల ఓ ఫ్యాక్టరీలో కమల్ పనిచేసేవాడు. ఎప్పుడూ తన భార్యను చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఆమె ఇలా చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది.. మంగళవారం రాత్రి కమల్ మందులు తేకపోవడంతో ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. అతడు ఏమీ తినకుండానే నిద్రపోయాడు. కొడుకు, చిన్నకూతురు కూడా నిద్రపోగా.. పెద్దమ్మాయి మాత్రం రాత్రి 11 గంటల వరకు టీవీ చూస్తూ ఉండిపోయింది. అంతలో ఈ దారుణం జరిగింది. తన తల్లి సుత్తితో నాన్నను కొట్టి చంపేసిన తర్వాత కత్తెర తీసుకుని దాంతో కూడా పొడిచిందని ఆ చిన్నారి చెప్పింది. ఆ తర్వాత.. ఇంటికి తాళం వేసి.. ఇంటిముందు నుంచి వెళ్తున్న పెళ్లి ఊరేగింపు చూస్తూ తాను కూడా ఊరేగింపులో పాల్గొంది. అప్పటికి ఆమె ముఖం మీద రక్తపు మరకలున్నాయి. చుట్టుపక్కల వాళ్లు అది చూసి, హోలీ రంగులేమో అనుకున్నారు. మర్నాటి ఉదయం ఆమె మామూలుగానే లేచి అందరికీ టిఫిన్ చేయసాగింది. పిల్లలకు నాన్నను నిద్రలేపమని కూడా చెప్పింది. కానీ పిల్లలంతా భయంతో ఒక మూల నక్కి ఉన్నారు. పెద్దపాప ఎలాగోలా ఇంటినుంచి తప్పించుకుని వెళ్లి, అమ్మమ్మకు, ఇతర బంధువులకు విషయం చెప్పింది. పోలీసులు హన్సిని అరెస్టు చేసి, వైద్య పరీక్షలకు పంపారు.