public transportation
-
తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ రూటు మార్చుకోనుంది. సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో భౌతికదూరం తప్పనిసరి కానున్న నేపథ్యంలో రద్దీ నివారణకు ఏం చర్యలు చేపడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం, జారీ చేసే మార్గదర్శకాల మేరకు ప్రజా రవాణా వ్యవస్థను నడపాల్సి ఉంటుంది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో తీసుకోనున్న జాగ్రత్తల ఫలితంగా ఈ రెండు రవాణా వ్యవస్థలు కొత్త ఫార్మాట్లో ప్రయాణించనున్నాయి. సగం మందితోనే మెట్రో జర్నీ.. లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి మెట్రో రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 60 రైళ్లు డిపోలకే పరిమితమైనా.. వీటి నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతభత్యాలు తడిసిమోపెడవుతున్నాయని మెట్రో వర్గాలు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికులు నిలుచునేందుకు వైట్ మార్కింగ్ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని మెట్రో నిపుణులు అంటున్నారు. ఒక్కో రైలు ప్రయాణికుల సామర్థ్యం (3 బోగీలు కలిపి) 900. ఇంతమందిని ఇప్పుడు అనుమతించే పరిస్థితి ఉండదు. వీరిలో సగం మందినే అనుమతించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకునే వరకు ఈ భౌతికదూరం తప్పదంటున్నారు. స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయడం, మాస్కులుంటేనే అనుమతించాల్సి ఉంటుంది. చదవండి: సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్ సిటీబస్సులో నో స్టాండింగ్.. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రణాళికలను రూపొం దిస్తోంది. గ్రేటర్ నగరంలోని బస్సులకు రెండువైపులా డోర్లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల సీట్ల సామర్థ్యం మేరకే ప్రయాణికులకు రవాణా సదుపాయం అందుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టాండింగ్ జర్నీకి అనుమతించరాదని నిర్ణయించారు. బస్సులు డిపోల్లో పూర్తిగా శానిటైజ్ అయ్యాకే రోడ్డెక్కుతాయి. ప్రయాణికుల మధ్య కచ్చితమైన భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేస్తారు. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని, ఇద్దరు కూర్చొనే సీట్లలో ఒక్కరినే అనుమతిస్తారు. ఏసీ, నాన్ ఏసీ లోఫ్లోర్ బస్సుల్లో ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేస్తారు. కరోనా జాగ్రత్తల దృష్ట్యా రూట్ల సంఖ్య తగ్గనుంది. మెట్రో రైలు అందుబాటులో లేని ప్రధాన రూట్లలోనే ఇవి నడుస్తాయి. ఇక బస్సుల్లో టికెట్లు ఇచ్చే పద్ధతికి ప్రత్యామ్నాయంగా గ్రౌండ్ టికెటింగ్ విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఏ మేరకు సాధ్యమనేది కూడా చర్చనీయాంశమైంది. చదవండి: భయం.. భయంగానే.. -
దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న 13 వేల రైళ్లు
-
9 రోజులు పాటు రైళ్లు, బస్సులు బంద్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ప్రజా రవాణా వ్యవస్థ అధికారికంగా స్తంభించింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 రోజులు ప్రజా రవాణాకు బ్రేక్ పడింది. ఇటు రైళ్లు, అటు బస్సులు.. ఇన్ని రోజులపాటు ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఇదే తొలిసారి. రైల్వే వ్యవస్థ ప్రారంభమైన ఈ 174 ఏళ్లలో, రాష్ట్రంలో బస్సు రవాణా మొదలైన 8 దశాబ్దాల్లో పాలక వ్యవస్థనే స్తంభింపచేయటం తొలిసారి చోటు చేసుకుంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం రైళ్లు, బస్సులు నిలిచిపోగా, దాన్ని కొనసాగిస్తూ ఈనెల 31 వరకు లాక్డౌన్ చేయటంతో వచ్చే 9 రోజులు కూడా రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండవు. సాధారణంగా సమ్మెలు, హర్తాళ్లు, బంద్‌ల సమయంలో వీటిని నిలిపేయటం సహజం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగొద్దన్న ముందు జాగ్రత్త చర్యలతో అధికారులు వాటిని పాక్షికంగా నిలిపేస్తారు. ఇక సమ్మెల సమయంలో ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరిస్తే వాటిని నడిపే అవకాశం లేక నిలిపేస్తారు. కానీ ప్రభుత్వమే నిలిపేయటం, అది పది రోజులపాటు కొనసాగటం తొలిసారి. దేశ చరిత్రలో మహమ్మారులు ప్రబలటం గతంలోనూ చోటు చేసుకుంది. కానీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ప్రజా రవాణా వల్ల ఆ వ్యాధులు ప్రబలుతున్నాయన్న కారణంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. (కరోనాకు మరో ముగ్గురి బలి) నిపుణుల హెచ్చరికలతో.. రైళ్లలో వేల మంది ప్రయాణికులు అతి సమీపంలో ఉంటూ ప్రయాణించటం పెను విపత్తుకు కారణమవుతుందంటూ గత వారం రోజులుగా నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చటంతో మన దేశంలో కూడా ప్రమాద ఘంటికలు మోగాయి. ఇతర కొన్ని ప్రభావిత దేశాలతో పోలిస్తే మన దేశం కొంత సురక్షితంగానే అనిపించటంతో, ప్రమాదం పెరిగే లోపు మేల్కొనటం ఉత్తమమని నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. రైళ్లను నిలిపేస్తే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జన ప్రవాహం బాగా తగ్గి వైరస్ విస్తరించే అవకాశం అంతమేర తగ్గిపోతుందని వారు పేర్కొంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రైల్వే అధికారులు కూడా రైల్వే బోర్డు, రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (జయహో జనతా..) కానీ ఒకేసారి రైళ్లను ఆపితే ప్రజా రవాణా స్తంభించి తీవ్ర ఇబ్బందులు వస్తాయని కేంద్రం తటపటాయించింది. కానీ గత నాలుగు రోజులుగా సంభవిస్తున్న పరిణామాలు కేంద్రాన్ని ఆలోచించేలా చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటిలో స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉన్నప్పటికీ, విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తుండటం, నిత్యం రైళ్లలో అలాంటి వారిని తోటి ప్రయాణికులు గుర్తించి ఫిర్యాదు చేయటంలాంటివి దీనికి కారణం. పరిస్థితి ఇలాగే ఉంటే చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు వరస సమావేశాలు నిర్వహించిన రైల్వే శాఖ చివరకు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన పచ్చజెండా ఊపారు. ఇటు హైదరాబాద్‌లో ఉన్న 121 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా 31 వరకు నిలిపేయాలని నిర్ణయించారు. అన్ని బస్సులూ బంద్ అన్ని రైళ్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే రాష్ట్రం పరిధిలో ఆర్టీసీ బస్సులన్నింటిని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సమ్మె సమయంలో 52 రోజుల పాటు బస్సులు స్తంభించినా, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలతో కొన్నింటిని నడిపింది. ఇప్పుడు ఏకంగా 10 రోజులు పాటు వాటికి పూర్తి విరామం ఇచ్చింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం బస్సులన్నింటినీ డిపోలకే పరిమితం చేయగా, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ నెలాఖరు వరకు డిపోలకే పరిమితం చేయనున్నారు. రైల్వే సర్వీస్ : దేశ వ్యాప్తంగా : 13వేల రైళ్లు ద.మ.రై. పరిధిలో : 744 రైళ్లు రోజువారీ ప్రయాణికులు : 2.5 కోట్లు టీఎస్ఆర్టీసీ : మొత్తం బస్సులు : 9,600 రోజువారీ ప్రయాణికులు : 87 లక్షలు -
తాగదు... తూలదు!
ఈ బస్సు పెట్రోల్ తాగదు. ఎందుకంటే విద్యుత్‌తో నడుస్తుంది. ఈ బస్సు నిద్రకు తూలదు. ఎందుకంటే ఇందులో డ్రైవర్ ఉండడు. బస్సు నడిపేటప్పుడు డ్రైవర్ వేరే ధ్యాసలో ఉన్నా... కాస్త నిద్రమత్తుతో జోగుతున్నట్టు కనిపించినా మనకు గుండెలు దడదడా కొట్టుకుంటాయి. అలాంటిది బస్సును కంట్రోల్ చేయడానికి అసలు డ్రైవరే లేకపోతేనో? అమ్మో అనిపిస్తోంది కదూ! కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భవిష్యత్తులో బస్సుల్ని డ్రైవర్లు నడపరు... వాటికవే నడుస్తాయి! బస్సు అంటే కండక్టర్ రైట్ రైట్ అంటుండాలి. స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ బస్సుని నడుపుతుండాలి. ఇదీ మనం చూసేది, ఊహించేది కూడా. కానీ ఇది 21వ శతాబ్దం. పాత వాసనలను వదిలించుకుని టెక్నాలజీ ఆసరాతో కొత్తకొత్త వింతల్ని సృష్టిస్తున్న కాలం. అలాంటి ఓ వింతే... ఈ ఈజెడ్-10 బస్సు. దీనిలో డ్రైవర్ ఉండడు. స్టీరింగ్ వీలే కనపడదు. అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అడ్డంకులను అధిగమిస్తూంటే... జీపీఎస్ వంటి అప్లికేషన్ల సాయంతో సాగిపోతుంది. గమ్యం చేరిపోతుంది. ఇంతకీ ఎక్కడుందీ బస్సు?! పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ బస్సును ఫిన్లాండ్లో చాలాకాలంగా వాడుతున్నారు. ఒకేసారి 12 మంది వరకూ ప్రయాణం చేయవచ్చు. ముందుగా నిర్దేశించిన మార్గంలో షటిల్ సర్వీస్ చేసేందుకు వాడుతున్నారు దీన్ని. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈజెడ్-10 మెట్రో స్టేషన్లను, బస్టాండ్లను అనుసంధానించేందుకు, పెద్ద పెద్ద మాల్స్ లేదా ఎయిర్‌పోర్టుల్లో ఒకవైపు నుంచి ఇంకోవైపునకు వెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. బస్సు, ట్రామ్‌ల మాదిరిగా దీనికి ఏ విధమైన మౌలిక సదుపాయాలూ అవసరం లేదు. నిర్దేశిత రూట్లలో మొబైల్ యాప్ ద్వారా కూడా బస్సు సర్వీసు పొందవచ్చు. బస్సు రాగానే దానిపైన ఉండే బటన్ నొక్కితే తలుపులు తెరుచుకుంటాయి. వికలాంగులు లేదా చిన్నపిల్లల ట్రాలీతో ఉండేవారి కోసం ప్రత్యేకమైన ర్యాంప్ కూడా ఉంది. -
ముంబై తరహా ప్రజారవాణాకు ముందడుగు
మెరుగైన రవాణా సదుపాయాల కల్పన దిశగా.. సాక్షి, సిటీబ్యూరో: రోజూ లక్షలాది మందికి రవా ణా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందిన ముంబై తరహా ప్రజా రవాణా వ్యవస్థకు మన నగరం నూతన సంవత్స రం శ్రీకారం చుట్టనుంది. ముంబై తో పోల్చితే ప్రజా రవాణా రంగంలో మనం వెనుకబడే ఉన్నాం. బృహణ్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైలో రోజుకు 4,680కి పైగా బస్సులు నడుపుతోంది. వాటిలో 1,500 బస్సులు సీఎన్జీతో నడుస్తున్నాయి. ప్రజలు సొంత వాహనాల్లో కంటే ఎక్కువ శాతం ప్రజా రవాణానే వినియోగించుకుంటున్నారనేందుకు నిదర్శనంగా 50 లక్షల మంది అక్కడ బస్సుల్లోనే పయనిస్తున్నారు. 2,342 ముంబై సబర్బన్ రైల్వే సర్వీసుల్లో రోజుకు 80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 3,850 బస్సులు ఉన్నాయి. 34 లక్షల మంది ప్రయాణికులు రోజూ ఈ బస్సులను విని యోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లో మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన 100 సీఎన్జీ బస్సులకు పూర్తిస్థాయిలో ఇంధ నం సరఫరా కావడం లేదు. మెట్రోలగ్జరీ వంటి అత్యాధునిక ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చినా ప్రజలు వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తు తం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు వీటిని వినియోగించుకుంటున్నారు. గతేడాది ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండోదశ పనులు పూర్తయితే మరో 100 రైళ్లు, లక్ష మందికిపైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం లభించగలదని అంచనా. ఏమైనప్పటికీ విశ్వనగరంగా ఎదగనున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడున్న దానికంటే రెండింతలు అభివృద్ధి చెందనుంది.