'శరద్ పవార్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు'
ముంబై: ఎన్సీపీ నేత శరద్ పవార్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పూణేలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణానికి కారణమైన సామూహిక అల్లర్లకు బీజేపీ కారణమంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
శరద్ పవార్ ఓ ఉగ్రవాదిలో మాట్లాడుతున్నారని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికల్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న పవార్ కు మతి తప్పి మాట్లాడుతున్నారని ఉద్దవ్ విమర్శించారు.
26/11 దాడులకు సూత్రధారైన హఫీజ్ సయీద్ మాదిరిగానే పవార్ మాట్లాడుతున్నారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్దవ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం వల్లనే సామూహిక దాడులు జరిగాయని పవార్ వ్యాఖ్యలు చేశారు.