'శరద్ పవార్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు' | Sharad Pawar like Hafiz Saeed: Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

'శరద్ పవార్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు'

Published Wed, Jun 11 2014 3:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

'శరద్ పవార్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు'

'శరద్ పవార్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు'

పూణేలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణానికి కారణమైన సామూహిక అల్లర్లకు బీజేపీ కారణమంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముంబై: ఎన్సీపీ నేత శరద్ పవార్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పూణేలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణానికి కారణమైన సామూహిక అల్లర్లకు బీజేపీ కారణమంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
శరద్ పవార్ ఓ ఉగ్రవాదిలో మాట్లాడుతున్నారని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికల్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న పవార్ కు మతి తప్పి మాట్లాడుతున్నారని ఉద్దవ్ విమర్శించారు. 
 
26/11 దాడులకు సూత్రధారైన హఫీజ్ సయీద్ మాదిరిగానే పవార్ మాట్లాడుతున్నారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్దవ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం వల్లనే సామూహిక దాడులు జరిగాయని పవార్ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement