బస్సులో ప్రత్యక్షమైన నాగుపాము
చిత్తూరు : బస్సులో బుస్సుమంటూ నాగుపాము ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బోయకొండ నుంచి కర్ణాటకకు బయలుదేరిన బస్సులో ఉన్నట్టుండి ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును చూసి ప్రయాణికులు భయంతో బస్సు దూకి పరుగులు తీశారు.