punuru Gautam Reddy
-
ఘనంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విజయవాడ: సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్టీ జెండాను వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి ఆవిష్కరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పునూరు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతిగా ఉన్నారన్నారు. ‘‘ఆప్కస్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 1,30,000 మందికి పర్మినెంట్ ఎంప్లాయిస్ తీసుకొచ్చారు. నాలుగు లక్షల మందిని వాలంటీర్లు ఏర్పాటు చేశారు’’ అని గౌతమ్‌రెడ్డి తెలిపారు.సంక్షేమం అందించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులను, కార్మికులను ఇబ్బంది పెట్టలేదని.. ఆటో కార్మికులకు వైఎస్ జగన్ రూ.పదివేలు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు కార్మికులు అభ్యున్నతను విస్మరించారు. కోవిడ్ సమయంలో కార్మికులకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఎస్సార్సీపీ ప్రతి గ్రామంలో కార్మికులకు అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చి..మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాహన మిత్రతో కార్మికులకు అండగా నిలిచారు. చంద్రబాబు వాలాంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను ఎత్తివేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ప్రశాంతంగా విధులు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు. సంవత్సరం గడుస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం లేదు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేం అని గవర్నమెంట్ రాకమందు చంద్రబాబు తెలియదా’’ అంటూ ఆమె ప్రశ్నించారు.కార్మికులకు వ్యతిరేకంగా కూటమి సర్కార్ నిర్ణయాలు: మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2 వేల మందికి ఆటో కార్మికులకు చేయూతను అందించింది. కూటమి ప్రభుత్వంలో ఆటో కార్మికులపై చలనాలు చేస్తున్నారు. 9 నెలల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు ఏం చేశారో చెప్పాలి. విజయవాడ నగరంలో హ్యాకర్లుపై దౌర్జన్యలు పెరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? నిన్న(గురువారం) జరిగిన పరిషత్ ఎన్నికలో విజయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు ఆపలేకపోయారు. ఎంపీటీసీలు, జడ్పిటిసిలు వైఎస్సార్సీపీ పక్షాన బలంగా నిలబడ్డారు’’ అని ఆయన చెప్పారు. -
తప్పుడు ఆరోపణలు నిరూపించడానికే...
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫైళ్లను కాల్చివేయడం ఒక ఆనవాయితీగా మారినట్లు కనిపిస్తోంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్ ఆఫీస్‌లో రికార్డులు తగలబడితే ఏకంగా డీజీపీ, సీఎస్‌లు హెలికాప్టర్లో అక్కడకు వెళ్లడం ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు తన తరహా మార్కు రాజకీయాలను చూపించడంలో దిట్ట. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరగలేదనే సంగతి నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజుల్లోనే ప్రభుత్వ పెద్దలందరికీ అర్థమైంది. తాము చేసిన ఆరోపణలను నిరూపించడానికి దారిలేక రికార్డులను వాళ్లే తగలబెట్టిస్తున్నట్లుంది. ‘వైసీపీవాళ్లు... వాళ్లు చేసిన అక్రమాలు బయటపడకుండా ఫైళ్లను తగలబెట్టిస్తున్నార’నే ప్రచారం చేయడానికి ఈ తరహా దహన కార్యక్రమాలు చేపడు తున్నా రనేది ప్రజల అవగాహన.ఎన్నికల ఫలితాల ప్రకటనకు, ప్రమాణ స్వీకారానికి మధ్య వారం రోజుల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలోనే గతంలో వారికి వచ్చిన సమాచారాన్ని సరిచూసుకునే వెసులుబాటు కలిగింది. అందులో భాగంగానే 20 ఏళ్ల తరు వాత 22 ఏ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా తెరపైకి తీసుకొచ్చి జగన్ మీద తాము చేసిన తప్పుడు ప్రచారానికి వాస్తవ రూపం తీసుకురావాలని భావించారు.అందులో భాగంగా అధికార యంత్రాంగాన్ని 24/7 పనిచేయించి రికార్డులను జల్లెడపట్టారు. ఎక్కడా లోపం లేకపోవడంతో రికార్డులను కాల్చివేతకు పూనుకుంటున్నారు. నేరం మాత్రం వైఎస్సార్సీపీపై వేస్తున్నారు. అయితే, దొంగ ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడన్న నిజాన్ని ఇక్కడ వారు మరచి పోయారు. ఫిజికల్‌గా ఉన్న ఫైళ్లను తగులబెట్టారేగానీ ఆన్లైన్లో ఉన్న ఫైళ్ల సంగతిని మరచిపోయినట్లు ఉన్నారు. అదీకాకుండా ఇదే ఫైలుకు సంబంధించిన వివరాలు కింద ఉండే ఎమ్మార్వో కార్యాలయంలోనూ, పైన ఉండే కలెక్టర్ కార్యాలయంలోనూ ఉంటాయి. వాటిని ఏం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వాస్తవం ప్రజలకు తెలుస్తుందని గమనించి బాబు తదితరులు ఇదే తరహాలో మరికొన్ని ఘటనలు చూపి ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కొంతమంది అధికారులపై వారికి తెలియకుండానే విచారణ నిర్వహించారు. వారి విచారణలో ఏం తేలకపోయినా వారి అరెస్టులు, విచారణలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 16 మంది ఐపీఎస్‌లకు మెమో జారీ చేశారు.అనూహ్య పరిణామాల నేపథ్యంలో అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు... జగన్ పార్టీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తు న్నట్లుంది. వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలు, ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం మూసేసిన కేసులు తిరగదోడటం, ఆ పార్టీ కార్యకర్తలపై తమ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం... వంటివన్నీ ఇందులో భాగమే. ‘సూపర్ సిక్స్’ అమలును వదిలి అమరావతి రాజధానిపై దృష్టిపెట్టడం, కళాశాల ఫీజుల పెంపు నిర్ణయం... ఇలా అనేక అంశాలపై ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిని గమనించిన ప్రజలు ఇప్పుడు పేదలకు–పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ జగన్ చేసిన కామెంట్‌ను గుర్తు చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణగా రాజధాని ప్రాంతం ఆర్5 జోన్లో పేదలకు ఇచ్చిన ఇళ్లను చంద్ర బాబు సర్కార్ రద్దుచేసిన అంశాన్ని ప్రజలు చూపిస్తున్నారు.తిరుమల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వాడితే తప్పన్న బాబు... చంద్రగిరి అభివృద్ధికి ఇప్పుడు ఇవే నిధులు వాడుతున్నారు. ఉపాధ్యాయులతో మరుగు దొడ్ల ఫొటోలు తీయించడంపై తప్పుబట్టిన బాబు సచివాలయ ఉద్యోగులతో ఇదే పని చేయిస్తున్నారు. ఇసుకను తమ నేతలకు దోచి పెడుతున్న విషయాన్నీ ప్రజలు గమనిస్తు న్నారు. నిజంగా ప్రజల్లో ఇంత త్వరగా ప్రస్తుత ప్రభుత్వంపై పెదవి విరుపు వస్తుందని ఎవరూ ఊహించలేదు.పాలనపై దృష్టిపెట్టాల్సిన పాలకులు వ్యక్తిగత కక్షలపై దృష్టిపెట్టడంతో పాలన అస్తవ్యస్తమవుతోంది. పాత పథకాలు నిలిచిపోవడం ఒక వైపు, ఎప్పుడు ఎవరు ఎవరిని కొడతారో, చంపుతారో తెలియని పరిస్థితి మరోవైపు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ స్థితిలో ప్రజాదరణ పొందిన వాలంటీర్ వ్యవస్థను తీసేసి మళ్లీ ‘జన్మభూమి–2’ తీసుకురావాలని అను కోవడం సరికాదు. ఇదీ మొత్తంగా రెండు నెలల నారా వారి పాలన సాధించిన ఘనకార్యం. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుమొబైల్: 98481 05455 -
కార్మిక వ్యతిరేకి టీడీపీ సర్కార్
- సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ మద్ధతు - వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి వెల్లడి విజయవాడ (గాంధీనగర్) కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించడంలో కేంద్రం కంటే చంద్రబాబు ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. గత ఏడాది మార్చిలో ఐదు ప్రధాన కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరిస్తూ శాసనసభలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేశారన్నారు. దీంతో గతంలో ఉన్న అనేక హక్కులను కార్మికులు కోల్పోయారని ఆయన మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి సంపద చేకూర్చే కార్మికులు, రైతులు ఇలా అన్ని వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ దాడిని కొనసాగిస్తున్నాయన్నారు. సంస్కరణల పేరుతో మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కులను అణచివేస్తున్నాయన్నారు. భవననిర్మాణ కార్మికుల కోసం వసూలు చేసిన సెస్సును తమ రాజకీయ ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కొత్తగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కార్మిక చట్టాలను అమలుచేయకుండా తప్పించుకునే అవకాశం యజమానులకు ప్రభుత్వం కల్పించిందన్నారు. బాబువస్తే జాబువస్తుందని ఆశించిన యువతకుకు చంద్రబాబు పాలన నిరాశ మిగిల్చిందన్నారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయకపోగా వేలాది ఉద్యోగులను తొలగించిందన్నారు. ధర్నాల్లో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా స్కీంవర్కర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అదేశాలు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శమన్నారు. గత సెప్టెంబర్ 2న 15 కోట్ల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే మోదీ సర్కార్‌లో చలనం లేదన్నారు. 12 కోర్కెలతో కూడిన వినతి పత్రం సమర్పిస్తే సంప్రదింపులు జరిగి ఒప్పందానికి వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నమ్మబలికిందన్నారు. ఆ తర్వాత ఒక్కరోజుకూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదన్నారు. సెప్టెంబర్ 2న మరోసారి దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఈ దఫా 50 కోట్లమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తారన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రేడ్‌యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి పాల్గొన్నారు.