19న ఉరవకొండకు దగ్గుపాటి పురందేశ్వరి రాక
అనంతపురంసెంట్రల్: నియోజకవర్గ విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న ఉరవకొండలో బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లాఅధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆపార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా మోర్చా ఇన్చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పెన్నానది నిర్మించిన చాగళ్లు, పెండేకల్లు ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో పాలకులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను సమానదృష్టి చూడాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.