‘పురసేవ’ యాప్ ఆవిష్కరించిన ఏపీ సీఎం
అమరావతి: ‘పురసేవ’ మొబైల్ యాప్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు, పురపాలశాఖకు మధ్య వారధిగా ‘పురసేవ’ యాప్ ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ యాప్‌తో మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు.