purchasings
-
ఆర్మీ ఆధునీకరణకు రూ.13,165 కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ. 13,165 కోట్ల కేటాయింపులకు రక్షణశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్ మార్క్–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సంస్థ హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేసినట్టుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.7,523 కోట్లతో అర్జున్ ట్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే హెలికాప్టర్ల కొనుగోలుకి రక్షణ శాఖ భారీగా కేటాయింపులు జరిపింది. డబుల్ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తమ్మీద భారత్ ఆర్మీ ఆధునీకరణ కోసం రూ.13,165 కోట్లు కేటాయింపులు జరిపితే, అందులో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని ఆ ప్రకటన వివరించింది. -
ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!
-
ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!
- ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా కసరత్తు - కొనుగోళ్లకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. లెవీ సేకరణ ఇకమీదట ఉండదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ధాన్యం సేకరణ మొదలు నిల్వ, మిల్లింగ్, రవాణా వరకు అన్నిరకాల వ్యవహారాలను ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ధాన్యం నాణ్యత పరీక్షల బాధ్యత సైతం ప్రైవేటు సంస్థల వ్యక్తుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలో పీపీపీ భాగస్వామ్య విధానాన్ని అనుసరించాలని సూచించింది. ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలను అమల్లోకి తెచ్చేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి పౌరసరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. వ్యవహారమంతా ప్రైవేటు చేతుల్లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం వరకు కొనసాగుతూ వచ్చిన ధాన్యం సేకరణ విధానాన్ని వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ చేస్తున్న పీఏసీ, ఐకేపీ, డీసీఎంఎస్‌లు ఈ మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే ఐకేపీ పౌర సరఫరాలశాఖకు తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సమయంలో కేంద్రం పీపీపీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థ లేక వ్యక్తులను ఎంపిక చేసి ధాన్యం సేకరణ, మిల్లింగ్‌తోపాటు గోదాములు, మండల్ లెవల్ పాయింట్ (ఎంఎల్ఎస్) పాయింట్లోకి రవాణా బాధ్యతలను వారికి కట్టబెట్టాలని సూచించింది. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు నైపుణ్యంగల సంస్థల పర్యవేక్షణలో అంటే.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఈ ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులకు ప్రభుత్వాల తరఫున బడ్జెట్ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం బాధ్యతను ప్రైవేటు సంస్థలే చూసుకుంటుండటంతో వారి చేతుల్లోకి వెళ్లినట్లే అవుతుంది.