ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. లెవీ సేకరణ ఇకమీదట ఉండదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.