Purushothaman
-
ఉత్తమ చిత్ర పురుషోత్తమన్
న్యూయార్క్‌లోని టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్ పురుషోత్తమన్... బెంగళూరులోని ఒక ఎడ్వర్టైజింగ్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్లను గీయడంలో ప్రాక్టిస్ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది. 2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు. ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు. న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్ఎఫ్టీ ఎన్వైసీ’ ప్రదర్శన ‘ఎన్ఎఫ్టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి. ‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్. న్యూయార్క్ టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్ ప్రదర్శించడం అజయ్ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు. గత సంవత్సరం అజయ్ మొదలుపెట్టిన ‘టాయ్ స్టోరీస్ ప్రొఫైల్’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక హిప్–హప్ పాటకు డ్యాన్స్ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్3, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్. సాధారణ ఆర్టిస్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్ పురుషోత్తమన్ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మోస్ట్ పాపులర్ నాన్–ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీ క్రియేటర్’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ పురుషోత్తమన్. తనకు వచ్చే కంటెంట్ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్ఎఫ్టీలను రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది. -
పెళ్లిళ్ల రాయుడు.. పురుషోత్తమన్
అన్నానగర్ (చెన్నై): అతడి పేరు పురుషోత్తమన్...తానో సచ్చీలుడిగా ప్రచారం చేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరిని.. అలా ఏకంగా ఎనిమిది మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఆపై వారి నుంచి కోట్లాది రూపాయాలు కాజేసి పరారైపోయాడు. పాపం పండడంతో పెళ్లిళ్ల బ్రోకర్లతో పాటు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు వెళ్ళలూర్కి చెందిన పురుషోత్తమన్ (57) తనను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుని భార్య మృతి చెందడంతో రెండో వివాహం చేసుకోదలిచినట్లు కోయంబత్తూరులోని ‘మెట్టిఒలి కళ్యాణ సమాచార కార్యాలయం’లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ కార్యాలయాన్ని నడుపుతున్న మోహనన్ (65), అతని భార్య వనజాకుమారి (53)లు కుముదవల్లి (45) అనే మహిళ వద్ద పురుషోత్తమన్ గురించి గొప్పగా చెప్పారు. కుముదవల్లి..పురుషోత్తమన్‌ని నేరుగా కలవగా తన భార్య మృతి చెందడం, కళాశాలలో చదువుతున్న కుమార్తె ఆలనపాలన చూసుకునేందుకే రెండో వివాహానికి సిద్ధమైనట్లు నమ్మబలకడంతో గతేడాది ఆగస్టులో పురుషోత్తమన్‌ను పెళ్లి చేసుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చినట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కుముదవల్లి నుంచి రూ.3 కోట్లు తీసుకుని పురుషోత్తమన్ పరారైయ్యాడు. అనుమానం వచ్చిన కుముదవల్లి అతడి గురించి ఆరాతీయగా కోయంబత్తూరుకు చెందిన సబితా, ఉషారాణి, శాంతి, సుశీల, చెన్నై అన్నానగర్‌కి చెందిన ఇందిరాగాంధీ, ఈరోడ్‌కు చెందిన చిత్ర సహా మొత్తం ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుని కోట్లాది రూపాయలు కాజేసి వారిని మోసం చేసినట్లు తెలుసుకుంది. తండ్రి మోసాలకు కుమార్తె గీతాంజలి కూడా సహకరిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు కుముదవల్లి ఫిర్యాదు చేసింది. -
భార్యలు 1, 2, 3...8, అందరినీ మోసం..
కోయంబత్తూరు : సరకు రవాణా వ్యాపారం అంతగా లాభసాటిగా సాగడం లేదు. అందుకే ‘పెళ్లి’ని వ్యాపారంగా మార్చి.. తాళిని ఎగతాళి చేయాలని భావించాడో ఘనుడు. అందులో విజయం సాధించడమే కాక భార్యలను మోసంగించి కోట్లకు పడగలెత్తాడు. వరుసపెట్టి ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని వారిని రూ.4.5 కోట్ల మేర ముంచాడు. కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి. పురుషోత్తమన్(57) కోయంబత్తూర్‌లోని వెల్లలూర్‌లో నివాసం ఉండేవారు. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఆయనకు కుమార్తె గీతాంజలి(18) ఉంది. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్న పురుషోత్తమన్.. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎనిమిదేళ్లలో మొత్తం ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. చెన్నైకు చెందిన ఇందిరా గాంధీ(45) కూడా పురుషోత్తమన్ చేతిలో మోసపోయారు. లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇందిరా గాంధీకి మాయమాటలు చెప్పి పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండడంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్‌లో కొనుగోలు చేయాలని చెప్పాడు. పురుషోత్తమన్ మాటలు నిజమేనని నమ్మి రూ.1.5 కోట్లకు అమ్మి డబ్బును అతని చేతిలో పెట్టింది. డబ్బు చేతికి అందిన మరుక్షణం నుంచి మళ్లీ అతడు ఇందిర కంటికి కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పురుషోత్తమన్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఇందిరా నిర్ఘాంతపోయారు. కుముదవల్లి అనే మహిళను కూడా పురుషోత్తమన్ ఇలానే మోసం చేశాడని తెలిసి కుప్పకూలిపోయారు. తనకు రావాల్సిన రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని పురుషోత్తమన్ కుముదవల్లిని కోరాడని పోలీసులు తెలిపారు. అతడిని గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టిందని చెప్పారు. ఆ తర్వాత పురుషోత్తమన్ కనిపించకుండా పోయాడని వివరించారు. పురుషోత్తమన్‌పై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.