Pushpagiri
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం (ఫొటోలు)
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం
వైఎస్సార్, సాక్షి: పుష్పగిరిలో నది తీరాన భక్తుల చేత ప్రశంసలందుకుంటున్న సైకత లింగం. వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెండవ దక్షిణ కాశి పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ సమీపాన పంచమ నది ఒడిలో సైకత శివలింగాన్ని ఇoటాక్ సభ్యులు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ తన స్వహస్తాలతో తయారుచేశారు. వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించారు. లింగాన్ని తిలకించిన పలువురు భక్తుల చేత ప్రశంసలు అందుకొoటోoది. -
పులకించిన భక్తజనం
సాక్షి, కడప/వల్లూరు : నదీమ తల్లుల ఒడిలో జనాలు పులకరించిపోయారు....పుష్కరాల్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టకపోయినా జనం మాత్రం కృష్ణా జలంతో పుణ్యస్నానాలు ఆచరించి పులకరించిపోయారు. దాదాపు వారం రోజులుగా కష్ణా జలాల రాకతో నదుల వద్ద భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. ఊహించని జనంతో నదీ పరవశించింది. ఎక్కడ చూసినా నదిలో స్నానం చేస్తున్న జనాలతోపాటు మహిళలు ప్రత్యేకంగా ఇసుక కుప్పలతో దేవుని ఆకారం తయారు చేసి పసుపు, కుంకుమ పూసారు. దీపాలు వెలిగించి మనసారా వేడుకున్నారు. కొంతమంది మహిళలు నీటిలో జ్యోతులు వెలిగించి తాంబూళంపై పెట్టి అలా వదిలి నమస్కరించుకున్నారు. రాకరాక వచ్చిన పుష్కరాల్లో భాగంగా ఎక్కడో వెళ్లి స్నానాలు చేసే భాగ్యం లేకపోయినా అవకాశమున్న ప్రాంతంలో పారుతున్న కష్ణా నీటిలోనే స్నానాలు ఆచరించి పరవశించిపోయారు. కష్ణమ్మ ఒడిలో జలకాలాడుతూ....దేవుడికి ప్రణామాలు చేస్తూ భక్తి పారవశ్యంతో భక్తులు మునిగిపోయారు. భక్తులతో పోటెత్తిన పుష్పగిరి, కుందూ, సిద్దవటం, ఒంటిమిట్ట జిల్లాలోకి వారం రోజుల క్రితం కష్ణాజలాలు ప్రవేశించాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వదలగానే దిగువకు వచ్చిన నీటితో జిల్లాలో ఒకప్రక్క కుందూలో, మరోప్రక్క కేసీ కెనాల్, ఇంకోప్రక్క పెన్నాలో ఇలా నీరు ప్రవహించంతో ఎక్కడికక్కడ జనాలు పుష్కర స్నానాలు చేసి భక్తిప్రవత్తులను చాటుకున్నారు. ప్రధానంగా దక్షిణకాశీగా పేరొందిన పుష్పగిరి భక్త జనంతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఎక్కడ చూసినా నది వెంబడి పుష్కర స్నానాలు చేస్తూ భక్తులు కనిపించారు. అనంతరం చెన్నకేశవస్వామిని దర్శించేందుకు భారీగా క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. చెన్నూరు సమీపంలోని ఆలయం వద్ద కూడా పెన్నానదిలో స్నానాలు పెద్ద ఎత్తున ఆచరిస్తూ కనిపించారు. మరోప్రక్క కొండపేట వద్ద కూడా కిక్కిరిసిన జనాలతో వస్తున్న వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చాపాడు మండలంలోని కుందూలో భాగంగా వీరభద్రస్వామి ఆలయ సమీపంలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఒంటిమిట్ట మండలంలోని దర్జిపల్లె వద్ద పెన్నాలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, సిద్దవటం వద్దనున్న పెన్నా వంతెన వద్ద కూడా ఊహించని జనం పుష్కర స్నానాలతో పులకరించారు. మూడు లక్షల మందికి పైగా పుష్కర స్నానం జిల్లాకు సంబంధించి వేలాది మంది కష్ణా పుష్కరాల్లో భాగంగా పలు ఘాట్లకు వెళ్లి స్నానాలు చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం, కష్ణానది, పున్నమి ఘాట్, అమరావతి తదితర ప్రాంతాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. వారం రోజులుగా జిల్లాలో పలుచోట్ల కేసీ కెనాల్, కుందూ, పెన్నా నదుల్లో పారుతున్న కష్ణా నీటిలో స్నానాలు చేసి దేవుడిని స్మరించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా వివిధ ప్రాంతాల్లో స్నానాలు చేసినట్లు అంచనా. దాదాపు ఈ వారం రోజుల్లో ఇతర జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
-
చెన్నకేశవస్వామికి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మరోవైపు పుష్పగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. -
ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
కర్నూలు, న్యూస్‌లైన్: పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ జిల్లా కేంద్రంలో హోంగార్డుగా పని చేస్తున్న పుష్పగిరిపై గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన బి.వీరేష్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం తన వద్ద లక్ష రూపాయలు తీసుకున్నాడని, డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్పీ రఘురామిరెడ్డి నిర్వహించిన మీతో మీఎస్పీ కార్యక్రమానికి ఫోన్ (94407 95567) ద్వారా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పించకపోతే డబ్బు వాపసు ఇవ్వాలని అడిగినప్పటికీ ఇప్పుడు, అప్పుడంటూ తిప్పుకుంటున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 60వేలు ఇచ్చాడని, మిగతా డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే నమ్మి మోసపోరాదని, అలాంటి వారి సమాచారం తన దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన నసీరుద్దీన్ పటేల్ ఎస్పీని కోరారు. నెహ్రూ రోడ్డు నుంచి బుడేకల్ రోడ్డు వరకు, హసన్న పేట నుంచి మునిసిపల్ మెయిన్ రోడ్డు వరకు వన్‌వే ఏర్పాటు చేస్తే ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రించవచ్చని ఆయన సూచించగా స్థానిక పోలీసులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించి నివేదిక అందజేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మీతో మీఎస్పీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు ఎస్పీకి దుర్వేశి గ్రామస్తుల అభినందన.. ఈ నెల 7వ తేదీన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారంటూ గడివేముల మండలం దుర్వేశి గ్రామానికి చెందిన ప్రజలు ఎస్పీని అభినందించారు. గతంలో జరిగిన మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎస్పీ ముందస్తు చర్యలు ఫలితంగా ప్రశాంతంగా పూర్తయ్యాయని గ్రామానికి చెందిన స్వామిరెడ్డి పేర్కొన్నారు.