puspavati
-
పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్ చేసి...
సాక్షి, గాలివీడు : వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నిండు గర్భిణి తన భర్తకు ఫోన్ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా... చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టనం నీరుగుట్టపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పావతి(21), గాలివీడు మండలం అరవీడుకు చెందిన పుర్రం మారుతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే పుష్పావతి గర్భం దాల్చింది. ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే పుష్పావతి ఏడు నెలల గర్భవతి. చదవండి: (భర్త మరణవార్త విని భార్య మృతి) సెప్టెంబర్‌లో అత్తవారింటి వద్ద ఉన్న పుష్పావతికి సంప్రదాయబద్ధంగా ఆమె తల్లిదండ్రులు పుసుపు, కుంకుమ ఇచ్చి కాన్పు కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు. మంగళవారం పుష్పావతి మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులో గాలివీడుకు చేరుకుంది. సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు వద్ద నుంచి భర్తకు ఫోన్ చేసి ప్రాజెక్టులోకి దూకుతున్నానని సమాచారాన్ని చేరవేసింది. భర్త మారుతి హుటాహుటిన వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ప్రాజెక్టు వద్ద భార్య చెప్పుల(పాదరక్షలు)ను గమనించి ఎస్ఐ చిన్నపెద్దయ్య, తహసీల్దార్ శ్రావణికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించన ఎస్ఐ, తహసీల్దార్ గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు. చదవండి: (వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి) -
క్రిస్మస్
ప్రపంచంలోని వివిధ దేశాల్లో బాలయేసుని పూజించే సంప్రదాయాల్లో కొన్ని దేశాల్లో 12 రోజుల ముందు, మరికొన్ని దేశాల్లో నెల రోజుల ముందుగానే జరుపుకోవటం జరుగుతుంది. క్రిస్మస్ పండుగ రోజు లలో బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం, బహుమతుల ప్రదానం చేయడం, సంగీతాసునా దాలతో గృహాలను దర్శించడం, దీపాలంకరణతో చర్చ్‌లు అలంకరించటం, సాయంకాలం ధ్యానాలు, అర్ధరాత్రి క్రిస్మస్ పండుగ ముందురోజు చర్చ్‌లలో సహోదరుల సమూహమంతా ధ్యానంలో పాల్గొని బాలయేసుని ఆరాధించడం జరుగుతుంది. సాయంకాల ధ్యానంలో కొవ్వొత్తులతో వెలుగుల కాంతిని చర్చి లోపల వెలిగించి భక్తులందరూ కలసి ధ్యానిస్తారు. క్రిస్మస్ పండుగ ముందు అర్ధరాత్రుల సమయాల్లో చర్చ్‌లలో ప్రార్థనలు జరుపుకోవడం, వృద్ధుల సౌకర్యార్థం అర్ధరాత్రి ధ్యానంలో హాజరు కావడం అసాధ్యమనే ఉద్దేశంతో ఉదయం వేళ ధ్యానించటం నిమిత్తం ఆయా చర్చిల సమయాల్లో తిరిగి ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. గృహాలంక రణ చేయటం, నక్షత్రాల ఆకారంతో తయారు చేసిన దీపాలను ఇంటిముందు అలంకరించటం చేస్తారు. తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రం తూర్పు దేశాల జ్ఞానులకు ప్రత్యక్షమయినందున నక్షత్రాన్ని వెతుక్కుంటూ, ఆ నక్షత్రం చూపిన బాటలో బెత్లెహే ముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడు న్నాడని, ఆయనను మేము పూజించడానికి వచ్చామన్న వార్త విన్న హేరోదు రాజు అతనితో కూడా ఉన్న యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ఎందు కంటే పూర్వం యెరూషలేము దావీదు పట్టణాన్ని యూదా దావీదు వంశీయులు బహుకాలం పాలిం చారు. యేసు దావీసు వంశ పుత్రుడుగా, గోత్రీకుడుగా జన్మించినందున తిరిగి యూదా దేశ రాజ్య స్థాపన కోసం ఈయన ఆ వంశములో జన్మించాడనే ఉద్దేశమే వారి కలవరానికి కారణం. కానీ సర్వోత్తముడైన తండ్రి సంకల్పం మాత్రం కరడు కట్టిన మనసులను, మనుష్యులను పరివర్తన చెందించ డానికి మాత్రమే. మత స్థాపన, రాజ్య స్థాపన నిమిత్తం కాదు. క్రిస్మస్ పదంలోని క్రిస్ అనగా క్రీస్తు మాస్ అనగా ధ్యానము అని అర్థం. అంటే క్రీస్తు ఆరాధన దినోత్సవం లేక క్రీస్తు ధ్యానించు దినం అని అర్థం. గాబ్రియేలు దేవదూత పరలోకం నుంచి ప్రత్యక్షమై మేరీ మాతతో అన్న మాటలివి. దయాప్రాప్తులారా! నీకు శుభం. నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. అతడు మహో న్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆ విధంగానే రక్షకుడైన యేసు బెత్ల హేములో జన్మించిన నేల మనందరినీ దీవిస్తూ ఉంటుంది. ‘‘సుకన్యో పుత్రా, నమోస్తుతే’’ అని ఆరాధించు క్రిస్మస్ పండుగ క్రీస్తు (ధ్యానముతో) ప్రార్థనతో మనందరినీ దీవిస్తుంది. – పి. పుష్పావతి -
జెడ్పీ పీఠంపై గద్దె, శాయన !
నేడు పాలకవర్గం ఏర్పాటు ఎన్నిక లాంఛనప్రాయమే మచిలీపట్నం : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుంది. ఎన్నికల ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా గద్దె అనూరాధను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛన ప్రాయం కానుంది. 1961వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఏర్పడింది. చైర్మన్ పదవిని అధిష్టించిన మహిళల్లో నల్లగట్ల సుధారాణి ఒకరు కాగా రెండో మహిళ అనూరాధ. జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జిల్లా పరిషత్‌కు రానున్నారు. ఈ ఎన్నిక కోసం కలెక్టర్ ఎం. రఘునందనరావు ఆధ్వర్యంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 34 టీడీపీ, 15 స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్నాయి. వైస్‌చైర్మన్‌గా పుష్పావతి ఖరారు జెడ్పీ వైస్‌చైర్మన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును టీడీపీ నాయకులు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పుష్పావతిని జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేయటం గమనార్హం. జెడ్పీ పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ఇలా .. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. 10 నుంచి నామినేషన్లు పరిశీ లించి 12 గంటలకు సక్రమంగా ఉన్నా జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు, 12గంటలకు ఆయా పార్టీలు జారీ చేసే విప్ (ఎనగ్జర్-3)ను స్వీకరిస్తారు. 1.00 గంటకు జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కో- ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో సభ్యుల పేర్లు పిలిచి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు, ఎన్నికైన కో-ఆప్టెడ్ సభ్యులకు ప్రత్యేక సమావేశంలో నోటీసు జారీ చేస్తారు. అనంతరం మద్దతు తెలిపేందుకు సభ్యులు చేతులు ఎత్తటం ద్వారా ఎన్నిక జరుగుతుంది.