ఆర్కాం భారీ నష్టాలు
ముంబై: అనిల్ అంబానీ ప్రమోటెడ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కాం) క్యూ1 ఫలితాల్లో భారీ నష్టాలను మూటగట్టుకుంది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నష్టం రూ .1,210 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 33 శాతం క్షీణించి రూ .3,591 కోట్లకు చేరుకుంది.
ఇప్పటికే రుణభారంలో కూరుకున్న ఆర్కాం తాజా ఫలితాలంతో మరింత కుదేలైంది. ప్రధానంగా టెలికాం సేవల్లోకి అనిల్ సోదరుడు, బిలియనీర్ ముకేశ్ అంబానీ సంస్థ జియో ఎంట్రీతో ఆర్కామ్ భారీగా అప్పుల్లో కూరుకు పోయిన సంగతి తెలిసిందే.