Qualify
-
ప్రపంచకప్‌కు నమీబియా క్వాలిఫై
వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్ర స్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. మంగళవారం జరిగిన పోరులో నమీబియా 58 పరుగుల తేడాతో టాంజానియాను ఓడించింది. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. జేజే స్మిట్ (40), మైకేల్ లింజెన్ (30) రాణించారు. అనంతరం టాంజానియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అమాల్ రాజీవన్ (41 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో టి20 ప్రపంచకప్‌కు (2021, 2022, 2024) నమీబియా అర్హత సాధించడం విశేషం. ఇదే టోర్నీలో జరిగిన మరో మ్యాచ్‌లో రువాండాపై 144 పరుగులతో గెలిచిన జింబాబ్వే తాము కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా ఈ టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
T20 WC 2024: టి20 ప్రపంచకప్.. తొలిసారి 20 జట్లు బరిలోకి
కీర్తిపూర్ (నేపాల్): వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి టి20 ప్రపంచకప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్ జట్టును ఓడించగా... నేపాల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై గెలిచింది. టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించడం ఇది రెండోసారి కాగా... ఒమన్ జట్టు మూడోసారి ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది. నేపాల్ 2014లో, ఒమన్ 2016, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాయి. మరో రెండు బెర్త్‌ల కోసం... వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్–అమెరికాలలో జరిగే తొమ్మిదో టి20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికి 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచకప్ ద్వారా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్త్‌లు లభించాయి. ర్యాంకింగ్ ఆధారంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు బెర్త్‌లు దక్కాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నేపాల్, ఒమన్... యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్... తూర్పు ఆసియా–పసిఫిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పాపువా న్యూగినీ... అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా కెనడా అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 30 వరకు నమీబియాలో ఏడు దేశాల మధ్య (జింబాబ్వే, కెన్యా, నమీబియా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా) జరిగే ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు బెర్త్‌లు ఖరారవుతాయి. -
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
ముంబయి చిత్తు చిత్తు.. CSK పై రివెంజ్ కు రెడీ
-
4 సార్లు చాంపియన్.. సెకండ్ల వ్యవధిలో మిస్సయ్యాడు
ఒలంపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి ఒక్క అథ్లెట్ కల. అందుకోసం వాళ్లు ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం, ప్రతిష్టాత్మక టోర్నికి 19 సెకన్ల ఆలస్యం వల్ల అర్హత కోల్పోతే ఆ బాధ వర్ణించలేం. అది కూడా మొదటి సారి ఒలంపిక్స్‌లో అడుగుపెడుతున్న అథ్లెట్ కాదు ఏకంగా 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి ఇలా చేజార్చుకున్నాడంటే నమ్మలేం కదా ? కానీ ఇది నిజం. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మో ఫారా. శుక్రవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన 10వేల మీటర్ల ఒలంపిక్స్ అర్హత పోటీల్లో.. అతను కొద్దిలో గమ్యాన్ని చేరలేకపోయాడు. 27 నిమిషాల 28 సెకన్లలో టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉండగా, మో ఫారా 27నిమిషాల 47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. దీంతో అతను మరో సారి ఒలంపిక్స్‌లో ఐదో సారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. Not to be for @Mo_Farah tonight but this man is and always will be a champion 🥇🥇🥇🥇 pic.twitter.com/CK3BnTSB9t — Team GB (@TeamGB) June 25, 2021 చదవండి: టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకి అరుదైన గౌరవం.. -
బజరంగ్‌ను ఓడించారు
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బజరంగ్ ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...ఒకే సారి నాలుగు పాయింట్లు సాధించిన ‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. ఈ బౌట్లో ఓటమితో బజరంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు రజతం, బంగారం దూరమయ్యాయి. కాంస్యం కోసం బజరంగ్... డేవిడ్ హబట్ (స్లోవేనియా)తో తలపడతాడు. మహిళల ఈవెంట్లో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కాంస్యం బరిలో నిలిచిన పూజ ధండా కూడా ఓడిపోయింది. పట్టించుకోని రిఫరీలు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజరంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురు లేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో, పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. పైగా బౌట్ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా నియజ్బెకొవ్ కోలుకునేందుకు చాలా సమయం ఇచ్చారు. కనీసం మూడు సార్లు ఇలా జరగ్గా ఒక్కసారి హెచ్చరిక కూడా జారీ చేయలేదు. బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో అతను 6–1తో యుకి టకహషి (జపాన్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జువర్ వుగుయెవ్ (రష్యా) 6–4తో రవి జోరుకు బ్రేకులేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం రవికి ఊరట. సాక్షి మలిక్ అవుట్... మహిళల 59 కేజీల కాంస్య పతక పోరులో పూజ 3–5తో జిన్ గ్రూ పీ (చైనా) చేతిలో ఓడింది. 62 కేజీల కేటగిరీలో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి 7–10తో నైజీరియాకు చెందిన అమినట్ అడెనియి చేతిలో కంగుతింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ 0–2తో ఒలింపిక్ చాంపియన్ సార దొషొ (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. సాక్షి, దివ్యలను ఓడించిన ప్రత్యర్థులు క్వార్టర్స్‌లో ఓడటంతో రెపిచేజ్ అవకాశం లేకుండా పోయింది. -
సూపర్–12కు అర్హత పొందని లంక
దుబాయ్: మాజీ చాంపియన్ శ్రీలంక టి20 ప్రపంచకప్ సూపర్–12కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. తక్కువ ర్యాంకు కారణంగా లంకతో పాటు బంగ్లాదేశ్ కూడా వచ్చే ఏడాది జరిగే మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత పొందలేదు. దీంతో ఈ రెండు జట్లు గ్రూప్ దశలో మిగతా ఆరు జట్లతో పోటీపడాల్సి ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం వెల్లడించింది. టాప్ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌తో పాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ ఈ ఎనిమిది జట్లు సూపర్–12కు నేరుగా అర్హతపొందాయి. మరో నాలుగు జట్లు గ్రూప్ దశ ద్వారా అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు గ్రూప్, ప్రధాన టోర్నీ జరుగుతుంది. అంతకంటే ముందు ఈ ఏడాది టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నిర్వహిస్తారు. ఇందులో రాణించిన ఆరు జట్లు గ్రూప్ దశకు అర్హత పొందుతాయి. ఒకసారి టైటిల్ నెగ్గి... మూడుసార్లు ఫైనలిస్టుగా నిలిచిన లంక నేరుగా అర్హత పొందలేకపోవడం పట్ల కెప్టెన్ మలింగ విచారం వ్యక్తం చేశాడు. అయితే గ్రూప్ దశలో సత్తాచాటడం ద్వారా సూపర్–12 బెర్త్ సాధిస్తామన్నాడు. -
కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత
సంగారెడ్డి టౌన్: పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 800 మీటర్ల పరుగులో 385 మంది అర్హత సాధించారని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. తప్పనిసరి అర్హత సాధించాల్సిన 800 మీటర్ల పరుగు కోసం పురుష అభ్యర్థులు 558 మందికి హాజరు కాగా 328 మంది, మహిళా విభాగంలో 73 మంది అభ్యర్థులు హాజరు కాగా 57 మంది అర్హులయ్యారని పేర్కొన్నారు. వీరు అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. వీరికి ధృవపత్రాల పరిశీలన, ఎత్తు, ఛాతి కొలతలు, బరువు, 100 మీటర్ల పరుగు, హై, లాంగ్ జంప్ తదితర ఈ వెంట్లు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న, సీఐలు శ్యామల వెంకటేశ్, శ్రీనివాసనాయుడు, లింగేశ్వర్, ఎస్సైలు రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్రావు, మధు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది.