quantum of punishment
-
గుల్బర్గ్ సొసైటీ కేసు:తీర్పు శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ: గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. న్యాయస్థానం తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. gulbarg society massacre,verdict, quantum of punishment,గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ, తీర్పు వాయిదా, దోషులు -
గుల్బర్గ్ కేసులో నేడే తీర్పు
గుజరాత్: గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ దోషులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందికి.... శిక్షను ప్రత్యేక విచారణ కోర్టు విధించింది. 24 మంది దోషుల్లో 11మందిపై హత్యా నేరం ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసులో 36మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. గుల్బర్గా సొసైటీ హత్యాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహెసాన్ జాఫరి సహా 69మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. అయితే ఈ కేసు నుంచి మోదీకి ఊరట లభించింది. -
గుల్బర్గ్ సొసైటీ కేసు.. తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: 2002 గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో 24 మంది దోషులకు శిక్ష ఖరారుపై విచారణను ప్రత్యేక సిట్ కోర్టు జూన్9కి వాయిదా వేసింది. ఈ నెల 2న ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు కోర్టులో నలిగిన ఈ కేసును నలుగురు జడ్జిలు విచారించారు. 2002లో గోద్రా అల్లర్లలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పంటించిన తర్వాతి రోజు 30 విల్లాలు, 10 అపార్ట్ మెంట్ బ్లాక్ లు ఉండే గుల్బర్గ్ సొసైటీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీని దుండగులు చంపారు. ఘటనా స్థలంలో 31 శవాలు లభ్యంకాగా, జాఫ్రీ, పార్శీ బాలుడు అజార్ మోదీల ఆచూకీ లేకుండా పోయింది. వీరిలో 30 మంది మరణించగా ముజఫర్ షేక్ అనే బాలుడు బతికి బయటపడ్డాడు. అతని కుటుంబసభ్యులు ఆయన పేరును వివేక్ గా మార్చివేశారు. సుప్రీంకోర్టు వేసిన తొమ్మిది ప్రత్యేక సిట్ కోర్టుల్లో గుల్బర్గ్ కేసు ఎనిమిదోది.