Queen of Britain
-
కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 (96) ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్–2 1953లో సింహాసనమెక్కారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు. చదవండి: ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం.. మరో నాలుగు నెలలు: -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
బ్రిటన్ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె..!
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్ వ్యాపారాలపై బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై యూకే మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాకుండా రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పన్ను చెల్లింపులపై కూడా వివాదం నెలకొంది. రిషి సునక్, అక్షతా మూర్తిని బ్రిటన్ మీడియా టార్గెట్ చేస్తూ పలు వ్యాసాలను ప్రచురించాయి. కాగా తాజాగా అక్షతామూర్తికి సంబంధించిన ఆస్తుల విషయంలో మరో విషయం బయటపడింది. ఎలిజబెత్ కంటే ఎక్కువ..! అక్షతా మూర్తి ఆస్తులు బ్రిటన్ రాణి ఎలిజబెత్ కంటే ఎక్కువని తెలుస్తోంది. ఎఎఫ్‌పీ నివేదిక ప్రకారం, స్టాక్ ఎక్స్ఛేంజ్కు కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌లో దాదాపు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉంది. 2021 సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం... బ్రిటన్ మహరాణి వ్యక్తిగత సంపద దాదాపు 460 మిలియన్ డాలర్లుగా ఉందని నివేదించింది. రిషి సునక్‌తో కలిసి స్థాపించిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ కాటమరాన్ వెంచర్స్‌కి అక్షత డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా...డొమిసైల్ స్టేటస్ వల్ల ఆమె ఏటా 2.1 మిలియన్ పౌండ్ల పన్నులను తప్పించుకోగలిగారని బీబీసీ అంచనా వేసింది. అక్షతామూర్తి భారత పౌరురాలిగా ఉంటూ బ్రిటన్‌లో పన్నులను ఎగవేస్తున్నారని బ్రిటన్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై అక్షతా మూర్తి ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. చదవండి: యూకే మంత్రి రిషి సునక్ భార్య పన్ను చెల్లింపులపై వివాదం..! క్లారిటీ ఇచ్చిన అక్షతా మూర్తి..! -
బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు. విండ్సర్ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్ వయసు 94 కాగా, ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
రాణివ్వండి
ఆకలయిందాడైనింగ్ టేబుల్ మీదకు వచ్చామాతిన్నామావెళ్లిపోయామా..ఇదేం కుదరదు ప్యాలెస్‌లో.రాణిగారు రావలసిందేరూల్సన్నీ ఫాలో అవాల్సిందే!రాణిగారు రాకపోతే..?రానివ్వండి అంటారంతే..! వంద దేశాలు కలిస్తే అమెరికా.వంద పద్ధతులు కలిస్తే బ్రిటన్. బ్రిటన్ అంటే రాణిగారు అండ్ ఫ్యామిలీ. రాణిగారింట్లో.. కూర్చున్నా రాయల్‌గానే కూర్చోవాలి. నిలుచున్నా రాయల్‌గానే నిలుచోవాలి. మెట్లు ఎక్కుతున్నా, దిగుతున్నా రాయల్‌గానే ఎక్కాలీ దిగాలి. ఇంటి ఆడపడుచులు రాణిగారికి మోకాళ్ల మీద కాస్త వంగి అభివాదం చెయ్యాలి. అదీ ఎవరూ గమనించకుండా క్షణాల్లో చేసేయాలి! అంతఃపుర వనితలు దుస్తులు సరిగా వేసుకోవాలి. ఒంటి మీద అవి కుదురుగా ఉండాలి. తలపై టియారా (అర్ధ చంద్రాకారపు ఆభరణం) ధరించాలి. ఇంట్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ ‘మోనోపలి’ (బిజినెస్ గేమ్) ఆడకూడదు. ఎక్కడికైనా వెళ్లినా, కూర్చున్నా అంతా ఒక ఆర్డర్‌లోనే ఉండాలి. (మొదట రాణి గారు. తర్వాత ఆమె భర్తగారు. తర్వాత ఆమె కొడుకు గారు. తర్వాత ఆ కొడుకు భార్యగారు. తర్వాత కొడుకు పెద్ద కొడుకు గారు. తర్వాత ఆ పెద్దకొడుకు భార్యగారు.. ఇదీ లైన్!). షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, తీసుకోడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే రాచకుటుంబీకులెవరూ బ్రిటన్ ఎన్నికల్లో ఓటు వేయకూడదు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అమెరికన్ అమ్మాయి మేఘన్ మార్కల్ బ్రిటన్ రాచకుటుంబానికి కొత్త సభ్యురాలిగా వచ్చాక ఈ పద్ధతుల్లో కొన్ని బ్రేక్ అయ్యాయి. రాణిగారు చూసీ చూడనట్లు పోనిచ్చారు. తోడికోడలు (భర్త అన్నగారు ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్) దగ్గరుండి కొన్ని పద్ధతులు నేర్పించారు. ఇప్పుడు మళ్లీ రాజప్రాసాదంలో సందడి మొదలైంది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులకు పెళ్లయి ఏడాది అవుతుండగా బకింగ్హ్యాప్ ప్యాలెస్‌కి మరో కొత్త మెంబర్ వచ్చాడు. సోమవారం మేఘన్ మార్కల్ పండంటి కొడుక్కి జన్మనిచ్చారు. వాడికీ ఈ పద్ధతులు తప్పనివే. అయితే కొంత టైమ్ పడుతుంది. ఊహ వచ్చేవరకు వాడేం చేసినా, ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడిక రాణిగారింటి విందుల సమయమిది. కనీసం కొన్నాళ్ల వరకైనా అయినవాళ్లు, అతిథులు వచ్చిపోతుంటారు. ఆ ఆతిథ్యం అంతా కూడా రాచకుటుంబ పద్ధతులకు అనుగుణంగానే ఉంటుంది. ఒక్క మాటలో దానిని ‘టేబుల్ మేనర్స్’ అనలేం. ‘భోజన సంప్రదాయం’ అనే మాటేదో అనాలి. నో తొందర.. నో నిదానం అమెరికాలోని ముప్ఫైమూడు కోట్ల మందిలో ఎవరిష్టం వాళ్లది. బ్రిటన్‌లో మాత్రం.. అంత పెద్ద రాచకుటుంబం అయినా సరే అందరూ ఒకే ట్రాక్ మీద ఉండాలి. మేఘన్మార్కల్ అమెరికా అమ్మాయి కనుకే ఈ పోలిక తేవడం. డైనింగ్ దగ్గరా అంతే. ఇష్టమైన ఐటమ్స్ వేర్వేరుగా ఉండొచ్చు. పద్ధతుల పాటింపును మాత్రం ఎవరూ తప్పకూడదు. భోజనానికి త్వరపడకూడదు. భోజనానికి ఆలస్యం చేయకూడదు. భోజనం త్వరగా చేసేయకూడదు. మరీ నెమ్మదిగా భోజనం చేయకూడదు. భోంచేస్తున్నప్పుడు ఏ చేతిలో ఉండాల్సిన స్పూన్, ఫోర్క్ ఆ చేతిలోనే ఉండాలి. అల్లరల్లరిగా భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక పాత్రలు, డైనింగ్ టేబులూ కదిలేలా కుర్చీల్లోంచి లేవకూడదు. క్వీన్ ఎలిజబెత్‌కి ఫుడ్డును వేస్ట్ చెయ్యడం ఇష్టం ఉండదు. అంతా తిని లేచాక గిన్నెల్లో ఆహార పదార్థాలు మిగిలిపోతే, వాటిని రూపురేఖలు మార్చి తర్వాతి భోజనానికి సిద్ధం చేయమని వంటవాళ్లకు చెబుతారు రాణిగారు! వెల్లుల్లికి అల్లంత దూరం అంతఃపుర వంటశాలలో వెల్లుల్లి వాడకమే ఉండదు. ఘాటైన ఆ వాసనకు నోటి దుర్వాసన వస్తుందని రాజ కుటుంబం తమ వంటల్లో వెల్లుల్లిని ఏళ్ల క్రిందటే నిషేధించింది. రాణి గారి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్ల్స్ అందరూ తినే కాయగూరలు తినరు. ఆయన తనకై తాను పండించుకున్నవే తింటారు! ఆయనకో తోట ఉంది. ఆ తోటలో తనకు ఇష్టమైన కూరగాయల్ని ఎరువులు వాడకుండా పండించుకుంటారు. రాణిగారింట్లో పెంకు చేపల్ని (షెల్ ఫిష్) తినడం నిషిద్ధం. పెంకు చేపల్ని తింటే ఎంతటి ఆరోగ్యవంతులైనా తేలిగ్గా జబ్బున పడతారని ఇంగ్లండ్‌లో ఒక నమ్మకం. అదే నమ్మకం రాచకుటుంబానికీ ఉంది. అయితే ఈ నిషేధాన్ని కుటుంబంలోని యంగ్ జనరేషన్ చాటు మాటుగా బ్రేక్ చేస్తుంటారట. ఏళ్లతరబడి వాళ్ల వంట శాలలో పని చేసి బయటికి వచ్చిన షెఫ్‌లు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి బయపెడుతుంటారు. ప్రిన్స్ చార్ల్స్ తన భోజనాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోడానికి ఇష్టపడరు. అందుకే రాయల్ షెఫ్స్ ఆయన కోసం వండినవి ఎవరికీ వడ్డించకుండా జాగ్రత్త పడతారు. రాణిగాకి సైడ్ డిష్‌గా పెద్ద బౌల్ నిండా కాయగూరల సలాడ్స్ ఉండాలి. మధ్యమధ్య వాటిని భుజిస్తూ, ముఖ్యాహారాన్ని ఆరగిస్తారు. డార్క్ చాక్లెట్ బిస్కెట్లంటే రాణిగారికి మహా ప్రీతి. పర్యటనలకు, విహారాలకు వెళ్లినప్పుడు కూడా ఇంటి నుంచి ఆమె డార్క్ చాక్లెట్ బిస్కెట్లు తీసుకుని వెళ్తారు. పర్సు తీశారంటే ఫినిష్! డైనింగ్ టేబుల్ మీద ఆ పూట పాస్తా ఉందంటే ప్రత్యేక సందర్భం ఏదో ఉందనే అర్థం. ఎప్పుడో కానీ ప్యాలెస్ డైనింVŠ టేబుల్‌పై పాస్తా కనిపించదు. డిన్నర్ పార్టీలప్పుడు మస్ట్‌గా ఉంటుంది. వడ్డన సేవకులకు రాచ కుటుంబీకులు ఏదీ నేరుగా చెప్పరు. టేబుల్ మీద ఫోర్క్‌పై, నైఫ్‌ని అడ్డంగా పెడితే ప్లేట్లకు చేతుల్ని, గరిటెల్ని తాకించవద్దని చెప్పడం. రాణిగారి భోజనం పూర్తయితే ఇక మిగతావాళ్లెవరూ తినడానికి లేదు. అందరూ ఆపేయాల్సిందే. రాణిగారి కన్నా ఎవరూ ముందు మొదలెట్టడానికి లేదు. పిల్లలైనా సరే! తింటూ తింటూ రాణిగారు బల్లమీద తన పర్సు పెట్టారంటే కుటుంబ సభ్యులకు గానీ, అతిథులకు గానీ ఐదునిముషాల్లో భోజనం ముగించాలని సంకేత పరచడం. రాణిగారు తన కుడివైపు కూర్చొని ఉన్న వారితో మాటకలుపుతూ భోంచేయడం ప్రారంభిస్తారు. రెండో వడ్డనలో తన ఎడమవైపు కూర్చొని ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం కొనసాగిస్తారు. స్పూన్‌తో తింటున్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నోట్లో ఉంచుకోవడం కోసం ఫోర్క్ వెనుక భాగాన్ని ఉపయోగించాలి. అందుకోసం ఫోర్క్‌ని ఎడమ చేతిలో ఉంచుకోవాలి. ఒక రోజులోని భోజనాలన్నిటికీ కూడా డైనింగ్ హాల్‌కి ఒకే విధమైన ఫార్మల్ డ్రెస్‌లో వెళ్లాలి. అన్నట్లు రాణిగారికి డార్క్ చాక్లెట్ బిస్కెట్లతో పాటు మామిడి పండ్లన్నా కూడా మహా ఇష్టం. అసలు రాణిగారితో భోజనం అంటేనే తినే ఐటమ్స్ కన్నా, పాటించాల్సిన రూల్సే ఎక్కువగా ఉంటాయి. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల పెళ్లికి అనుబంధంగా జరిగిన విందుల్లో ఆ రూల్స్ అన్నిటినీ ఆ అమెరికా అమ్మాయి మేఘన్ తప్పని సరిగా పాటించవలసి వచ్చింది. మినహాయింపులేమీ లభించలేదు. కనీసం రెండు రూల్స్ అయితే తప్పనిసరి. డైనింగ్ చైర్ మీద రాణిగారు కూర్చున్నాకే మిగతావాళ్లు కూర్చోవాలి. అదీ ఆర్డర్లో. ఇది రూల్ నెంబర్ వన్. రాణిగారు భోజనం పూర్తవ్వగానే మిగతావారూ తమ భోజనాన్ని ముగించాలి. ఇది రూల్ నెంబర్ టూ. రాణిగారికి అబద్ధాలు! వలసలు పెరిగినప్పుడు పద్ధతులు తగ్గుముఖం పడతాయి. వయసు పెరుగుతున్నప్పుడు పద్దతుల పాటింపు ఓపికా తగ్గుతుంది. రాణిగారి ప్యాలెస్‌లో డిన్నర్‌కి అంతా ఒకే టైమ్‌కి రావాలి. అది రూలు. రాణిగారు వస్తే కానీ భోజన కార్యక్రమం మొదలవదు. అయితే కొన్నిసార్లు రాణిగారు రావడం ఆలస్యం అయ్యేది. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్నవారు రాణి గారి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇక అలా లాభం లేదని భోజన సమయాన్ని ఇవతలికి జరిపి రాణిగారికి వర్తమానం పంపేవారు. డిన్నర్ రాత్రి తొమ్మిది గంటలకు అనుకుంటే.. ఎనిమిదీ నలభై ఐదుకు అని చెప్పేవారు. అలాగే అందరికీ ఎనిమిదిన్నరకు అని చెబితే, రాణిగారికి మాత్రం ఎనిమిదింపావుకే అని కబురు చేరవేసేవారు. అలా అనేకసార్లు అబద్దాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని షెప్ గార్డన్ బయటపెట్టారు. వంటింట్లోకి రాణిగారి భర్త! 1982–1993 మధ్య కాలంలో డారెన్ మెక్గ్రేడి అనే ఆయన రాణిగారి కుటుంబ సభ్యులకు పర్సనల్ షెప్గా పని చేశారు. ఆయన రిౖటñ ర్ అయ్యి బయటికి వచ్చాక కొన్ని ఆసక్తికరమైన సంగతులు కూడా ఆయనతోపాటు బయటికి వచ్చాయి. అవన్నీ పద్ధతులు బ్రేక్ అయిన సందర్భాలు. ఫిలిప్ ఓసారి వంటగదికి వెళ్లారు. అక్కడ పదుల సంఖ్యలో వంట సిబ్బంది ఉంటారు. ఫిలిప్ అంటే క్వీన్ ఎలిజబెత్ భర్త. ఆయనంతటి వారు డైనింగ్ హాల్లో కనిపించాలి కానీ, కిచెన్‌లోనా! సిబ్బంది అంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ‘‘రాత్రికి డిన్నర్‌లోకి ఏముంది?’’ అని అడిగారు ఫిలిప్. ‘‘మీ కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించిన లేత మాంసం ఉంది యువర్ రాయల్ హైనెస్’’ అని చెప్పాడు షెఫ్ డారెన్. ‘‘ఆ వైపున ఉన్నదేమిటి?’’ అని అడిగారు ఫిలిప్. ‘‘అవి మాకోసం చేసుకున్న చాప్స్’’ అని చెప్పాడు షెఫ్. ‘మా కోసం’ అంటే కిచెన్ సిబ్బంది కోసం. చాప్స్ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా వేయించిన మాంసం. ‘‘అయితే అవే నాకూ కావాలి’’ అని చాప్స్ తెప్పించుకుని తిన్నారు ఫిలిప్ ఆ రాత్రి డిన్నర్లో! -
వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్‌తో తన ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్‌కు రాసిన అరుదైన లేఖను వచ్చేవారం వేలం వేయనున్నారు. రెండు పేజీలున్న ఈ లేఖలో వారు ప్రేమలో ఎలా పడ్డారో ఆమె రచయితకు చెప్పారు. ఇది 1947లో, ఫిలిప్, ఎలిజబెత్‌ల వివాహానికి కొద్ది రోజుల ముందు రాసిన లేఖ. ఏప్రిల్ 23న దీన్ని వేలం వేయనున్నారు.