పెన్షనర్లపై నిర్దయ తగదు
వయోవృద్ధులైన 79 ఏళ్లకు పైబడిన పెన్షనుదార్లలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలనే సత్సంకల్పంతో 5వ పీఆర్సీ సిఫారసుతో అమలులోకి వచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ ఆప్పెన్షన్ను 10వ వేతన సంఘం 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు వయోపరిమితిని తగ్గిస్తూ సిఫారసు చేసింది.
కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనను ప్రస్తావించకుండా ఫిట్మెంట్ జీవో జారీచేయడం, పెన్షనర్లలో తీవ్రమైన భయాందోళన లను రేకెత్తిస్తోంది. 70కి పైబడిన వయోభారం, మానసిక, శారీరక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వయో వృద్ధులకు ఎంతో ఉపశమనాన్ని కలి గించే అదనపు పెన్షన్ సౌకర్యం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్దయగా రద్దుచేయడానికి పూనుకోవడం అత్యంత బాధాకరం. గతంలో పెన్షనుదార్ల డీఏ తొలగించిన ఈ ప్రభుత్వం మళ్లీ అలాంటి పోకడలకు పోరాదని మనవి. మానవతావాద దృక్పథంతో 10వ పీఆర్సీ సిఫార్సు యథాతథంగా అమలు చేయాలి.
ఆర్.హేమన్నస్వామి
బాలిగాం హరిపురం, మందస మండలం