వైఎస్సార్సీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
సభకు వచ్చి క్షమాపణలు చెప్పినప్పటి నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాదరెడ్డి, మణిగాంధీపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్‌ను తొల గించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప నేత జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్‌కు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మం త్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సభ్యులు అందుబాటులో లేకపోవడంతో, వారు సభకు వచ్చి క్షమాపణ చెప్పిన వెంటనే సస్పెన్షన్ తొలగిపోతుందని స్పీకర్ చెప్పారు.