Rachabanda programme
-
నంద్యాల జిల్లా బనగానపల్లిలో సాక్షి రచ్చబండ
-
వచ్చే నెల్లో కాంగ్రెస్ ఎన్నికల టీమ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరులో కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరాన్ని చేపట్టబోతోందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించి ఏడాది పూర్తవుతుండడం, అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో నిర్వహిస్తోన్న రైతు రచ్చబండ కార్యక్రమం ముగిసిన వెంటనే రేవంత్ ఈ నియామకాలపై దృష్టి పెట్టనున్నారు. అందులో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల నియామకం, పనితీరు సరిగా లేని జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పుతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొంత కసరత్తు చేసిన రేవంత్ పక్కాగా ఎన్నికల టీమ్‌ను ప్రక టించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూన్ నెలాఖరు కల్లా పదవుల పందేరాన్ని పూర్తి చేసిన తర్వాత రాష్ట్రంలో బస్సు, పాదయాత్రలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. క్రియాశీలకంగా వ్యవహరించే వారికే.. పార్టీ పదవుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించగలిగిన నాయకులకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నట్లు సమాచారం. ప్రజలను కచ్చితంగా ప్రభావితం చేయగల నాయకులకే పార్టీ పదవులు ఇవ్వాలని, గతంలో ఉన్న మూస విధానానికి స్వస్తి పలకాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సరిగ్గా ఉపయోగపడే టీంను ఆయన నియమిస్తారని, జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కార్యవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉన్న వారికే అవకాశం ఇచ్చే దిశలో రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి, పీఏసీ ఆమోదం తీసుకున్న అనంతరం ఈ జాబితాలను ఏఐసీసీకి పంపి ఆమోద ముద్ర వేయించుకుంటారని, ఈ ప్రక్రియ అంతా జూన్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది. -
రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం
-
సంబటురులో రచ్చబండ కార్యక్రమం
-
గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత రచ్చబండ జిల్లాలో గందరగోళంగా మారింది. కార్యక్రమం ముగిసి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎంతమందికి రచ్చబండ ఫలాలను అందించారో లెక్క తేలడం లేదు. దీంతో యంత్రాంగం అయోమయంలో పడింది. క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. లెక్కలు తేల్చే మార్గం కన్పించక జిల్లా ప్రణాళిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో గత నెల 11వ తేదీ నుంచి మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,10,662 రేషన్ కూపన్లు, 27,890 పింఛన్లు, 40,353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వీటిని ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ కార్యక్రమాల్లో మంజూరు పత్రాలు అందించాలి. అయితే అనివార్య కారణాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా రచ్చబండ మొదలుపెట్టినప్పటికీ.. నవంబర్ 26లోపు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కానీ ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి మంజూరుపత్రాలు ఇచ్చారో లెక్క మాత్రం తేలలేదు. ఆన్‘లైన్’ తప్పింది.. వాస్తవానికి రచ్చబండ కార్యక్రమంలో మంజూరు పత్రాలను అందించిన వెంటనే ఆయా వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో వివరాల నమోదు ప్రక్రియ తప్పుల తడకగా సాగింది. ఆన్లైన్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గత వారం రచ్చబండ వివరాలను కలెక్టర్ బి.శ్రీధర్ సమీక్షిస్తూ పొంతన లేని వివరాలను గుర్తించి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరైన వివరాలు వెబ్సైట్లో పొందుపర్చాలని సూచించారు. ఇందుకు వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. కానీ మెజారిటీ మండలాల్లో వివరాలను మార్చలేదు. ముఖ్యంగా రేషన్ కూపన్లకు సంబంధించిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. స్థానికంగా ఎంపీడీఓ, తహసీల్దార్ మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన తీరు, ఇతర అంశాలపై బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అధికారులు ఉత్కంఠగా ఉన్నారు.