racial profiling
-
అవినీతి నిర్మూలనే మా సిద్ధాంతం: మోదీ
న్యూఢిల్లీ: అవినీతి, దుష్పరిపాలన, జాతి వ్యతిరేక విధానాలే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించాలన్నదే తమ సిద్ధాంతమని అని తేలి్చచెప్పారు. ప్రజా సంక్షేమం ద్వారానే దేశ సంక్షేమం సాధ్యమని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం లబి్ధదారులతో ప్రధాని మోదీ గురువారం సమావేశమయ్యారు. ఈ పథకంతో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నా యని వెల్లడించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల వడ్డీకే తక్కువ రుణ సదుపాయం లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 62 లక్షల మందికి రూ.11,000 కోట్లకుపైగా రుణాలు ఇచి్చనట్లు తెలియజేశారు. -
‘కబాలి’ మ్యూజిక్ డైరెక్టర్‌పై జాతి వివక్షత?
సాక్షి, సినిమా : కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ జాతి వివక్షతకు గురైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేశారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో ఆయనతో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు ట్వీట్ చేశారు. అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం ఆయన చేసిన ఆరోపణలను ఖండించింది. రెండు రోజల క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రకారం... సిడ్నీ వెళ్లిన ఆయనను ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అడ్డగించారు. నిషేధిత రసాయనాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆయన్ని అడ్డగించి.. పక్కన ఓ వరుసలో నిలబెట్టారు. అలా 8 సార్లు ఆయన్ని క్యూలు మార్చి మరి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి ఆయనతో దురుసుగా కూడా వ్యవహరించినట్లు ఆయన చెప్పారు. ఇది దారుణం.. జాతి వివక్షతకు అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం తనిఖీల్లో భాగంగానే తమ అధికారులు అలా చేసుంటారని వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చుకుంది. దానికి సంతృప్తి చెందని సంతోష్ నారాయణన్... భద్రత కోసమైతే వందసార్లు తాను వరుసలో నిల్చోటానికి సిద్ధమని, కానీ, కొందరు అధికారులు ఆ వంకతో వ్యక్తిగతంగా జాతి వివక్షత చూపించటం దారుణమని ఆయన ఆరోపించారు. డైరెక్టర్ పా రంజిత్ అటకత్తి చిత్రంతో ఆరంగ్రేటం చేసిన సంతోష్.. గురు, మద్రాస్ తదితర చిత్రాలకు మ్యూజిక్ అందించినప్పటికీ... కబాలితో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. I was “randomly” picked up for the 8th time in a row at the Sydney airport for a chemical substance test and a rude officer insulted my intelligence. Racial profiling needs to stop. @SydneyAirport — Santhosh Narayanan (@Music_Santhosh) November 16, 2017 -
ఐఐటీ విద్యార్థుల అరెస్టు.. వేధింపులు
న్యూఢిల్లీ: ఇంటర్న్ షిప్ కోసం ఇటలీ వెళ్లిన ముగ్గురు భారతీయ విద్యార్థులపై ఆ దేశ పోలీసులు జాతివివక్షను చూపారు. సినిమాల్లోలా అకారణంగా అదుపులోకి తీసుకుని అక్కడికీ, ఇక్కడికీ తిప్పుతూ విద్యార్థులను వేధించిన ఇటాలియన్ అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఐఐటీ విద్యార్థులైన అక్షిత్ గోయల్, దీపక్ భట్, బాంబే ఐఐటీ స్టూడెంట్ అయిన ఉదయ్ కుసుపాటిలు ఇంటర్న్ షిప్ కోసం గత వారం ఇటలీలోని వెనటిమిగ్లియా నగరానికి వెళ్లారు. అక్కడ మెట్రో స్టేషన్ లో రైలు దిగుతున్న ఈ ముగ్గురిని దాదాపు 30 మంది పోలీసులు, పాస్ పోర్ట్ అధికారులు చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు. తాము ఇంటర్న్ షిప్ కోసం వచ్చినట్లు అన్నిరకాల ఆధారాలు, సంబంధిత పేపర్లు చూపినప్పటికీ సంతృప్తి చెందని పోలీసులు.. ఐఐటీయన్లను అదుపులోకి తీసుకుని వెనటిమిగ్లియా నుంచి 850 కిలోమీటర్ల దూరంలోని బెయి నగరంలోని ఓ పోలీస్ క్యాంప్ వద్దకు తరలించారు. అక్కడ పాకిస్థానీ, ఇతర ఆఫ్రికన్ జాతీయులతో కలిపి తమను విచారించారని, భారత ఎంబసీతోగానీ, గైడ్ ఫ్రొఫెసర్, కుటుంబసభ్యులతోగానీ మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని విద్యార్థులు చెబుతున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. అక్షిత్, దీపక్, ఉదయ్ ల నుంచి 24 గంటలు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు ఇటలీలోని భారతీయ రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎంబసీ అధికారులు ఆ ముగ్గురి జాడ కనిపెట్టడంతో పాటు, పోలీసుల అదుపులో ఉన్న వారిని విడిపించేదుకు ప్రయత్నించారు. అసలేం జరిగిందో, తమను ఇటలీ పోలీసులు అకారణంగా ఎలా అరెస్ట్ చేశారో, ఎక్కడెక్కడికి తిప్పారో అన్ని విషయాలను వివరిస్తూ ముగ్గురు విద్యార్థులు కలిసి లేఖను రాశారు. ప్రస్తుతం అక్షిత్, దీపక్, ఉదయ్ లను రోమ్ తరలించినట్లు సమాచారం. మరికొద్ది గంటల్లోనే వారు విడుదలవుతారని ఎంబసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఉదంతంపై ఇటలీ అధికారులు పెదవి విప్పడంలేదు. తాము జాతివివక్ష చూపలేదని మాత్రం అంటున్నారు.