
న్యూఢిల్లీ: అవినీతి, దుష్పరిపాలన, జాతి వ్యతిరేక విధానాలే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించాలన్నదే తమ సిద్ధాంతమని అని తేలి్చచెప్పారు. ప్రజా సంక్షేమం ద్వారానే దేశ సంక్షేమం సాధ్యమని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు.
పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం లబి్ధదారులతో ప్రధాని మోదీ గురువారం సమావేశమయ్యారు. ఈ పథకంతో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నా యని వెల్లడించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల వడ్డీకే తక్కువ రుణ సదుపాయం లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 62 లక్షల మందికి రూ.11,000 కోట్లకుపైగా రుణాలు ఇచి్చనట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment