radar
-
నేవీరాడార్ ఏర్పాటు చేయొద్దు
సాక్షి, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో 2,900 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన నేవీరాడార్ కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ గురువారం పూడూరు మండల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ.. నేవీ రాడార్ ఏర్పాటు చేసి తమకు అన్యాయం చేయరాదని తమకు బతకాలని ఉందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, తమ ఆరోగ్యాలను పాడు చేయరాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. కేసీఆర్ తాత, మోదీతాత మాకు న్యాయం చేయలని కోరారు. నేవీరాడార్ ద్వారా విషపూరిత సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయరాదని వేడుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు, హైకోర్టు న్యాయమూర్తికు పోస్టుకార్డు ద్వారా ఉత్తరాలను రాస్తామని విద్యార్థులు తెలిపారు. -
తరంగాల టార్చ్‌లైట్
హౌ ఇట్ వర్క్స్? / రాడార్ అర్ధరాత్రి... దట్టమైన పొగమంచు... నగరం నడిబొడ్డున విమానాశ్రయం. ఉన్నదేమో చిన్నపాటి రన్‌వే. అయినా ప్రతిరోజూ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతున్నాయి. టేకాఫ్ అవుతున్నాయి కూడా. ఎలాగంటారు? ఆ... ఏముంది.. రన్‌వే పొడవునా లైట్లు పెట్టి ఉంచుతారుగా... వాటిని చూసి అంటారా. అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఈ లైట్ల కంటే ఎక్కువ ఉపయోగపడే టెక్నాలజీ వ్యవస్థ రాడార్! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రు విమానాల ఉనికిని తెలుసుకునే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చినా... తరువాతి కాలంలో ఇవి అనేక రంగాల్లో సామాన్యులకూ ఉపయోగపడుతున్నాయి. ఈ రాడార్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం. చీకట్లో మీరెక్కడికైనా వెళ్లాలంటే టార్చ్ ఉపయోగిస్తారు కదా... రాడార్ లేదా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థ కూడా టార్చ్ లాంటిదే. కాకపోతే మామూలు టార్చ్.. వెలుతురు ఆధారంగా పనిచేస్తే.. రాడార్ రేడియో తరంగాలను వాడుకుంటుంది. విమానాశ్రయంలో ఉన్నా... నౌకలు, మొబైల్ ట్రక్కులు... ఇలా దేంట్లో ఉన్నప్పటికీ రాడార్లు ప్రధానంగా చేసే పని రేడియో తరంగాలను ప్రసారం చేయడం. దూరం నుంచి వచ్చే తరంగాలను స్వీకరించడం. ఇందుకోసం ఈ వ్యవస్థలో మాగ్నెట్రాన్ అనే పరికరం ఉంటుంది. ఇది తయారుచేసే సూక్ష్మ తరంగాలను ట్రాన్స్మిటర్ అన్నివైపులకు ప్రసారం చేస్తుంది. ఇవి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూంటాయి. ఏదైనా లోహపు వస్తువును ఢీకొన్నప్పుడు వీటిల్లో కొన్ని కాంతివేగంతో వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తాయి. రాడార్‌లోని యాంటెన్నాలు ఈ తరంగాలను స్వీకరిస్తాయి. యాంటెన్నాలు తరంగాలను ఎప్పుడు ప్రసారం చేయాలి? ఎప్పుడు స్వీకరించాలన్న అంశాన్ని డూప్లెక్సర్ అనే యంత్రం నిర్ణయిస్తుంది. వ్యవస్థలోని కంప్యూటర్ అనవసరమైన విషయాలను తొలగించి అందిన రేడియో తరంగాల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే విశ్లేషించి ఆ వివరాలను రిసీవర్ యూనిట్ ద్వారా స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది. తరంగాలు ప్రసారమై, వెనక్కు వచ్చేందుకు పట్టిన సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. ఈ వివరాలు రాడార్‌లోని ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కనిస్తాయి. అనవసరమైన విషయాలను తొలగించి ఒకప్పుడు కేవలం శత్రు విమానాలను గుర్తించేందుకు మాత్రమే దీన్ని వాడినప్పటికీ ప్రస్తుతం రాడార్లను విమానాశ్రయాలతోపాటు కొన్ని నౌకాయానంలో, వాతావరణ అంచనాల తయారీలోనూ వాడుతున్నారు. -
జిల్లాలో భారీ పరిశ్రమలు
నెల్లూరు (రెవెన్యూ) : నెల్లూరు జిల్లాకు రాబోయే రెండెళ్లల్లో భారీ పరిశ్రమలు రానున్నాయని, వచ్చే నెలలో క్రిబ్కో, కంటైనర్ పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం తన చాంబర్లో జేసీ విలేకరులతో మాట్లాడారు. క్రిబ్కో, కంటైనర్ల పరిశ్రమలకు వెంకటాచలం, టీపీగూడూరు మండలాల్లో భూములు కేటాయించామన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో 2019లో జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన క్రీడా మైదానాల నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. జిల్లాలో ఐటీ పార్క్, ఫుడ్ పార్క్‌లు, ఆటో మొబైల్ హబ్‌లు రానున్నాయని వెల్లడించారు. టీవీఎస్, జీవీకే, రుచి ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు. ఏర్పేడు- నాయుడుపేట మధ్య భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు గుర్తించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. జిల్లాలో 1,192 గ్రామాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహించామన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన 45 వేల ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించామన్నారు. అనేక భూములు ఆక్రమణల్లో ఉన్నాయన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించి పరిశ్రమలు స్థాపనకు భూములు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాడార్ కేంద్రానికి 72 ఎకరాలు కేటాయింపు జిల్లాలో పొదలకూరు మండలం మరుపూరు వద్ద రాడార్ కేంద్రం ఏర్పాటుకు 72 ఎకరాల భూములు కేటాయించామన్నారు. భారత వాయుసేన కేంద్రం ఏర్పాటుకు సన్నద్ధమయిందన్నారు. దీని వల్ల జిల్లా శాస్త్ర, సాంకేతిక పరంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జేసీ తెలిపారు. కలెక్టరేట్ ద్వారా నిరుద్యోగులకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత గుర్తించి వారికి బహుళ జాతి కంపెనీల పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పుట్టంరాజువారికండ్రిగలో పనులు వేగవంతం రాజ్యసభ సభ్యుడు సచిన్టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారికండ్రిగలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టమన్నారు. నిధులు విడుదలలో జాప్యం జరగడం వల్ల పనులు ఆలస్యమయ్యాయన్నారు.