Radio frequency Software
-
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్‌పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్‌పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
కార్డు స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్
సిరిసిల్ల: ఓ ఐడియా బైక్‌లకు భద్రతను తెచ్చిపెట్టింది. వాహనానికి తాళం వేసి ఉంటే చాలు.. ఏదో ఒక కీతో ఆన్‌చేసి చోరీ చేసే రోజులివి. బైక్‌లు, స్కూటీలు, కార్లు సైతం దొంగల బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆర్సీకార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒక కార్డుతో స్కాన్ చేస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా డివైస్‌ను రూపొందించాడు. జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన బుధవారపు మల్లేశం తన బైక్ ఆక్టివాకు ఆర్సీ కార్డు నంబరును స్కాన్ చేశాడు. రేడియో ఫీక్వెన్సీ స్కానర్, మైక్రో కంట్రోల్ ఐసీని ద్విచక్రవాహనానికి అమర్చాడు. వాహనం బ్యాటరీ సాయంతో అది పని చేస్తోంది. బండికి కీస్పెట్టి, ఆర్సీ కార్డు, లేదా లైసెన్స్ కార్డును ఏదో ఒకదానిని స్కాన్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది. కార్డు స్కాన్ కాకుండా.. కీస్ ఉన్నా బండి ఇంజిన్ ఆన్ కాదు. ఈ తరహా రేడియో ప్రీక్వెన్సీ డివైస్‌ను బైక్, కారు, లారీ, బస్సు లాంటి ఇతర వాహనాలకు ఏర్పాటు చేసుకోవచ్చు. బీటెక్ ఈసీఈ చదివిన మల్లేశం కేవలం రూ.1,500 ఖర్చుతో డివైస్‌ను రూపొందించాడు. ఎవరైనా వాహనదారులు కావాలనుకుంటే లాభాపేక్ష లేకుండా బైక్‌లు, కార్లకు దీనిని అమర్చుతానని మల్లేశం తెలిపాడు. ఆసక్తి గలవారు 63024 72700 సెల్ నంబరులో సంప్రదించండి. -
సవాల్‌గా ‘ఎర్ర’దుంగల భద్రత
* ఇప్పటికే గోదాముల్లో సీసీ కెమెరాలు * తాజాగా రేడియో ఫ్రీక్వెన్వీ సాఫ్ట్వేర్ * పోలీసుల సాయం కోరుతున్న వైనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వేలానికి సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలకు భద్రత కల్పించడం అటవీశాఖకు సవాల్‌గా మారింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని అటవీశాఖ గోదాముల్లో వేలాది టన్నుల ఎర్రచందనం దుంగలున్నాయి. వీటిని లూటీ చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రత కల్పించే బాధ్య త అటవీశాఖపై పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న దుంగలను వేలం వేయాల్సి ఉంది. ఎక్కువ మంది బిడ్డర్లను ఆకర్షించే ప్రయత్నంలో వేలంను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాజాగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా భద్రత కల్పిం చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రతి దుంగకు రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంతో ఉన్న టాగ్ ఏర్పాటు చేయనున్నారు. దుంగలను కదిలిస్తే ‘బీప్’ శబ్దం వచ్చేలా ఈ సాఫ్ట్వేర్ రూపొందించారు. కంట్రోల్ యూనిట్‌ను ఒకే చోట కాకుండా పలుచోట్ల ఏర్పాటు చేసుకుని, కార్యాలయంతో అధికారుల వద్ద కూడా పెట్టుకుని నిరంతరం పర్యవేక్షించవచ్చని తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను ఎర్రచందనం ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్క దుంగ పోయినా లక్షల్లో నష్టం వస్తుందని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. గోదాముల వద్ద భద్రత కోసం పోలీసుల సాయం కూడా తీసుకునే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం దేశ విదేశాల నుంచి వస్తున్న వ్యాపారులు ఎర్ర చందనం గోదాముల్లో ఉన్న నిల్వలను చూసి వెళుతున్నారు. జపాన్, చైనా, యునెటైడ్ ఎమిరేట్స్, సింగపూర్, ఆస్ట్రేలియా వ్యాపారులు దుంగలను చూసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ దేశాల నుంచి 123 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. స్వదేశం నంచి దాదాపు 260 కంపెనీల ప్రతినిధులు వచ్చినట్లు చెబుతున్నారు. వేలం పూర్తయ్యే వరకు వీటి భద్రత కత్తిమీద సాములా తయారైంది.