Radio waves
-
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్‌లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్‌లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్‌తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
అతీత శక్తులు ఉన్నాయా...?
వాషింగ్టన్ : ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది. విశాల చీకటి అంతరిక్షంలో మనషికి తెలియని అతీత శక్తులు.. వాటి ధ్వనులను గుర్తించినట్టు వెల్లడించింది. శాటిలైట్ల ప్రయాణంలో రికార్డు చేయబడిన ధ్వనులను నాసా తాజాగా విడుదల చేసింది. నాసా విడుదల చేసిన ఆడియో టేపుల్లో అతీతశక్తుల ధ్వనులను స్పష్టంగా వినవచ్చును. అంతరిక్షంలోని అతీంద్రియం లోకం నుంచి విచిత్ర ధ్వనులు, సంకేతాలు అందుతున్నట్లు నాసా తెలిపింది. ఈ ధ్వని తరంగాల్లో రేడియో, ప్లాస్మా, మ్యాగ్నటిక్ వేవ్స్‌ను ఆడియో టేపుల్లోకి నాసా అధికారులు మార్చారు. ఆడియోటేపుల్లో కొన్ని శబ్దాలు అత్యంత భయానకంగా ఉంటే మరికొన్ని ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. భూమికి ఆవల రికార్డు చేసిన 22 ఆడియో టేపులను నాసా విడుదల చేసింది. -
అతీత శక్తులు ఉన్నాయా...?
-
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా ?
-
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?
⇒ సుదూర విశ్వం నుంచి భూమిని తాకుతున్న ఎఫ్ఆర్బీలు ⇒ వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు ఉన్నారా? అత్యాధు నిక టెక్నాలజీ సాయంతో వారు అంతరిక్ష నౌకలనూ నడపగలుగుతున్నారా? దీనికి అవునంటున్నారు హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు. ఫాస్ట్ రేడియో బరస్ట్స్(ఎఫ్ఆర్బీ)లపై జరిపిన పరిశోధనలతో తామీ అంచనాకు వస్తున్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త మనస్వి లింగం అంటున్నారు. సుదూర విశ్వం నుంచి.. మీకు రేడియో తరంగాల గురించి తెలుసుకదా.. సెల్ఫోన్లు మొదలుకుని.. మిలిటరీ కమ్యూనికేషన్స్ వరకూ అనేక చోట్ల వీటిని వాడుతుంటాం. వీటిల్లో కొన్ని తక్కువ శక్తి కలిగి ఉంటే.. ఇంకొన్ని అత్యధిక శక్తి కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో.. ఎలా ప్రసారం చేయాలో.. తీవ్రతను ఎలా ని యంత్రించాలో మనకు తెలుసు. కానీ.. ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిని తాకాయనుకోండి. ఎలా ఉంటుంది?. అది కూడా కేవలం 5 మిల్లీ సెకన్ల పాటు మాత్రమే ఈ తరంగాలు ప్రసారమవుతూంటే? ఆసక్తికరంగా ఉంటుంది కదూ.. ఈ రకమైన ఎఫ్ఆర్బీను ఆస్ట్రేలియాలోని పార్క్స్ వేదశాల శాస్త్రవేత్తలు 2007లో తొలిసారి గుర్తించారు. విశ్వం నుంచి వెలువడే అనేకానేక రకాల తరంగాల్లో ఇదీ ఒకటి కాబోలు అనుకున్నారు. అయితే 2007 తరువాత ఇప్పటివరకూ ఇలాంటి ఎఫ్ఆర్బీలు కొన్ని డజన్లు గుర్తించడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. 2015లో మెక్‌గిల్ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త ఇవన్నీ ఒకే దిక్కు నుంచి వస్తున్నట్లు గుర్తించడం.. గతేడాది ఇవన్నీ 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత నుంచి వస్తున్నట్లు గుర్తించడంతో విషయం కొంచెం సీరియస్ అయింది. ఎంతో దూరాన్ని దాటుకుని.. ఈ ఎఫ్ఆర్బీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజసిద్ధమైనవా? లేక ఎవరైనా సృష్టిస్తున్నారా? అన్న అంశాలను తెలుసుకునేందుకు అవి లోబ్, మనస్వీ లింగంల బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రహాంతర వాసులెవరో వీటిని సృష్టించేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వీరు ప్రతిపాదిస్తున్నారు. సౌర శక్తి ద్వారా భారీ సైజు ట్రాన్స్మిటర్ల (ఒక్కొక్కటీ గ్రహం సైజు)తో ఈ రేడియో తరంగాలను సృష్టిస్తున్నారని.. కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలను నడిపించేందుకు వీటిని ఉపయోగిస్తూండవచ్చని అంటున్నారు. ‘‘ఈ వ్యవస్థలో 2 భాగాలున్నాయి. సోలార్ ప్యానె ల్స్ వంటి వాటితో శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే.. రేడియో తరంగాలను ప్రసారం చేసేది రెండోది. ఈ తరంగాల సాయంతోనే లైట్ సెయిల్ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూంటాయి’’అని మనస్వి అంటున్నారు. కోట్ల దూరాన్ని దాటుకుని భూమిని చేరుతున్న ఎఫ్ఆర్బీల శక్తిని పరిశీలిస్తే ఆ రేడియో ట్రాన్స్మిటర్ల సైజు అంచనా వేయవచ్చని.. భూ మి వ్యాసార్థానికి రెట్టింపు సైజున్న ట్రాన్స్మిటర్లను వాడి ఉంటారంటున్నారు. అయితే.. ఎఫ్ఆర్బీలు గ్రహాంతరవాసుల సృష్టి అయ్యేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ ఇప్పటివరకూ పరిశీలించిన ఎఫ్ఆర్బీల సంఖ్య తక్కువ కాబట్టి అప్పు డే ఒక అంచనాకు రాలేమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
10 సెకన్లలో 60 జీబీని పంపారు!
బెర్లిన్: వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జర్మనీలోని స్టట్గార్ట్ వర్సిటీ, ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్కు చెందిన అప్లయిడ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ రికార్డును సాధించారు. జర్మనీలోని వాచ్బెర్గ్ టౌన్‌కు కొలొగ్నె కు మధ్య దూరం 36.7 కి.మీటర్లు. ఈ బృందం రెండుప్రాంతాలకు 60 గిగాబైట్ల సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా కేవలం 10 సెకన్లలో పంపింది. అంటే సెకనుకు 6 గిగాబైట్లా సమాచారాన్ని పంపించారు. ఇందుకు ఈ-బ్యాండుగా పిలిచే 71-76 గిగా హెట్జ్ రేడియో ఫ్రిక్వెన్సీలో ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో పల్లెల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులంటున్నారు. 250 ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక సెకనుకు 24 మెగాబైట్ల సమాచారాన్ని పంపగల్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. -
మైక్రో ఓవెన్లలో ఉండే తరంగాలు?
Civils Prelims Paper - I (Physics) కాంతి (అదృశ్య వికిరణాలు) అతి నీలలోహిత కిరణాలు అతి నీలలోహిత కిరణాలను రిట్టర్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్యం 4000అని నుంచి 100అని వరకు ఉంటుంది.క్వాంటం సిద్ధాంతం ప్రకారం. ఈ కిరణాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అతి నీలలోహిత కిరణాలను దాదాపు అన్ని రకాలైన గాజు పదార్థాలు శోషణం చేసుకుంటాయి. క్వార్ట్జ గాజు ద్వారా ఈ కిరణాలు చొచ్చుకు వెళతాయి. అందువల్ల క్వార్ట్జ గాజుతో తయారైన కటకాలను, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని గుర్తించవచ్చు. అతి నీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి. అనువర్తనాలు: 1. పాలలో, నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేయడానికి 2. ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలంపాటు నిల్వ చేయడానికి ఉదా: బ్రెడ్, పచ్చళ్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాటికి సోడియం బెంజోయేట్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు. 3. వైద్యరంగంలో హానికరమైన బ్యాక్టీరియాను నశింపచేసేందుకు వాడతారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. 4. సహజ, కృత్రిమ దంతాలను వేర్వేరుగా గుర్తించడానికి వాడతారు. 5. కుళ్లిన కోడిగుడ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. 6. తొలిదశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను గుర్తించడానికి 7. టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో 8. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడంలో 9. అతినీలలోహిత కిరణాలు మన శరీరంపైన పతనమైనప్పుడు 1ఝఝ లోతుకు చొచ్చుకొని వెళ్లి విటమిన్ ఈ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. 10. వేలిముద్రలను విశ్లేషించడానికి 11. {ధువ పత్రాలు, కరెన్సీ నోట్లు అసలువా, నకిలీవా తేల్చడానికి ఉపయోగిస్తారు. నష్టాలు: సూర్యుని నుంచి వచ్చే మొత్తం కాంతిలో అతి నీలలోహిత కిరణాలు 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కిరణాల శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మానవులపై పతనమైనప్పుడు చర్మ క్యాన్సర్ కలుగుతుంది. ఈ హానికరమైన కిరణాలను భూమి వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కాబట్టి ఈ కిరణాలు భూమిని చేరవు. కానీ క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడి వాటి ద్వారా ఈ కిరణాలు భూమిని చేరుతున్నాయి. కాబట్టి ఈ నష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జపాన్‌లోని క్యోటోనగరంలో 1996 డిసెంబరులో ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 16న ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని క్యోటో ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 2005 ఫిబ్రవరి 16న అమల్లోకి వచ్చింది. లేజర్ కిరణాలు LASER - Light Amplification by Stimulated Emmision of Radiation. లేజర్ కిరణాలకు సంబంధించిన సూత్రాన్ని 1954లో చార్లెస్ హెచ్టౌన్స ప్రతిపాదించాడు. ఈ సూత్రం ఆధారంగా 1958లో థైడర్మెమన్ అనే శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. లేజర్ కిరణాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. ఘన పదార్థాల్లో రూబిస్ స్ఫటికాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. వాయు పదార్థాల్లో జడవాయువులను (హీలి యం, నియాన్) ఉపయోగించి హెవిజావాన్ అనే అమెరికా శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. ఈ వాయువుల నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: సంబద్ధత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం లాంటివి సమానంగా ఉంటాయి. ఈ లక్షణాన్ని సంబద్ధత అంటారు. ఏకవర్ణీయత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల తరంగదైర్ఘ్యం ఎల్లప్పుడూ కూడా ఒకేవిధంగా ఉండటం వల్ల ఈ కిరణాల రంగు కూడా ఒకే విధంగా ఉంటుంది. దీన్ని ఏకవర్ణీయత అంటారు. దిశనీయత: లేజర్ కిరణాలు అత్యధిక దూరం రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఈ లక్షణాన్ని దిశనీయత అంటారు. తీవ్రత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాలు అధిక తీవ్రతను కలిగి ఉంటాయి. ఉపయోగాలు: మానవ అవసరాల మేరకు తగిన శక్తిని కలిగి ఉన్న లేజర్ కిరణాలను ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి. - భూమి నుంచి ఇతర గ్రహాలు, ఉపగ్రహాలకు మధ్య దూరాలను కచ్చితంగా లెక్కించడానికి - భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యను, ఎత్తును తెలుసుకోవడానికి - భూమి ఆత్మభ్రమణ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి - ఒక ఘన పదార్థంలో అణువుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడానికి - భిన్న ఐసోటోపులను గుర్తించి, వాటిని వేరుచేయడానికి - పుప్పొడి రేణువుల కదలికలను అధ్యయనం చేయడానికి - అత్యంత దృఢ పదార్థాలైన వజ్రం, లోహాలు, లోహమిశ్రమాలు, రాళ్లు మొదలైన వాటికి రంధ్రాలను చేయడానికి, కోయడానికి - అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విస్ఫోటనం చెందించడానికి - యుద్ధంలో లక్ష్యాన్ని గురిపెట్టడానికి - పురాతన కట్టడాలు, విగ్రహాలను శుభ్రపరిచేందుకు - సాంస్కృతిక కార్యక్రమాల్లో (లేజర్ షో) బార్‌కోడ్‌లను చదవడానికి స్పష్టమైన ప్రింటింగ్, జిరాక్స్‌ల కోసం ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఉపయోగించే లేజర్ కిరణాలను అర్ధవాహక పదార్థాలైన సిలికాన్, జెర్మేనియం నుంచి ఉత్పత్తి చేస్తారు. - వాహనాల వేగాన్ని లెక్కించడానికి, స్పీడ్‌గన్ అనే కెమెరా, సిడీలు, డీవీడీలు మొదలైన వాటిలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి - ఆప్టికల్ ఫైబర్‌లో సమాచార ప్రసారం కోసం - ఎండోస్కోపిక్ విధానంలో - హోలోగ్రఫీ విధానంలో ఒక వస్తువును 3డీ పద్ధతిలో ఫొటో తీయడానికి వాడతారు. - వాతావరణ కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి అంటారు. - రెటీనాపై ఏర్పడే పొరను తొలగించడానికి - గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి - మెదడులో ఏర్పడిన కణతులను తొలగిం చడానికి - సుదూరం ప్రయాణించే రాకెట్లు, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగిస్తారు. లేజర్ కిరణాల ధర్మాలను అధ్యయనం చేసి, వాటిని ఉత్పత్తి చేయడానికి భారత అణుశక్తి సంఘం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డాక్టర్ రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. రేడియో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 1ఝ నుంచి 100ఝ వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. వీటి వేగం శూన్యంలో, గాలిలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఈ తరంగాలను టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో, వాతావరణాన్ని విశ్లేషించ డంలో ఉపయోగిస్తారు. మైక్రో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 10-6ఝ పరిధిలో ఉంటుంది. మైక్రో తరంగాలు కూడా ఒకరకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అందువల్ల ఈ కిరణాలు గాలిలో, శూన్యంలో కాంతివేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. మైక్రో తరంగాలను సమాచార రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఒక ప్రదేశాన్ని భౌతికంగా తాకకుండా, దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పద్ధతిని సెన్సింగ్ విధానం అంటారు. మైక్రో ఓవెన్లలో ఆహార పదార్థాలను వేడిచేయడానికి ఈ తరంగాలను వాడతారు. ఆహార పదార్థాలను అలోహ పదార్థాలతో తయారు చేసిన పాత్రల్లో నింపి మైక్రో ఓవెన్లో అమర్చాలి. ఈ మైక్రో తరంగాలు ఆహారపు అణువుల్లోకి చొచ్చుకుపోయి వాటి కంపన పరిమితిని అనేకరెట్లు పెంచుతాయి. అందువల్ల ఈ కంపన శక్తి ఉష్ణశక్తిగా మారడం వల్ల ఆహారపు పదార్థాలు వేడెక్కుతాయి. ఈ మైక్రో ఓవెన్‌ను స్పెన్సర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కిరణాలు కిరణాలను క్రీ.శ. 1895లో రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతనికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి 1901లో లభించింది. ధర్మాలు - ఉపయోగాలు: ఈ కిరణాల తరంగధైర్ఘ్య అవధి 100అని నుంచి 0.010అని వరకు ఉంటుంది. తరంగధైర్ఘ్యం తక్కువగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. అందువల్ల ఇవి ఒక రకమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు మాత్రమే. ్ఠ-కిరణాల వేగం గాలిలో, శూన్యంలో కాంతివేగానికి (ఇ= 3 ప 108ఝ/ట) సమానంగా ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం లేకపోవడం వల్ల విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో వంగి ప్రయాణించకుండా, రుజుమార్గంలో వెళతాయి. ఈ కిరణాలకు ఆవేశం లేకపోవడం వల్ల వీటి అయనీకరణ సామర్థ్యం దాదాపు శూన్యం. ఈ కిరణాలు ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను ప్రభావితం చెందిస్తాయి. కిరణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కఠిన ్ఠ-కిరణాలు: వీటి తరంగ ధైర్ఘ్య అవధి 0.010అని నుంచి 4అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాల శక్తి ఎక్కువగా ఉంటాయి. మెత్తని పదార్థాలు, కఠిన పదార్థాల ద్వారా చొచ్చుకు వెళతాయి. ఈ కిరణాలను కిందివాటిలో ఉపయోగిస్తారు. పెద్ద పైపులు, బాయిలర్స, డ్యాములలో పగుళ్లు, రంధ్రాలను గుర్తించడానికి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దులు, దర్శనీయ స్థలాల వద్ద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయడానికి. మృదు ్ఠ- కిరణాలు: వీటి తరంగదైర్ఘ్య అవధి 4అని100అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాల శక్తి తక్కువగా ఉండి కేవలం మెత్తగా ఉన్న రక్తం, మాంసం ద్వారా మాత్రమే చొచ్చుకొని వెళతాయి. కఠినమైన ఎముకల ద్వారా చొచ్చుకు వెళ్లవు. వైద్యరంగంలో ఈ మృదు ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. జీర్ణాశయానికి సంబంధించి ్ఠ-కిరణాల ఫొటోను తీయడానికి ముందుగా రోగికి Barium Sulphate - Baై4 అనే రసాయన పదార్థాన్ని తాగిస్తారు. ఈ పదార్థం ్ఠ-కిరణాలను జీర్ణాశయంలో కావాల్సిన అవయవాలపై కేంద్రీకృతం చేస్తుంది. కంప్యూటెడ్ టోమాగ్రఫీ స్కానింగ్ (సీటీ స్కానింగ్)లో ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. వైద్యరంగంలో ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని రేడియో గ్రఫీ, రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అని అంటారు. ్ఠ కిరణాలను ఉపయోగించి పనిచేసే వైద్యుడిని రేడియాలజిస్ట్ అని పిలుస్తారు. కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ నాళాన్ని వాడతారు. దీన్ని సీసంతో నిర్మించిన పెట్టెలో అమర్చుతారు. ఎందుకంటే, సీసం ద్వారా ్ఠ-కిరణాలు చొచ్చుకు వెళ్లవు. విశ్వ కిరణాలు (కాస్మిక్ రేస్) విశ్వంలో ఏదో ఒకచోట జనించిన అత్యంత శక్తివంతమైన కిరణాలు నిరంతరంగా భూమిని చేరుతున్నాయి. వీటిని విశ్వకిరణాలు అంటారు. ఈ కిరణాల ఉనికిని సీటీఆర్ విల్సన్ అనే శాస్త్రవేత్త గుర్తించగా, ప్రయోగాత్మకంగా మిల్లికాన్ కనుగొన్నాడు. ధర్మాలు: విశ్వ కిరణాల్లోని కణాల్లో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, ప్రోటాన్లు, న్యూ ట్రాన్ల్లు మొదలైనవి. వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు ఉంటాయి. ఒక ప్రదేశంలోని విశ్వకిరణాల ఉనికిని, దిశను తెలుసుకోవడానికి కాస్మిక్ రే టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. భూమి ధ్రువాల వద్ద ఈ కిరణాల తీవ్రత ఎక్కువగా, భూ మధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. విశ్వకిరణాల శక్తి 109్ఛఠి నుంచి 1020్ఛఠి వరకు ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం వీటి తరంగదైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాలు అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. విశ్వ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కఠిన కాస్మిక్ కిరణాలు: ఇవి 10 సెం.మీ. మందం కలిగి ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్తాయి. మృదు కాస్మిక్ కిరణాలు: ఈ కిరణాల శక్తి తక్కువగా ఉంటుంది. 10 సెం.మీ. మందం ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్లలేవు.