radiologist
-
రేడియా'లేజీ '
అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రేడియాలజిస్టు, సిబ్బంది లేకపోవడంతో రేడియాలజీ సేవలను ఎంబీబీఎస్ వైద్యునితో అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేడియాలజీ విభాగంలో రోజురోజుకూ సేవలు మృగ్యంగా మారుతున్నా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శ్రద్ధ చూపడం లేదు. నాలుగేళ్లుగా ఒకరికే బాధ్యతలు.. సర్వజనాస్పత్రిలో నాలుగేళ్లుగా ఎంబీబీఎస్ అర్హత కల్గిన డాక్టర్ నాగరాజు రేడియాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో షిఫ్ట్‌ల ప్రకారం వైద్యులు నివేదికలను సిద్ధం చేసి కోర్టుకెళ్లేవారు. ఆస్పత్రి యాజమాన్యం సిబ్బంది కొరతను చూపుతూ ఈ బాధ్యతను ఎంబీబీఎస్ వైద్యులైన నాగరాజుకు అప్పగించేసింది. ఇటీవల కాలంలో పలు కేసుల్లో ఎక్స్‌రేలు తీసే విషయంలో సిబ్బందికి, వైద్యుని మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఒక కేసుకు అధిక సంఖ్యలో ఎక్స్‌రేలు తీయాలని చెబుతున్నారని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఎంఎల్సీ రిపోర్టుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం ఓ వైద్యునికే బాధ్యతలు ఇప్పించి చోద్యం చూస్తోందని మండిపడుతున్నారు. ఒకే ఒక్కరు.. రేడియాలజీ విభాగంలో ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉన్నారు. వాస్తవంగా రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్, నలుగురు ట్యూటర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ట్యూటర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్న వైద్యుల్లో డాక్టర్ పద్మ (ట్యూటర్), డాక్టర్ వసుంధర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఇద్దరు లాంగ్‌వీల్‌లో ఉన్నారు. అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనారోగ్యం కారణంతో విధులకు రావడం లేదు. రేడియాలజిస్టులకొరతతోనే రేడియాలజిస్టుల కొరతతోనే ఎంబీబీఎస్ వైద్యులైన డాక్టర్ నాగరాజుకు బాధ్యతలు అప్పగించాం. అయినా అందుబాటులో ఉన్న రేడియాలజిస్టు సలహాతోనే డాక్టర్ నాగరాజు రిపోర్టులు రాస్తారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత తెల్సిందేకదా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులే కోర్టుకెళ్లి వివరణ ఇస్తుంటారు. – డాక్టర్ జగన్నాథ్,సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
రేడియాలజిస్ట్ రత్నాకర్ సస్పెన్షన్
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రేడియాలజిస్ట్ రత్నాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేడు ఆసుపత్రిలో విచారణ చేయనున్నారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళాల పట్ల వైద్యులు, సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా రేడియాలజిస్ట్ రత్నాకర్‌ను సస్పెండ్ చేశారు. -
ఎముకల క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎముకల క్యాన్సర్(బోన్‌మ్యారో)ను తొలిదశలో గుర్తించడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మురళీ సుందరం అన్నారు. మస్కులోస్కెలిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ హాలులో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో బోన్‌మ్యారో అంశంపై ఆయన ఆదివారం డాక్టర్ కాకర్ల సుబ్బారావు గోల్డ్ మెడల్ ప్రసంగం చేశారు. బోన్‌మ్యారో ఎంఆర్ఐ గురించి సుందరం వివరించారు. బోన్‌మ్యారోకు సంబంధించి పలు ఇమేజ్‌లు చూపిస్తూ వాటిలో క్యాన్సర్ కణాలను ఎలా గుర్తించాలో వివరించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో మడమ ఎమ్ఆర్ఐకి అవసరమైన సాధనాలు, చికిత్సా విధానాలపై చంఢీఘర్‌కు చెందిన డాక్టర్ మహేష్ ప్రకాష్, మోకాలిలో లిగమెంట్లు వాటి ప్రాధాన్యత- కలిగే వ్యాధులు, చికిత్సా విధానాలపై అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అంకుర్‌షా వివరించారు. మోకాలు కీలులోని మృదులాస్థికి సంబంధించి వచ్చే ఇబ్బందులు, అరిగిపోవడం- చేయాల్సిన చికిత్సలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ యన్. విజయభాస్కర్ విశ్లేషణాత్మకంగా చెప్పారు. ఎక్స్‌టెన్సార్ ‘మెకానిజమ్ ఆఫ్ నీ’ అంశంపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లలిత, పొస్టిరోలేటరర్ స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ నీ అంశంపై ముంబాయికి చెందిన డాకట్ ్రమాలిని లావండీ, ఎముకపై లీజన్స్ వాటికి వచ్చే సమస్యలు చికిత్సా విధానాలు, కండరాల ఎంఆర్ఐ చికిత్సా విధానంపై అమెరికాకు చెందిన ప్రొఫెసర్ నోగా హరమతి, ఆస్టియో నెక్రోసిన్ ఇమేజింగ్, దీనివల్ల ఫలితాలను చెన్నైకు చెందిన గోవిందరాజ్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దండమూడి శ్రీనివాస్, డాక్టర్ కులదీప్ తదితరులు పాల్గొన్నారు.