ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగొళు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రకటించిన వరి ధాన్యం గ్రేడ్ వన్ రకం రూ.1510, సాధారణ రకం ధాన్యం రూ.1470 మద్దతు ధర పొందాలని తెలిపారు.
దళారులను ఆశ్రయించి మోసపోకుండా మార్కెట్లోనే విక్రయాలు జరపాలని కోరారు. బహిరంగ కొనుగొళ్ళకు పాల్పడితే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మార్కెట్ కమిటి గోదాములలో పంటలు నిల్వ నిల్వ చేసి వాటి విలువలో 75శాతం దాదాపు రూ.2లక్షల గరిష్ట పరిమితికి లోబడి భూమి తనఖా లేకుండా ఋణం పొందే సౌకర్యాన్ని కల్పించిందన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రతతో పాటు భీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. సరైన మద్దతు ధర రాకపోతే రైతుల అభ్యర్ధన మేరకు 270 రోజుల వరకు నిల్వ ఉంచుకునే సదుపాయం కల్పించిందన్నారు.