rafeal
-
దేశ తొలి రఫేల్ మహిళా పైలట్‌ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. దేశంలో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందిన శివంగి సింగ్‌ను అభినందించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా మహీంద్రా పంచుకున్నారు. ఆ ట్వీట్లో ఇలా.. "అవును! మీరు శివంగి లాగా శత్రువుల మీద విరుచుకు పడండి! మీరు మా రాఫెల్ రాణి" అని పేర్కొన్నారు. ఇక దేశంలో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందింది శివంగి సింగ్. ఎయిర్ ఫోర్స్ శకటంపై ఆమె సెల్యూట్ చేస్తూ కనిపించింది. అలాగే, ఎయిర్ ఫోర్స్ శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్‌గా కూడా ఈమె ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి శకటంపై నిల్చుని జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని సెల్యూట్ చేస్తూ కనిపించింది. అలా ఈ రిపబ్లిక్ డేన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా శివంగి సింగ్ నిలిచింది. వారణాసికి చెందిన శ్రీమతి సింగ్ 2017లో ఐఎఎఫ్‌లో చేరారు. ఐఎఎఫ్ రెండవ బ్యాచ్ మహిళా ఫైటర్ పైలట్లలో నియమించబడ్డారు. రాఫెల్ నడపడానికి ముందు ఆమె మిగ్-21 బైసన్ విమానాలను నడిపింది. పంజాబ్‌లోని అంబాలా కేంద్రంగా పనిచేస్తున్న ఐఎఎఫ్ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్'లో ఆమె భాగం. Yesssss! You Show them Shivangi! You’re our RafaleRani 💪🏽💪🏽💪🏽 https://t.co/gwJA7YuLC1 — anand mahindra (@anandmahindra) January 26, 2022 (చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..!) -
మోదీ ఓడిపోతారు.. రాహుల్ జోస్యం
రాయ్‌బరేలీ: రఫేల్ రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల పదును పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. మోదీ అజేయుడు కాదన్న తన మాటలు ఎన్నికల తర్వాత రుజువు అవుతాయని పేర్కొన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి రాహుల్ తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ మాట్లాడారు. గత ఐదేళ్లలో మోదీ ఏమీ చేయలేదని ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రివ్యూ పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించడం కేంద్రానికి చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో బహిరంగ చర్చకు రావాలని, లేదంటే తానే ప్రధాని నివాసానికి వచ్చి చర్చలో పాల్గొంటానని ప్రధాని మోదీకి మరోసారి సవాల్ విసిరారు. ఒకవేళ చర్చ జరిగితే మోదీ.. ఎవరి కళ్లలోకి కూడా నేరుగా చూడలేరని ఎద్దేవా చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీకి దక్కాల్సిన రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం అనిల్ అంబానీకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. వివేకంతో ఓటేయండి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని ఓటర్లకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. మోదీ అధికారంలోకి రాకముందు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటికి బదులు నిరుద్యోగం, అపనమ్మకం, హింస, ద్వేషం, భయాలను దేశ ప్రజలకు ఇచ్చారని ఓటర్లకు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల్లేవు. రూ.15 లక్షలు లేవు. దీనికి బదులు నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్, రైతులకు బాధలు, సూటు బూటు సర్కారు, రఫేల్.. అబద్ధాలు.. అబద్ధాలు.. అపనమ్మకం, హింస, ద్వేషం, భయం ఇచ్చారు’అని ట్వీట్ చేశారు. -
రఫేల్ డీల్ వ్యవహారంలో మరోసారి రాహుల్ విమర్శలు
-
కేంద్ర రాజకీయాల్లో రాఫెల్ రచ్చ
-
రాఫెల్ చుట్టు రచ్చ
-
రాఫెల్ కుంభకోణంలో మోదీ పాత్ర ఉంది
-
‘రఫేల్’ను తొక్కిపట్టేందుకే సీబీఐ డైరెక్టర్ తొలగింపు
హైదరాబాద్: రఫేల్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నారనే అక్కసుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించిన మోదీకి అధికారంలో కొనసాగే హక్కులేదని స్పష్టం చేశారు. అలోక్ వర్మ తొలగింపును నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ కోఠిలోని సీబీఐ కార్యాలయం ముందు వందలాది మంది మహాకుటమి కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు సీబీఐ కార్యాలయ గేట్లను మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అక్కడికి రావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కుంతియా, ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్‌యాదవ్‌లను అరెస్టు చేసి మలక్‌పేట్ పోలీసుస్టేషన్‌కు, మిగతావారిని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కుంతియా, ఉత్తమ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను, సెక్యులరిజాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందనీ, ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఉండటం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. రఫేల్ కుంభకోణాన్ని తొక్కి పట్టేందుకే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ముఖేశ్‌గౌడ్ డుమ్మా గోషామహాల్ నియోజకవర్గంలోని కోఠి ప్రాంతంలో కుంతియాలాంటి జాతీయ నేతల సమక్షంలో జరుగుతున్న ధర్నాకు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్ డుమ్మా కొట్టడం గమనార్హం. ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా, లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. అని స్థానిక నాయకులకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టులో విచారణ
-
ఎన్సీపీలో రాఫెల్ ఒప్పందం చిచ్చు
-
రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి స్పందన
న్యూయార్క్ : రోజుకో మలుపు తిరుగుతున్న రాఫెల్ డీల్ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ స్పందించారు. రాఫెల్ డీల్ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్ జరిగేటప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. యునిటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న సమయంలో ప్రెస్‌తో సమావేశమైన సమయంలో ఈ మేరకు స్పందించారు. మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పిన మాదిరి మోదీ ప్రభుత్వమే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను భారత భాగస్వామిగా చేర్చుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వానికి లేదా రాఫెల్ తయారీదారి డసో ఏవియేషన్ సంస్థకు ప్రతిపాదించిందా? అని అధ్యక్షుడు మాక్రోన్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. వీరి ప్రశ్నపై స్పందించిన మాక్రోన్.. ‘ఏ ఆరోపణలను నేను ప్రత్యక్షంగా తిప్పికొట్టలేను. ఆ సమయంలో నేను ఇన్‌ఛార్జ్‌గా లేను. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని తెలిపారు. కాగా, గతేడాది మేలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రోన్ ఎన్నికయ్యారు. రాఫెల్ డీల్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రకటించారు. ఆ సమయంలో ఫ్రాంకోయిస్ హోలాండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ గత వారం పేల్చిన బాంబుతో, భారత్‌లో రాఫెల్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాగా, రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలాండ్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్ ప్రభుత్వం, డసో కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి, ఒక ప్రైవేట్ సంస్థను ఎలా ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది కూడా. -
‘కాంగ్రెస్’కు అంబానీ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో భారీగా లబ్ధి పొందారంటూ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ గ్రూప్‌పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆ సంస్థ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేతలు రాఫెల్ ఒప్పందంపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలంటూ లీగల్ నోటీసులు పంపిం ది. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నెలరోజులపాటు దేశవ్యాప్తంగా.. నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాఫెల్ కుంభకోణం జరిగిందని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ.. ఓ వ్యాపారవేత్తకు లాభం మేలుచేకూర్చేందుకే మోదీ ఒప్పందం మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ అధ్య క్షుడు రాహుల్‌కు రాసిన లేఖలోనూ అనిల్ అంబానీ అభ్యం తరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘వ్యాపార ప్రత్యర్థులు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ తప్పుడు సమాచారం అందింది’అని ఆ లేఖలో రాహుల్‌కు అనిల్ అంబానీ సూచించారు. అయితే ఇలాంటి నోటీసులుకు భయపడబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న కాంగ్రెస్ ఎంపీ సునీల్ జఖడ్.. రాఫెల్ ఒప్పందం దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయమన్నారు. ఈ నోటీసులు.. బీజేపీ, కార్పొరేట్ కంపెనీల మధ్య సంబంధానికి సాక్ష్యమని ఆయన అన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఓ వ్యాపారవేత్త లీగల్ నోటీసులు పంపడం చాలా సీరియస్ అంశం. బీజేపీ, కార్పొరేట్ కంపెనీల మధ్య సంబంధంపై మా పోరాటం కొనసాగుతుంది’అని జక్కడ్ వెల్లడించారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీల పేర్లతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శక్తిసింగ్ గోహిల్, ప్రియాంక చతుర్వేది, జైవీర్ షెర్గిల్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. -
'అంతా ఓకే కానీ ఇప్పుడు కాదు'
న్యూఢిల్లీ: భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరైన దారిలోనే ముందుకుపోతుందని, అయితే ఇది ఈ పర్యటనలోనే పూర్తయ్యే విషయం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆదివారం భారత్ చేరుకున్న ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం కీలకం కానుందని హోలండే తెలిపారు. రాఫెల్ యుధ్దవిమానాల కొనుగోలుకు రూ 60 వేల కోట్లతో భారత్.. ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి భారత్ పొందనుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి సాంకేతికపరమైన కారణాల నేపథ్యంలో మరికొంత కాలం ఆగక తప్పదని హోలండే తెలిపారు.