Rafiq
-
బోడుప్పల్లో పోలీసుల కార్డెన్ సర్చ్
బోడుప్పల్లో పోలీసులు కార్డన్ సర్చ్‌ను ఇందిరానగర్, వీరారెడ్డినగర్, కాకతీయ కళానగర్‌లో నిర్వహించి ?ప్రతి ఇంటిని జల్డెడ పట్టారు. ఆదివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్డన్ సర్చ్‌లో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లతోపాటు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. తొలుత మూడు కాలనీల రోడ్లన్నీ పోలీసులు చుట్టు ముట్టారు. ఒక్కో ఇంటికి తిరుగుతూ సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని రకాల వివరాలు సేకరించారు. మొత్తం 400 వందల ఇళ్లల్లో ప్రతి సమాచారం సేకరించారు. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ సిలెండర్, ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వాహనాలు ఎన్ని ఉన్నాయి. వాటికి లెసైన్‌సలు ఉన్నాయా.. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనుమానుతులు ఎవరైనా ఉంటున్నారా అనే వివరాలను సేకరించారు. ఈ కార్డన్ సర్చ్‌లో 8 మందిని అనుమానితులను, లెసైన్‌స లేకుండా ఉన్న 36 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను, 7 సిలెండర్లతోపాటు మరో ఇద్దరు బెల్ట్‌షాపు నిర్వాహకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఈ కార్డన్ సర్చ్‌ను నిర్వహించామన్నారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు అన్ని వివరాలు సేకరించిన తరువాత ఇవ్వాలని కోరారు. అపరిచితులు అనుమానితులు, కొత్తవారు ఎవరైనా కాలనీలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులు చేసే ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని, ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతోపాటు ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అల్వాల్ ఏసీపీ రఫీక్, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్, మేడిపల్లి ఇన్స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డితోపాటు మరో 9 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు. -
ఒకే ఒక్కడు!
► కానిస్టేబుల్ రఫీద్‌కు శౌర్య పతకం ► గత ఏడాది ప్రకటన ► పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రదానం చేసిన సీఎం మహబూబ్‌నగర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు అందించారు. వీటిని పొందిన వారిలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఒకే ఒక్క కానిస్టేబుల్ ఉన్నారు. కోయిలకొండ మండలం రామ్‌పూర్‌కు చెందిన రఫీద్ 2009లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తించిన పోలీసువిభాగం ముఖ్యమంత్రి శౌర్య పతకం ప్రదానం చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో గతేడాది ప్రభుత్వం రఫీద్‌కు ఈ పతకాన్ని ప్రకటించింది. గురువారం పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం చేతుల మీదుగా రఫీద్ ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని అందుకున్నారు. -
వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
నలుగురి అరెస్ట్ కుటుంబం కక్ష, డబ్బు కోసమే హత్య : సీఐ వి.కోట: జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్యకేసు చిక్కువుుడిని పోలీ సులు ఛేదించారు. కుటుంబ కక్షలకు తోడు డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. కుట్రలో భాగస్వావుులతోపాటు హంతకున్ని సైతం కటకటాల వెనక్కు నెట్టారు. కుప్పం సీఐ రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ హత్యోదంతాన్ని వివరించారు. వి.కోట వుండలంలోని వైసీ.బండపల్లెకు చెందిన రఫీక్ కువూరుడు షేక్ రిజ్వాన్(10) గత నెల 30న అనువూనాస్పద స్థితిలో దాబాల గుట్ట వద్ద గెవిలో శవమై తేలాడని తెలిపారు. అంతకువుుందు రోజు బాలుడు అదే గ్రావూనికి చెందిన బాబా కువూరుడు రిజ్వాన్‌బాషాతో చూసిన స్థానికులు ఈ విషయాన్ని తమకు తెలపడంతో పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో నిందితుడు అనేక విషయాలు చెప్పాడని సీఐ పేర్కొన్నారు. తను ప్రేమించిన యుువతిని వివాహవూడేందుకు డబ్బులను కిడ్నాప్ చేసి సంపాదించాలని భావించినట్టు తెలి పాడు. వి.కోటకు చెందిన స్నేహితులు షేక్ ఉవుర్షరీఫ్, ఫైరోజ్ అహ్మద్‌తో కలిసి ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలవునేరు వుండ లం మొరం గ్రావూనికి చెందిన షాకీరాబీకి, వైసీబండపల్లెకు చెందిన వుున్వర్‌కు గతంలో ఉన్న కుటుంబ తగాదాలను తెలుసుకుని వారిని సంప్రదించారని తెలిపారు. వుున్వర్‌కు సహాయుం చేస్తున్న రఫీక్ కువూరుడు షేక్ రిజ్వాన్‌ను గత గురువారం దాబాలగుట్ట వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. వీరు వూట్లాడుకుంటున్న వైనాన్ని గవునిం చిన బాలుడు పారిపోయే ప్రయుత్నం చేశాడని, రిజ్వాన్‌బాషా బాలుడి మెడ ను గట్టిగా పట్టుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని తెలిపా రు. చివరకు బాలుని గొంతుకు దారా న్ని బిగిం చి చంపి గెవిలో దాచిపెట్టి పారిపోయూరని పేర్కొన్నారు. అనువూనితుల కోసం డీఎస్పీ శంకర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆదివారం వి.కోట ఆర్టీసీ బస్టాండు సమీపంలో తచ్చాడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో ఎస్ఐలు ప్రభాకర్, పరశురావుుడు, చంద్రమోహన్, సిబ్బంది సహకరించినట్లు సీఐ తెలిపారు. -
11 ఏళ్ల క్రితం దొరికారు..ఇప్పటికీ నా బిడ్డలే..
ముంబై: ముంబై హైకోర్టు తీర్పుతో ఓ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. తమ బిడ్డల చదువు అర్థాంతరంగా ఆగిపోకూడదనే తమ పోరాటం గెలిచినందుకు పొంగిపోతోంది. మళ్లీ తమ బిడ్డలు తమ చెంతకు చేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే 11 ఏళ్ల క్రితం దొరికిన ఇద్దరు ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది ఓ కుటుంబం. అప్పటికే నలుగురు పిల్లలున్నా మా కెందుకులే అనుకోలేదు.. చేరదీసి విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ కుటుంబం అయోమయంలో పడిపోయింది. ఆ పిల్లలిద్దరూ తన పిల్లలే అంటూ ఓ మహిళ తెరపైకి వచ్చింది. దీంతో వివాదం మొదలైంది. వివరాల్లోకి వెళితే నలుగురు పిల్లలున్న రుబీనా షేక్, రఫీఖ్ దంపతులకు.. ఆరునెలలు, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఒక చెత్తకుప్పలో కనిపించారు. వారికి కైసర్,కౌజర్ అనే పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో ఆ ఇద్దరూ తన పిల్లలే అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు గత మార్చి 25న ఆ పిల్లలిద్దర్నీ దోంగ్రీలోని పునరావాస కేంద్రానికి తరలించారు. దీంతో మానసిక ఆందోళనకు గురైన తండ్రి రఫీఖ్ వారిని ఇంటికి పంపించాల్సింది కోరుతూ నాగ్‌పాద పోలీస్ స్టేషన్‌కు , చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి విజ్క్షప్తి చేశారు. చివరికి ఐదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నందువల్ల , పరీక్షలు రాసేందుకు పిల్లల్ని అనుమతించాలని కోరుతూ ముంబై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ముంబై హైకోర్టు ఆ పిల్లల్ని ఆ కుటుంబానికి అప్పగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవసరమైనపుడు పిల్లల్ని తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు కావాలని రఫీఖ్ దంపతులను ఆదేశించింది. అంతేకాకుండా డీఎన్ఏఎ పరీక్షలు నిర్వహించకుండా ...తన పిల్లలే అంటూ వచ్చిన మహిళను అసలు తల్లి ఆమెనని ఎలా నిర్థారిస్తారంటూ పోలీసులపై మండిపడింది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఏ ప్రాతిపదికన తల్లిదండ్రులను నిర్ణయిస్తారని పోలీసులను ప్రశ్నించింది. కాగా ఈ కేసులో ఒక్కసారి కూడా విచారణ నిమిత్తం సదరు మహిళ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ పిల్లలిద్దరినీ రఫీఖ్ దంపతులకు అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోర్టు నిర్ణయంతో తల్లి రుబీనా పరవశించిపోతోంది. తనకు చదువు రాదనీ, చట్టం తెలియదనీ, నాకు నా పిల్లలే ముఖ్యమంటోంది. బిడ్డలు తమ చెంతకు చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. నిజంగా పిల్లల అసలు తల్లి వస్తే... ఆమెకు బిడ్డల్ని సంతోషంగా అప్పగిస్తానంటోంది. అప్పటివరకు పిల్లలు తన దగ్గరే ఉండాలంటోంది. ఈ రెండు నెలలుగా చాలా బాధపడ్డామనీ, పిల్లల రాకతో మళ్లీ తమ ఇంట్లో పండగ వచ్చిందని రుబీనా మురిసిపోతుంది. మరోవైపు సంతోషం నిండిన ముఖాలతో పిల్లలిద్దరూ తల్లి అక్కున చేరారు. అమ్మానాన్నలనుంచి మమ్మల్ని వేరుచేయకండి.. ఎప్పటికి మాకు వారే కావాలి. మా ఇంటికంటే కంటే గొప్పది ఏదీ లేదంటున్నారు వారు. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్
టీనగర్, న్యూస్‌లైన్: రైలులో 9 లక్షల నకిలీ కరెన్సీనోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి రైలు ద్వారా చెన్నైకు నకిలీ కరెన్సీ నోట్లు తరలిస్తున్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. పోలీసు సూపరింటెండెంట్ పెరుమాల్ పర్యవేక్షణలో డీఎస్పీ రత్నమణి ఆధ్వర్యంలో చెన్నైకు వచ్చే రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీబీసీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రైలు నుంచి దిగిన సాహుల్ వ్యాసర్పాడిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పోలీసులు అతన్ని వెంబడించి విచారణ చేపట్టగా వెస్ట్ బెంగాల్ నుంచి సాహుల్ నకిలీ కరెన్సీ నోట్లను రైలులో తరలించినట్లు తెలిసింది. రఫిక్ ఆదేశాలతో నకిలీ కరెన్సీ నోట్లను అక్కడ నుంచి సాహుల్ తీసుకువచ్చినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి *500, *1000 నకిలీ కరెన్సీ నోట్లు తొమ్మిది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రఫిక్, సాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఫిక్ ఇది వరకే నకిలీ కరెన్సీనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. వెస్ట్ బెంగాల్లో ఎవరి వద్ద నుంచి రఫిక్ నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ తీవ్రవాది జాకీర్ హుసేన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు. రఫీక్‌ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు పోలీ సులు నిర్ణయించారు.