వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
నలుగురి అరెస్ట్ కుటుంబం కక్ష, డబ్బు కోసమే హత్య : సీఐ
వి.కోట: జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్యకేసు చిక్కువుుడిని పోలీ సులు ఛేదించారు. కుటుంబ కక్షలకు తోడు డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. కుట్రలో భాగస్వావుులతోపాటు హంతకున్ని సైతం కటకటాల వెనక్కు నెట్టారు. కుప్పం సీఐ రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ హత్యోదంతాన్ని వివరించారు. వి.కోట వుండలంలోని వైసీ.బండపల్లెకు చెందిన రఫీక్ కువూరుడు షేక్ రిజ్వాన్(10) గత నెల 30న అనువూనాస్పద స్థితిలో దాబాల గుట్ట వద్ద గెవిలో శవమై తేలాడని తెలిపారు. అంతకువుుందు రోజు బాలుడు అదే గ్రావూనికి చెందిన బాబా కువూరుడు రిజ్వాన్‌బాషాతో చూసిన స్థానికులు ఈ విషయాన్ని తమకు తెలపడంతో పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో నిందితుడు అనేక విషయాలు చెప్పాడని సీఐ పేర్కొన్నారు.
తను ప్రేమించిన యుువతిని వివాహవూడేందుకు డబ్బులను కిడ్నాప్ చేసి సంపాదించాలని భావించినట్టు తెలి పాడు. వి.కోటకు చెందిన స్నేహితులు షేక్ ఉవుర్‌షరీఫ్, ఫైరోజ్ అహ్మద్‌తో కలిసి ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలవునేరు వుండ లం మొరం గ్రావూనికి చెందిన షాకీరాబీకి, వైసీబండపల్లెకు చెందిన వుున్వర్‌కు గతంలో ఉన్న కుటుంబ తగాదాలను తెలుసుకుని వారిని సంప్రదించారని తెలిపారు. వుున్వర్‌కు సహాయుం చేస్తున్న రఫీక్ కువూరుడు షేక్ రిజ్వాన్‌ను గత గురువారం దాబాలగుట్ట వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. వీరు వూట్లాడుకుంటున్న వైనాన్ని గవునిం చిన బాలుడు పారిపోయే ప్రయుత్నం చేశాడని, రిజ్వాన్‌బాషా బాలుడి మెడ ను గట్టిగా పట్టుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని తెలిపా రు. చివరకు బాలుని గొంతుకు దారా న్ని బిగిం చి చంపి గెవిలో దాచిపెట్టి పారిపోయూరని పేర్కొన్నారు. అనువూనితుల కోసం డీఎస్పీ శంకర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆదివారం వి.కోట ఆర్టీసీ బస్టాండు సమీపంలో తచ్చాడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో ఎస్‌ఐలు ప్రభాకర్, పరశురావుుడు, చంద్రమోహన్, సిబ్బంది సహకరించినట్లు సీఐ తెలిపారు.