Raguramireddy panel
-
‘ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’
సాక్షి, వైఎస్సార్ కడప : నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లా లేవని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలపై ఆ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రాష్ట్రంలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్షలకు దిగారో సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించాలి. కడప జిల్లాకు ఏం సాధించారని చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్నారు. అధికారులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కచ్చితంగా ఆత్మ క్షోభిస్తుంది. అందరిని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ తనను మోసం చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. గత జన్మభుమికి చేసిన ఖర్చులకు సంబంధించిన నిధులను ఇంతవరకు మంజూరు చేయలేదు. తిరిగి నవనిర్మాణ దీక్షలు చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరి దొంగ నాటకాలు ఆడటం లేదంటూ’ రఘురామిరెడ్డి, సురేష్ బాబు పేర్కొన్నారు. -
ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్ ఘన విజయం
ప్రొద్దుటూరు క్రైం: ఎంతో ప్రతిష్టాత్మకంగా బుధవారం జరిగిన ప్రొద్దుటూరు తాటూకా ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి బరిలో దిగిన కెజె.రఘురామిరెడ్డికి 310 ఓట్లు రాగా చంద్రమౌళికి 196 ఓట్లు మాత్రమే వచ్చాయి. కార్యదర్శిగా పోటీ చేసిన అజయ్‌బాబు, మహిళా సహాయ కార్యదర్శిగా జయంతికుమారిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మిగిలిన 9 స్థానాలను రఘురామిరెడ్డి ప్యానెల్ అభ్యర్థులు గెల్చుకున్నారు. అధ్యక్షుడుగా కె.జె రఘురామిరెడ్డి(114), అసోసియేట్ ప్రెసిడెంట్(104), ఉపా«ధ్యక్షులు ఎల్.బాబు(117), చంద్రుడుయాదవ్(114), టి.దేవమణి(117), ఎం.రాఘవయ్య(103), జాయింట్ సెక్రటరీలుగా పిసి.బాలఆంథోని(107), బి.లక్ష్మిమునెయ్య(77), జి.లక్షుమయ్య(104), కె.రాజశేఖర్‌రెడ్డి(100), కోశాధికారిగా ఎన్.ఈశ్వరెడ్డి(100) ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షుడు రఘురామిరెడ్డితోపాటు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందచేశారు.