ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్‌ ఘన విజయం | Raghuramireddi panel NGO election victory | Sakshi
Sakshi News home page

ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్‌ ఘన విజయం

Published Wed, Sep 14 2016 10:03 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్‌ ఘన విజయం - Sakshi

ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్‌ ఘన విజయం

ప్రొద్దుటూరు క్రైం:  ఎంతో ప్రతిష్టాత్మకంగా బుధవారం జరిగిన ప్రొద్దుటూరు తాటూకా ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్‌ ఘన విజయం సాధించింది.  అధ్యక్ష స్థానానికి బరిలో దిగిన కెజె.రఘురామిరెడ్డికి  310 ఓట్లు రాగా చంద్రమౌళికి 196 ఓట్లు మాత్రమే వచ్చాయి. కార్యదర్శిగా పోటీ చేసిన అజయ్‌బాబు, మహిళా సహాయ కార్యదర్శిగా జయంతికుమారిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మిగిలిన 9 స్థానాలను రఘురామిరెడ్డి ప్యానెల్‌ అభ్యర్థులు గెల్చుకున్నారు. అధ్యక్షుడుగా కె.జె రఘురామిరెడ్డి(114), అసోసియేట్‌ ప్రెసిడెంట్‌(104), ఉపా«ధ్యక్షులు ఎల్‌.బాబు(117), చంద్రుడుయాదవ్‌(114), టి.దేవమణి(117), ఎం.రాఘవయ్య(103), జాయింట్‌ సెక్రటరీలుగా పిసి.బాలఆంథోని(107), బి.లక్ష్మిమునెయ్య(77), జి.లక్షుమయ్య(104), కె.రాజశేఖర్‌రెడ్డి(100), కోశాధికారిగా ఎన్‌.ఈశ్వరెడ్డి(100) ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షుడు రఘురామిరెడ్డితోపాటు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement