Rahmath nagar
-
ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు...
సాక్షి, బంజారాహిల్స్: నెల రోజులుగా తన భార్య ఫోన్లో విపరీతంగా మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించడంతో పాటు కొట్టానని ఇందుకు అలిగి తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని అనుమానాస్పదంగా అదృశ్యమైందంటూ బాధితుడు ఎల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని తల్లీ, పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వివరాలివీ... మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లప్ప భార్య మంగమ్మ అలియాస్ పద్మ, కూతుళ్లు సువర్ణ, స్వప్నలతో కలిసి రహ్మత్‌నగర్ వీడియో గల్లీలో అద్దెకుంటున్నారు. భార్య పద్మ యూసుఫ్‌గూడ చౌరస్తాలోని ఉడుపి హోటల్లో పని చేస్తున్నది. ఎప్పటిలాగే ఈ నెల 6న డ్యూటీకి వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చి చూడగా భార్యా, పిల్లలు కనిపించలేదు. దీంతో ఉడిపి హోటల్‌కు వెళ్లి ఆరా తీయగా పద్మ తన పిల్లలతో కలిసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పిందని వెల్లడించారు. దీంతో స్వగ్రామంతో పాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 62813 86209లో సంప్రదించాలని పోలీసులు కోరారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు -
రూ.4.50 లక్షలకు పసికందు అమ్మకం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : పుట్టిన నాలుగు రోజులకే పసికందును విక్రయించిన మహిళతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన అనూషకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత శనివారం రహ్మత్‌నగర్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును విక్రయించేందుకు అంతకుముందే రూ.4.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో డబ్బు తీసుకుని పసి కందును అప్పగించారు. ఈ వ్యవహారం పోలీసులదాకా వెళ్లడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన సంతోషిని అదుపులోకి తీసుకొని వారు ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యక్తి రూ.4.50 లక్షలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేశాడని, మధ్యవర్తిగా తనకు రూ. 50 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్ బాక్సింగ్ బ్రదర్స్.. కిక్స్ అదుర్స్
రహమత్‌నగర్: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కిక్ బాక్సింగ్‌లో రాణిస్తున్నారు కార్మికనగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు. అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధనలు చేస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తూ అంతర్రాష్ట్ర, జాతీయ పతకాలు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటన్నారు. రహమత్‌నగర్ డివిజన్ కార్మికనగర్‌కు చెందిన సయ్యద్ బషీర్, అంజమున్సిసా బేగం, దంపతులకు ఇద్దరు కుమారులు సుహైల్ (23) డిగ్రీ రెండో సంవత్సరం, సయ్యద్ సల్మాన్ (22) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బషీర్, ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. కిక్ బాక్సింగ్ పై ఆసక్తి ఉన్న అన్నదమ్ములిద్దరూ బంజారహిల్స్‌లోని ఓ కిక్ బాక్సింగ్ అకడామీలో శిక్షణ పొందారు. తొలిసారిగా 2011 నవంబర్‌లో చత్తీస్‌ఘడ్‌లో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీల్లో (అండర్ 18 60 కేజీస్) సోహెల్, సల్మాన్ ఇద్దరూ పాల్గొనగా సోహెల్ బ్రౌన్ మెడల్ సాధించాడు. తాజాగా జనవరి 21 న ఢిల్లీలోని కాల్కోట్ స్టేడియంలో జరిగిన పోటీల్లో కోల్కత్తా, కర్ణాటక బాక్సర్లను ఓటించి సోహెల్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో తలబడుతా.. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీ లు పోటీల్లో పాల్గొనడమే నా లక్ష్య ం. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ కఠోర సాధన చేస్తున్నా. ఇందుకు తమ తల్లి తండ్రులు మరింత పోత్సహిస్తున్నారు. ఏదో ఓ రోజు అంతర్జాతీయ స్థాయిలో తనబడుతాననే నమ్మకం ఉంది. – సోహెల్ తమ్ముడే ఆదర్శం.. తమ్ముడు సోహెల్‌ను ఆదర్శంగా తీçసుకొని ముందుకెళ్తా. నేను సైతం కిక్ బాక్సింగ్‌లో రాణించి రాష్ట్రానికి పేరుతెస్తా. తమ్ముడికి గోల్డ్ మెడల్ రావడం ఆనందంగా ఉంది. – సయ్యద్ సల్మాన్ చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
బాలుడి అదృశ్యం.. విషాదాంతం
హైదరాబాద్: నగరంలోని రహమత్‌నగర్ సమీపంలోని సంతోషిగిరిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. సంతోషిగిరికి చెందిన రాంప్రసాద్ కుమారుడు సంతోష్(7) ఈనెల 12వ తేదీన స్నేహితుడు నరేష్(10)తో కలిసి పీర్ల పండుగను చూసేందుకు అల్లాపూర్ వెళ్లాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా సంతోష్‌ను రైలు ఢీకొట్టింది. దీంతో నరేష్ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పట్టాల పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న సంతోష్‌ను రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. కాగా, దీనిపై అతడి తండ్రి రాంప్రసాద్ ఈనెల 14వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే బాలుడి అదృశ్యం వార్త ‘సాక్షి’ దినపత్రికలో చూసిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి ద్వారా తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని, తమ కుమారుడిని చూసుకున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో సంతోష్ శనివారం ఉదయం కన్నుమూశాడు. -
విద్యార్థిని అదృశ్యం
బంజారాహిల్స్ : స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే కె.సౌజన్య(12) సమీపంలోని ఎస్జీబీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నది. ఈ నెల 20వ తేదీన ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా రాత్రి గడిచినా రాలేదు. స్వగ్రామం, బంధుమిత్రుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో.. కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.