rahul ghosh
-
ఆసియా కంపెనీలకు గడ్డుకాలమే!
♦ 2016పై మూడీస్ నివేదిక ♦ చైనా మందగమనంపై ఆందోళన న్యూఢిల్లీ: ఆసియా కంపెనీలకు 2016 సవాళ్లను విసరనుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ రిసెర్చ్ అనలిస్ట్ రాహుల్ ఘోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మందగమనం, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు... ఆసియా వ్యాప్తంగా పలు దేశాల్లో 2016లో వృద్ధి మందగించడమో లేక స్థిరంగా ఉండడమో జరుగుతుంది. మూలధనం లభ్యతలో ఒడిదుడుకుల కారణంగా కార్పొరేట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. బలహీన ఆర్థిక వృద్ధి రేటు, కమోడిటీ ధరల పతనం వంటి అంశాలు పలు దేశాల్లో విదేశీ కరెన్సీ ఒడిదుడుకులు, తద్వారా క్రెడిట్ రిస్క్‌కు దారితీయవచ్చు. 6.5 శాతం ఎగువన వృద్ధి రేటును నిలబెట్టడం, సంస్కరణల అమలు, ఆర్థిక సమతౌల్యత, ద్రవ్య స్థిరత్వం వంటి అంశాలు చైనాకు సవాళ్లు. ఆయా అంశాలు ఆసియా మొత్తం ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. 2015 తరహాలోనే 2016లో కూడా కార్పొరేట్ క్రెడిట్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఆయా అంశాలు మరింత రేటింగ్ ఒత్తిళ్లకు, డిఫాల్ట్స్కు దారితీయవచ్చు. ప్రత్యేకించి స్పెక్యులేటివ్ గ్రేడ్ కంపెనీలపై ఆయా అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. తగిన ద్రవ్య పరపతి విధానాలు, స్థానిక బాండ్ మార్కెట్స్, బ్యాంకింగ్‌లో పటిష్ట నిధుల పరిస్థితులు, రీఫైనాన్సింగ్ అవసరాలను నిర్వహించగలిగిన సత్తా వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థలకు కొంత మేలు చేస్తాయి. ఆసియా బ్యాంకుల విషయానికి వస్తే... రుణ నాణ్యత, లాభాలు క్షీణించనున్నాయి. వృద్ధి మందగమనం వల్ల బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రం కావచ్చు. -
రాహుల్ కోలుకుంటున్నాడు: వైద్యులు
స్థానిక లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రాహుల్ ఘోష్ (20) పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతడి మెదడులో గడ్డకట్టిన రక్తం కూడా క్రమంగా తగ్గుతోందని డాక్టర్ బుద్ధదేవ్ సాహా చెప్పారు. ప్రస్తుతం అతడికి ద్రవాహారం మాత్రమే ఇస్తున్నారు. త్వరలోనే ఘనపదార్థాలు కూడా ఇస్తామని సాహా తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా రాహుల్‌కు సూప్ ఇచ్చారు. మరికొన్ని రోజులు అతడిని పరిశీలనలోనే ఉంచుతామని, మూడోసారి కూడా ఎంఆర్ఐ తీయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్లబ్ మ్యాచ్ జరుగుతుండగా రాహుల్ ఘోష్్కు తలమీద ఎడమవైపు బంతి తగిలింది. సరిగ్గా బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్ అంకిత్ కేసరి మరణించిన తర్వాతిరోజే రాహుల్ గాయపడటం గమనార్హం. ఘోష్ చికిత్సకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చెప్పింది. -
నిలడకగా రాహుల్ ఘోష్ ఆరోగ్యం
కోల్‌కతా: స్థానిక లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన కోల్‌కతా ఆటగాడు రాహుల్ ఘోష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. మంగళవారం జరిగిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) రెండో డివిజన్ లీగ్ మ్యాచ్‌లో తను గాయపడ్డాడు. పోలీస్ ఏసీ తరఫున ఆడిన తనకు చెవి కింది భాగంలో బంతి వేగంగా వచ్చి తగిలింది. అయితే అతను బాగానే కోలుకుంటున్నా పరిశీలన నిమిత్తం ఇంకా ఐసీయూలోనే ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. మరోసారి తీసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కూడా ఆందోళనకరంగా ఏమీ లేదని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవ్యసాచి సేన్ తెలిపారు. ఇప్పటికిప్పుడు డిశ్చార్జి మాత్రం చేయబోమని స్పష్టం చేశారు.