Raigad district
-
మన్యం థెరిసా
‘ఆమె చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి’ అని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల ట్విటర్లో కామెంట్ చేశారు. 75 ఏళ్ల రూపాలి జకాకాను రాయగడ జిల్లాలోని మన్యంప్రాంతంలో మన్యం థెరిసాగా పిలుచుకుంటారు. దానికి కారణం గవర్నమెంట్‌తో ఏ పని జరగాలన్నా ఈమె సాయం చేయాల్సిందే. మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను. – జకాకా మన్యంలోని సాహి అనే గ్రామంలో చీకటి పడి భోజనాలు అయ్యాక ఒక్కొక్కరుగా రూపా లి జకాకా ఇంటికి చేరుకుంటారు. అక్కడ సభ తీరి తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆమె అన్నీ వింటుంది. ఎవరికి ఏ సాయం కావాలో, ఏ పథకం ద్వారా సాయం అందించాలో జ్ఞాపకం పెట్టుకుంటుంది. తెల్లవారి లేచి ఇంట్లో పనులు ముగించుకుని ఊర్లో ఉన్న స్కూల్ దగ్గరకు వెళుతుంది. అక్కడి హెడ్మాస్టర్కు ఆమె ఏ పని మీద వచ్చిందో తెలుసు. ఒక్కొక్కరి పేరు ఆమె చెబుతుంటే వారి పేరుతో అప్లికేషన్లు రాసి సహాయం చేస్తాడు. ఆమె వాటిని అధికారులకు చేరవేయడానికి బయలుదేరుతుంది. దాదాపుగా ఇది ఆమె దినచర్య.ఒరిస్సా రాయగడ జిల్లాలోని హలువా పంచాయతీలో సాహితో సహా 18 గ్రామాలు ఉన్నాయి. అన్నీ ఆదివాసీ గ్రామాలే. పెద్ద వాళ్లంతా దాదాపుగా నిరక్షరాస్యులే. వారందరి సమస్యలు తీర్చే స్వచ్ఛంద కార్యకర్త రూపా లి జకాకా. భర్త మరణంతో రూపా లి జకాకాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త అంతర్ జకాకాకు జబ్బు చేసింది. హలువాలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేతనైన వైద్యం చేశారుగాని అది సరిపోలేదు. ఇంతకు మించి వైద్యం చేయాలంటే రాయగడ వెళ్లాలి. ఉచిత వైద్యం పొందాలి. అది ఎలాగో చెప్పమని వారినీ వీరినీ బతిమాలింది. ఎవరూ సాయం చేయలేదు. భర్త మరణించాడు. కూతురితో జకాకా మిగిలింది. ‘మన బతుకులు ఇంతేనమ్మా. దిక్కులేని బతుకులు. వీరి కోసం ఏదైనా చేయి నువ్వు’ అని ముసలి తండ్రి అన్నాడు. ఆ మాటలు జకాకా మీద పని చేశాయి. అప్పటికి ఆమె వంట చెరకు సేకరించి అమ్మి బతుకుతోంది. ఇల్లు కూడా సరిగా లేదు. అయినా సరే తన బాగు చూసుకోక అందరి కోసం పని చేయడం మొదలుపెట్టింది. గత 40 ఏళ్లుగా చేస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం, ఆదివాసీల కోసం ఏమేం పథకాలు నిర్వహిస్తోందో కనుక్కుని అవన్నీ అందేలా సాయం చేస్తోంది జకాకా. ‘మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను’ అంటుంది జకాకా. పథకాలు అందాలంటే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ చాలా ముఖ్యమని ఆమె తెలుసుకుంది. అందుకే తన పంచాయతీలో చావు, పుట్టుక జరిగితే సర్టిఫికెట్లు తీసుకోమని వెంట పడుతుంది. అవి వచ్చేలా చూసి వారి కుటుంబ సభ్యులకు వాటిని అందిస్తుంది. 5000 మందికి సాయం ఇంత వయసు వచ్చినా జకాకాలో చరుకుదనం పోలేదు. ఎంత దూరమైనా నడుస్తుంది. కంటి చూపుకు ఢోకా లేదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊళ్లోనో చుట్టుపక్కల పల్లెల్లోనో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి ఆమె 5000 మందికి సాయం అందించినట్టు అధికారులే లెక్క తేల్చడం కాదు... ఇటీవల రాయగడకు పిలిచి సన్మానం కూడా చేశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి ‘ప్రజల కోసం ఉద్దేశించిన పథకాలు అట్టడుగు స్థాయికి చేరాలంటే ఇటువంటి వారు చేసే కృషి స్ఫూర్తి కావాలి’ అన్నారు. జకాకా ఇప్పుడు తన కూతురు, మనవరాలు, మనవడితో కలిసి జీవిస్తోంది. పంట పొలాల్లో పని ఉంటే చేస్తోంది. అధికారులు ఆమెకు 20 కేజీల బియ్యం, 500 రూపా యల నగదు ప్రతి నెలా అందేలా శాంక్షన్ చేశారు. ఇప్పటికీ ఆమె ఇల్లు అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే తన కోసం కాకుండా ఊరి జనాల కోసం ఆమె తిరుగుతూనే ఉంటుంది. సాటి వారికి సాయం చేయడంలో సంతృప్తే ఆమెకు సంజీవనిలా పని చేస్తున్నట్టుంది. -
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా 9 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్ జిల్లా మంగావ్ ప్రాంతంలోని ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితోపాటు తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రేపోలి గ్రామం వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితులందరూ బంధువులని, కారులో రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు. -
కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి...
"తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష" అనే చిన్నప్పటి పద్యం మనకు జీవితాంతం అడుగడుగున ఉపకరిస్తుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, సంఘర్షణల సమయయంలో మనం ఎలా వ్యవహరించాలో తెలుపుతుంది ఈ పద్యం. కోపం అనే చిన్న అవలక్షణం కారణంగా పతనమైపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. క్షణికావేశంతో కోపంలో చేసే పనులు కారణంగా తనను తానే కోల్పోవడం లేదా జీవితాంత ఆవేదనతో బతకడమో జరుగుతుంది. ఎంతో మంది యువత కూడా ఈ ఆగ్రహమనే గ్రహానికి బలైపోతున్నారు. అచ్చం అలనే ఇక్కడో మహిళ క్షణికమైన కోపావేశాలకు గురై తన సంతానాన్ని తానే కడతేర్చింది. వివరాల్లోకెళ్తే....మహారాష్ట్రాలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆ ఆరుగురు చిన్నారుల్లో ఐదుమంది బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు. (చదవండి: గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం) -
మహారాష్ట్రలో కొండచరియలు విరిగి 32 మంది మృతి
ముంబై: భారీ వర్షాలు మహారాష్ట్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు ముంచెత్తడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని కొండ చరియల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. మరో 30 మంది కొండ చరియల కింద చిక్కుకున్నట్లు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. -
సరిహద్దులో రాయల్ బెంగాల్ టైగర్
రాయగడ: ఒడిశాలోని రాయగడ–కొరాపుట్, నవరంగ్‌పూర్, కలహండి, గజపతి, జిల్లాలకు సంబంధించిన అడవికి రాయల్‌బెంగాల్ అభయారణ్యంగా గుర్తింపు ఉండేది. గత 50సంవత్సరాలుగా ఈ అడవుల్లో పులుల అక్రమ రవాణా ముఠా, వేటగాళ్ల వల్ల పులుల సంతతి సంపూర్ణంగా అంతరించిపోయింది. ప్రసిద్ధి చెందిన రాయల్‌బెంగాల్ టైగర్ వంశం 10సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు అటవీశాఖ భావించింది. 10సంవత్సరాలలో రాయగడ జిల్లా సరిహద్దుల్లో గానీ, రాయగడ జిల్లా అడవిలో కానీ సాధారణ పులులు తప్ప రాయల్‌బెంగాల్ టైగర్ సంతతి ఉన్నట్లు ఏ సర్వేలో కూడా తెలియరాలేదు. కానీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాయగడ, కలహండి జిల్లా సరిహద్దుల్లో రైలు పట్టాలపై రాయల్ బెంగాల్ టైగర్ కనిపించినట్లు వాట్సాప్‌ల ద్వారా తెలియవచ్చింది. ఇది తెలిసిన వెంటనే రాయగడ జిల్లా అటవీశాఖ అధికారులు జిల్లా సరిహద్దు అడవిలో రాయల్ బెంగాల్ టైగర్ కాలిముద్రలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం బయల్దేరింది. జిల్లా సరిహద్దులో గత 10సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ప్రజల దృష్టికి రాయల్టైగర్ కనిపించిది. 10సంవత్సరాల క్రితం అటవీశాఖ అధికారులు జంతువుల జనాభా లెక్కల్లో రాయగడ జిల్లా అడవిలో 3పులులు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఏ జాతి పులులన్నది తెలియరాలేదు. -
పట్టాలు తప్పిన రైలు: 12 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రోహ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగో థానే, రోహ స్టేషన్ల మధ్య నిది అనే గ్రామం వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు దివా సావంత్వాది ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తోపాటు నాలుగు బోగిలు పట్టాలు తప్పాయి. ముంబైకు 120 కిలోమీటర్లు దూరంలోని కొంకణ్ రైల్వే మార్గంలో ఆ ప్రమాదం సంభవించిందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ. 50 వేలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.10 వేలు నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖార్గే ప్రకటించారు. రైలు ప్రమాదం కారణంగా కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి.