rail neer plant
-
రైల్వేలో మోసం, ప్రయాణికుడి దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..
హర్యానా రాష్ట్రంలోని అంబాలా రైల్వే డివిజన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల వద్ద నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ట్రైన్ నెంబర్ 12232 లక్నో ఎస్ఎఫ్ ఎక్సెప్రెస్లో చంఢీఘడ్ నుంచి షాహ్‌జాన్ పూర్‌కు ప్రయాణిస్తున్న శివం భట్‌కు ట్రైన్లో చేదు అనుభవం ఎదురైంది. ఐఆర్సీటీసీ అమ్మే ‘రైల్ వాటర్’ బాటిల్ ఎంఆర్పీ రేటు రూ.15 ఉంటే..సేల్స్ మెన్ దినేష్ తన వద్ద నుంచి రూ.20 వసూలు చేశారని వాపోయాడు. రైల్వేలో జరుగుతున్న మోసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. No matter how much we complain, how much we confront them but nothing will improve, bcz @RailMinIndia never takes solid action against the root cause of this loot. This happened last night in train 12232 under @drm_umb jurisdiction.@AshwiniVaishnaw @RailwayNorthern @GM_NRly pic.twitter.com/F5BoVeUb6u — Shivam Bhatt 🇮🇳 (@_ShivamBhatt) December 14, 2022 ఆ వీడియోలో మనం ఎంత ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే దోపిడి చేస్తున్న వారిపై ఎప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇది గత రాత్రి ట్రైన్ నెంబర్ 12232లో ఎంఆర్పీ రేట్లు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ నార్తన్ రైల్వేకు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. CTIs, CMIs and ticket checking staff has been sensitized to curb the menace of unauthorised vending and overcharging. An intensive drive against this menace is also being conducted in association with RPF under advice of Competent Authority. — DRM Ambala NR (@drm_umb) December 15, 2022 మరో ట్వీట్లో,రైలు 12232లో ప్యాంట్రీ, మేనేజర్ లేరని వాటర్ బాటిల్ అమ్మేవాళ్లు చెబుతున్నారు. అంటే ఎవరైనా రైలు ఎక్కవచ్చు,రైల్ నీరును ఎంత ధరకైనా అమ్మువచ్చు? అని ప్రశ్నించారు. నెటిజన్ వరుస ట్వీట్లపై నార్తన్ రైల్వే స్పందించింది. రైల్ నీరును అధిక రేట్లకు అమ్ముతున్న విక్రేతని అరెస్ట్ చేశామని తెలిపింది. -
విజయవాడలో రైల్‌నీర్ ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో 2016 సెప్టెంబర్‌లోపు రైల్‌నీర్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించినట్టు తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన ‘రైల్ నీర్’ అందించేందుకు తీసుకుంటున్న చర్యలు, విజయవాడ డివిజన్లో రైల్‌నీర్ ప్లాంట్ ఎప్పటిలోపు పూర్తి చేయనున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న ఆరు రైల్‌నీర్ ప్లాంట్లకు అదనంగా విజయవాడ సహా మరో ఆరు కొత్త ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. త్వరలో ఏపీ ఎక్స్‌ప్రెస్: రైల్వే సహాయ మంత్రి విజయవాడ- న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ప్రతి రోజు నడిచే ఈ రైల్లోని అన్ని కోచ్‌లు పూర్తి ఎయిర్ కండిషన్డ్‌గా ఉంటాయని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏవైనా ప్రతిపాదనలు వచ్చాయా’ అని ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సిన్హా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది రైల్వే కోచ్‌లెన్ని తయారు చేశారు: ఎంపీ మేకపాటి ‘ఈ ఏడాది అవసరమైన రైల్వే కోచ్‌ల సంఖ్య, ఇప్పటి వరకు ఎన్ని అందుబాటులో ఉన్నాయి’ అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో 3,314 కోచ్‌లను తయారు చేసినట్టు మంత్రి మనోజ్ సిన్హా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2013-14 ఏడాదిలో 3,658 కోచ్‌లు, 13,162 వ్యాగన్లు అవసరం ఉన్నట్టు అంచనా వేసినట్టు తెలిపారు.