Rail transport
-
AP: రైలు ప్రయాణికులకు శుభవార్త.. 22 నుంచి రైళ్ల సంఖ్య పెంపు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా కాకినాడ టౌన్–లింగంపల్లి–కాకినాడ మీదుగా రైళ్ల రవాణా సంఖ్యను పెంచామని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ గురువారం వెల్లడించారు. చదవండి: తీర్థ యాత్రలకు ప్రత్యేక పర్యాటక రైళ్లు నంబర్ 07275 రైలు కాకినాడ టౌన్–లింగంపల్లి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 22, 25 ,27, 29 వరకు ఈ సంఖ్యను పెంచామని తెలిపారు. అలాగే 07276 నంబర్ రైలు లింగంపల్లి–కాకినాడటౌన్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 23, 26, 28, 30వ తేదీల వరకు రైళ్ల సంఖ్యను పెంచామని చెప్పారు. -
నేపాల్ సర్వతోముఖాభివృద్ధికి సాయం
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీ: భారత్-నేపాల్‌ల మధ్య గత నాలుగు నెలలుగా చెదిరిన ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడినపెట్టే దిశగా ఇరు దేశాలు విస్తృత చర్చలు చేపట్టాయి. రవాణా, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్-ముజఫర్‌పూర్ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు. అనంతరం ఓలీ సమక్షంలో మోదీ మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌లో శాంతి, సుస్థిరత వెల్లివిరియాలని కోరుకుంటున్నామని ఆ దేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఓలీ మాట్లాడుతూ భారత్ ఎప్పటికీ తమ సన్నిహిత మిత్ర దేశంగా ఉంటుందన్నారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్ బంగ్లాదేశ్‌ల మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం. విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. -
విజయవాడ హైవే బంద్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: రహదారులకు గండ్లు. రోడ్లపై పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు, రైలు రవాణా స్తంభించింది. నల్లగొండ జిల్లాలోనైతే రోడ్డు, రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడలను కలిపే 65వ నెంబరు జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తింది. కట్టంగూరు మండల పరిధిలోని మునుకుంట్ల, కలిమెర, కట్టంగూరు చెరువుల నుంచి వచ్చిన వరద నీరు ముంచెత్తడంతో కట్టంగూరు వద్ద హైవేపై నీరు పొంగిపొర్లుతోంది. దాంతో అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలను సూర్యాపేట వద్ద దారి మళ్లించి జనగామ మీదుగా హైదరాబాద్‌కు పంపుతున్నారు. ైదాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన దాదాపు 50 బస్సులను రద్దు చేసినట్టు ఎంజీబీఎస్ ఏటీఎం-1 సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.45 గంటల నుంచి అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కొన్నిం టిని జనగాం, తిరుమలగిరి, సూర్యాపేట మీదగా పంపుతున్నామని, దాంతో 45 కి.మీ. దూరం పెరుగుతుందని చెప్పారు. ఇక బీబీనగర్-నడికుడి రైల్వే మార్గంలో తిప్పర్తి మండలం రామలింగాల గూడెం వద్ద వరద నీరు రైల్వే ట్రాక్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. దాంతో రైల్వే సర్వీసులనూ నిలిపివేశారు. గుంటూరు-మాచర్ల నుంచి నాగార్జున సాగర్ మీదుగా పెద్దవూర, కొండమల్లేపల్లి గుండా హైదరాబాద్ వచ్చే మార్గం మాత్రమే సాఫీగా ఉంది. మరోవైపు శ్రీశైలం-విజయవాడ మధ్య చంద్రవంక ప్రవాహ ఉధతితో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌ను వేరే మార్గంలోకి మళ్లించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లు వందలాది కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి.