Railway construction
-
కోల్ కారిడార్‌కు మోక్షం కలిగేనా?
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గుగనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు(ఘన్పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అధికారులు దీనికి ‘కోల్ కారిడార్’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2010లో అప్పటి పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ప్రతిపాదనను మరోసారి అప్పటి రైల్వేమంత్రి దృష్టికి తీసుకుపోగా.. సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఈ లైన్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. కోల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే అటవీ ప్రాంతాలైన మంథని, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఆ రెండు లైన్లకు ఆమోదం లభించేనా? జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడే విధంగా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్ -హసన్‌పర్తి వరకు కొత్త లై న్ వేయాలని అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అవి ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. కనీస సౌకర్యాలు కలిగేనా? జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. సౌకర్యాలపై అధికారులు సైతం శ్రద్ధ చూపడంలేదు. రామగుండం రైల్వేస్టేషన్లో రెండో వైపు కూడా టికె ట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి వద్ద, కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం అత్యవసరం. గత డిసెంబర్లో రామగుండం రైల్వే ప్రధాన గేటు వద్ద కుప్పకూలిన బ్రిడ్జి నిర్మా ణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో పలు మార్గాల నిర్మాణం సగం వర కు పూర్తికావడంతో ఆయా ప్రాంతాల నుం చి సమీప ప్రాంతాలకు పుష్పుల్ రైలు నడపాలనే డిమాండ్ వస్తోంది. ప్రజా విజ్ఞప్తుల పై గత ఎంపీలు సైతం ఏకీభవించారు. కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్పల్లి మధ్య పుష్పుల్ రైలు నడపాలని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వర కు మరో రైలు నడపాల్సిన అవసరముంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగేనా? చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్ఫాస్ట్ రైలు నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), చంద్రాపూర్ (మహారాష్ట్ర) మినహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆగదు. కనీసం రామగుండం, మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ రైలును పెద్దపల్లిలో నిలుపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రామగుండంలో రైల్వేస్టేషన్లో నవ్‌జీవన్, జైపూర్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు ఏళ్ల నుంచి కోరుతున్నారు. -
గోదావరి కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ దేవరపల్లి / ద్వారకాతిరుమల: వచ్చే ఏడాది ఆగస్టులో జరుగనున్న గోదావరి కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. దేవరపల్లి, ద్వారకా తిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 144 ఏళ్లకు ఒకసారి గోదావరి కుంభమేళా వస్తుందని.. వచ్చే ఏడాది రానున్న కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరి ఒడ్డున ప్రత్యేక స్నానఘట్టాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. కొవ్వూరు, రాజ మండ్రిలో స్నానఘట్టాలను పరి శీలిం చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్ల్లాట్ఫారాలను విస్తరించాలి కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాలను విస్తరించాల్సి ఉందని ఎంపీ అన్నారు. ఇందుకు రైల్వే మంత్రి సదానంద గౌడ్‌ను కలిసి మాట్లాడానని చెప్పారు. రాజమండ్రిలో అండర్ డ్రైయినేజీ నిర్మాణం, పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థ నీటిని గోదావరిలో వదలకుండా ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటుచేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నామన్నారు. పట్టణాల్లోని మురుగునీటిని గోదావరిలోకి వదలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడిని కలిసి నిధులు మంజూరు చేయమని కోరామన్నారు. రేవుల వద్ద విశ్రాంతి షెడ్లను నిర్మించాల్సి ఉందని ఎంపీ మురళీమోహన్ అన్నారు. త్వరలో అధికారులతో సమావేశం కుంభమేళా ఏర్పాట్లపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఎంపీ చెప్పారు. కొవ్వూరు-రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జిని టూరిజం ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణం కోసం కృషిచే స్తున్నామని తెలిపారు. కుంభమేళా కోసం ఏర్పాట్లను 10 నెలల్లో పూర్తి చేసేం దుకు ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులకు సూచించారు. వంతెనల మరమ్మతులకు హామీ పోలవరం, తాడిపూడి కాలువలపై ఉన్న వంతెనల జాయింట్లు దెబ్బతినటంతో ప్రమాదాలు జరుగు తున్నాయని టీడీపీ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సంబందిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో ఆర్ గోవిందరావు, తహసిల్దార్ అక్బర్ హుస్సేన్, సీఐ ఎం.బాలకృష్ణ, టీడీపీ సుంకర దుర్గారావు, ముళ్లపూడి వెంకట్రావు, కొయ్యలమూడి చినబాబు పాల్గొన్నారు. -
ప్రారంభమైన రైల్వే పనులు
ధరూరు, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని కొండాపురం గ్రామం వద్ద నిలిచిపోయిన రైల్వే నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. బుధవారం పనులను మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి నిలిపి వేశారని సంబందిత కాంట్రాక్టర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అభివృద్ది పనులను అడ్డుకోవడం మంచి పద్దతి కాదంటూ వాటిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరుండి చేయించారు. కాంట్రాక్టర్‌కు అండగా ఉండి పనులను ఆయన రైతులతో కలిసి ప్రారంభించారు. పనులు ప్రారంభం కావడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలోనే మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి అదే మార్గంలో వెళ్లి ఈర్లబండ గ్రామానికి వెళ్లే నెట్టెంపాడు కాలువను పరిశీలించి తిరిగి వచ్చారు.